త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chiranjeevi | ఓటీటీ కోసం చిరంజీవి టాక్ షో – సినిమాల‌కు మించి రెమ్యూన‌రేష‌న్‌?

టాక్ షో ట్రెండ్‌లోకి మెగాస్టార్ చిరంజీవి అడుగుపెట్ట‌బోతున్నారు. దిగ్గ‌జ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కోసం ఓ సెలిబ్రిటీ టాక్ షో చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. త‌న సినీ జీవిత విశేషాలు, సూప‌ర్ హిట్ సినిమాల తెర వెనుక సంగ‌తుల‌ను ఈ టాక్ షో ద్వారా చిరంజీవి స్వ‌యంగా అభిమానుల‌తో పంచుకోబోతున్న‌ట్లు చెబుతున్నారు. ఈ ఓటీటీ షో కోసం చిరంజీవి రికార్డ్ రెమ్యూన‌రేష‌న్‌ను స్వీక‌రించిన‌ట్లు టాక్ వినిపిస్తోంది.

N

Entertainment | Published On Sep 28, 2026, 4.48 pm IST

Chiranjeevi | ఓటీటీ కోసం చిరంజీవి టాక్ షో  – సినిమాల‌కు మించి రెమ్యూన‌రేష‌న్‌?
Advertisement

Chiranjeevi |  మెగాస్టార్ చిరంజీవి ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఓ టాక్ షో చేయ‌నున్న‌ట్లు చెబుతున్నారు. ప్ర‌స్తుతం బాలీవుడ్‌, టాలీవుడ్ అనే తేడాలు లేకుండా అన్ని ఇండ‌స్ట్రీల‌లో టాక్ షోల ట్రెండ్‌ న‌డుస్తోంది. తెలుగులో బాల‌కృష్ణ చేసిన అన్‌స్టాప‌బుల్ పెద్ద హిట్ట‌య్యింది. రానా, స‌మంత‌, జ‌గ‌ప‌తిబాబుతో పాటు ప‌లువురు స్టార్స్ ఓటీటీల కోసం టాక్ షోలు చేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ట్రెండ్‌లోకి అడుగుపెట్ట‌బోతున్నారు.

నెట్‌ఫ్లిక్స్‌...

దిగ్గ‌జ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కోసం ఓ వెరైటీ సెలిబ్రిటీ టాక్ షో చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. త‌న సినీ జీవిత విశేషాలు, కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న క‌ష్టాలు.. ప‌లు సూప‌ర్ హిట్ సినిమాల తెర వెనుక ముచ్చ‌ట్ల‌తో పాటు టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, డైరెక్ట‌ర్ల‌తో త‌న‌కున్న అనుబంధాన్ని ఈ షో ద్వారా చిరంజీవి స్వ‌యంగా అభిమానుల‌తో పంచుకోనున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. టాలీవుడ్‌కు చెందిన ప‌లువురు సెలిబ్రిటీలు... చిరంజీవి టాక్ షోకు గెస్ట్‌లుగా హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. బీవీఎస్ ర‌వి షో ర‌న్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌చ‌నున్న ఈ ఓటీటీ షోను చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మించ‌నున్న‌ట్లు తెలిసింది. త్వ‌ర‌లోనే చిరంజీవి టాక్ షోపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

రెమ్యూన‌రేష‌న్‌...

ఈ టాక్ షో కోసం కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ రెమ్యూన‌రేష‌న్‌ను చిరంజీవి అందుకోబోతున్న‌ట్లు చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఒక్కో సినిమాకు 70 కోట్ల వ‌ర‌కు పారితోషికం స్వీక‌రిస్తున్నారు మెగాస్టార్‌. చిరంజీవికి ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్‌లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ షో కోసం వంద కోట్ల రెమ్యూన‌రేష‌న్‌ను ఆఫ‌ర్ చేసిన‌ట్లు టాక్ వినిపిస్తోంది.

సంక్రాంతికి కాకా...

ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్ బాబీతో కాకా సినిమా చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది సంక్రాంతికి థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. కాకా సినిమాలో అన‌స్వ‌ర‌ రాజ‌న్‌, నివేదా పేతురాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కాకాతో పాటు చిరంజీవి హీరోగా న‌టించిన మ‌రో మూవీ విశ్వంభ‌ర కూడా సంక్రాంతికే థియేట‌ర్ల‌లోకి రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

Advertisement
Advertisement