Chiranjeevi | తండ్రిగా గర్వపడుతున్నా – రామ్‌చరణ్ పెద్దిపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ
పెద్ది మూవీకి వస్తోన్న రెస్పాన్స్‌ఫై మెగాస్టార్ చిరంజీవి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే తండ్రిగానే కాకుండా నటుడిగా ఎంతో గర్వంగా అనిపిస్తోందని అన్నారు. తనయుడు రామ్‌చరణ్‌పై మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు.
Entertainment | Published On Jun 4, 2026, 2.21 pm IST
రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది మూవీ గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించాడు. తెలుగు రాష్ట్రాల్లో ఓ రోజు ముందుగానే ప్రీమియర్స్‌తో పెద్ది సందడి మొదలైంది. ఈ ప్రీమియర్స్‌కు పాజిటివ్ టాక్ వచ్చింది. చరణ్ యాక్టింగ్, క్రికెటర్‌గా, రెజ్లర్‌గా అతడి ట్రాన్స్‌ఫర్మేషన్‌తో పాటు బుచ్చిబాబు టేకింగ్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అదిరిపోయాయని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతోన్నారు.పెద్ది మూవీకి వస్తోన్న రెస్పాన్స్‌పై మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. తండ్రిగానే కాకుండా నటుడిగా చరణ్‌ను చూస్తుంటే గర్వంగా ఉందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
మనసంతా పెద్ది దగ్గరే...
"నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది. గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ దగ్గర నుంచి చూశా. ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది. “పెద్ది” పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం" అంటూ తనయుడు రామ్‌చరణ్‌పై ప్రశంసలు కురిపించారు చిరంజీవి.
రాజీ లేకుండా...
""పెద్ది లాంటి అద్భుతమైన కథను రాయడమే కాకుండా అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు దర్శకుడు బుచ్చిబాబు సానా. తన తొలి సినిమానే ఇంత భారీ స్థాయిలో, ఎలాంటి రాజీ లేకుండా నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మించారు. పెద్ది సినిమాలో నటించిన కరునాడ చక్రవర్తి శివరాజ్‌కుమార్, అప్పలసూరి పాత్రలో అద్భుతంగా జీవించిన నా సోదర సమానుడు జగపతిబాబుకు అభినందనలు" అని చిరంజీవి అన్నారు.
గర్వంగా నిలవాలి...
"అద్భుతమైన పాటలు, హృదయాన్ని కదిలించిన నేపథ్య సంగీతాన్ని ఈ సినిమాకు అందించారు ఏఆర్ రెహమాన్.తన ఛాయాగ్రహణంతో ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా మలిచారు రత్నవేలు. ఈ చిత్రం విజయంలో భాగమైన జాన్వీ కపూర్, దివ్యేందుతో పాటు ఇతర నటీనటులకు నా హృదయపూర్వక అభినందనలు. “పెద్ది” సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమా కి గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని చిరంజీవి పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Janhvi Kapoor | పెద్ది రిలీజ్ వేళ – తిరుమలలో జాన్వీ కపూర్ సందడి – కాలినడకన శ్రీవారి దర్శనం
జూన్ 4, 2026

Peddi Review | పెద్ది రివ్యూ – రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది – జాన్వీ కపూర్ మైనస్!
జూన్ 4, 2026

Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? ‘పెద్ది’ ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?
జూన్ 3, 2026
తాజావార్తలు
- ●Maruti Suzuki WagonR E85 | పెట్రోల్ భారం ఇక తప్పుతుందా? 85% ఇథనాల్‌తో నడిచే తొలి కారు వచ్చేసింది!
- ●Instagram | మీ ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అవొద్దు అంటే.. ఈ సింపుల్ సెట్టింగ్ ను వెంటనే ఆన్ చేయండి..
- ●Mupparam | ప్రైవేట్ బడికి పంపితే ప్రభుత్వ పథకాలు కట్.. ముప్పారం గ్రామసభ తీర్మానం
- ●Janhvi Kapoor | పెద్ది రిలీజ్ వేళ - తిరుమలలో జాన్వీ కపూర్ సందడి - కాలినడకన శ్రీవారి దర్శనం
- ●Chirumarthi Lingaiah | కేసీఆర్‌ను అంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
- ●Rains | రాబోయే 2 గంటల్లో.. తెలంగాణలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు

Maruti Suzuki WagonR E85 | పెట్రోల్ భారం ఇక తప్పుతుందా? 85% ఇథనాల్‌తో నడిచే తొలి కారు వచ్చేసింది!

Instagram | మీ ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అవొద్దు అంటే.. ఈ సింపుల్ సెట్టింగ్ ను వెంటనే ఆన్ చేయండి..

Mupparam | ప్రైవేట్ బడికి పంపితే ప్రభుత్వ పథకాలు కట్.. ముప్పారం గ్రామసభ తీర్మానం

Janhvi Kapoor | పెద్ది రిలీజ్ వేళ - తిరుమలలో జాన్వీ కపూర్ సందడి - కాలినడకన శ్రీవారి దర్శనం



