Bahubali | బాహుబలి ఎటర్నల్ వార్‌లో మెగా హీరో – కన్ఫామ్ చేసిన లావణ్య త్రిపాఠి
ప్రభాస్ బాహుబలికి కొనసాగింపుగా బాహుబలి ది ఎటర్నల్ వార్ పేరుతో ఓ యానిమేషన్ మూవీ రూపొందుతోంది. ఎస్ ఎస్ రాజమౌళి ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోన్న ఈ యానిమేషన్ సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ భాగం కాబోతున్నాడు. ఈ విషయాన్ని లావణ్య త్రిపాఠి కన్ఫామ్ చేసింది.
Entertainment | Published On Aug 9, 2026, 7.00 pm IST
Bahubali | ప్రభాస్ బాహుబలికి కొనసాగింపుగా బాహుబలి ది ఎటర్నల్ వార్ పేరుతో త్రీడీ యానిమేషన్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎస్ఎస్ రాజమౌళి ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోన్న ఈ యానిమేషన్ సినిమాకు ఇషాన్ శుక్లా దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 120 కోట్ల బడ్జెట్‌తో రెండు పార్ట్‌లుగా రూపొందుతోన్న ఈ మూవీకి పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేయబోతున్నారు.
అమరేంద్ర బాహుబలి....
అమరేంద్ర బాహుబలిని కట్టప్ప వెన్నుపోటు పొడిచి చంపిన తర్వాత బాహుబలి ఎటర్నల్ వార్ కథ ప్రారంభమవుతుంది. దేవతలు, అసురుల మధ్య జరుగుతోన్న మహా యుద్ధంలో అమరేంద్ర బాహుబలి ఆత్మ ఎలా భాగమైంది? దేవతలకు అండగా నిలిచిన అమరేంద్ర బాహుబలి అసురులను ధైర్యంగా ఎలా ఎదుర్కొన్నాడనే అంశాలతో ఈ యానిమేషన్ మూవీ సాగబోతున్నట్లు సమాచారం. .
మెగా హీరో...
కాగా బాహుబలి ఎటర్నల్ వార్ సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ భాగం కాబోతున్నాడు. దేవతల నాయకుడు అమరేంద్ర బాహుబలి పాత్రకు వరుణ్ తేజ్ వాయిస్ ఓవర్ అందించబోతున్నాడు. ఈ విషయాన్ని లావణ్య త్రిపాఠి కన్ఫామ్ చేసింది. కొరియన్ కనకరాజు సినిమాకు పాజిటివ్ వస్తుండటంతో హీరోహీరోయిన్లు వరుణ్ తేజ్, రితికా నాయక్‌లకు ప్రభాస్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ పోస్ట్‌ను ఓ నెటిజన్ షేర్ చేస్తూ బాహుబలి ఎటర్నల్ వార్‌లో వరుణ్‌తేజ్ భాగం కాబోతున్నట్లు పేర్కొన్నాడు. దేవ్ ఇంద్ర పాత్రలో కనిపించబోతున్నట్లు చెప్పాడు. అతడి పోస్ట్‌ను వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి షేర్ చేస్తూ ఎస్ అనే ఎమోజీలను అభిమానులతో పంచుకుంది. ఎటర్నల్ వార్‌కు వరుణ్ తేజ్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నది నిజమేనంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బాహుబలి ఎటర్నల్ వార్‌లో అమరేంద్ర బాహుబలి పాత్రకు ప్రభాస్, శివగామి క్యారెక్టర్‌కు రమ్యకృష్ణ వాయిస్ ఓవర్ అందించబోతున్నారు.
బాహుబలి ఎటర్నల్ వార్‌కు హాలీవుడ్ డైరెక్టర్ స్కాట్ మోసియర్ స్క్రీన్‌ప్లే అందిస్తుండగా...దేవా కట్టా, మదర్ కార్కే డైలాగ్స్ సమకూర్చుతున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Hansika | విడాకుల తర్వాత ఫస్ట్ సినిమా – హారర్ మూవీతో టాలీవుడ్లోకి హన్సిక రీఎంట్రీ
ఆగస్టు 9, 2026

Anasuya | గుమ్మడి కాయ దొంగ అంటూ అనసూయ పోస్ట్ – ఆ హీరోకు కౌంటర్ అంటోన్న నెటిజన్లు
ఆగస్టు 9, 2026

Vijay Deverakonda | బోనాల వేడుక – లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో విజయ్ దేవరకొండ, సందీప్ వంగా ప్రత్యేక పూజలు
ఆగస్టు 9, 2026
తాజావార్తలు
- ●GOBARdhan Scheme India | ఇక నుంచి పెండతో తయారుచేసే బయోగ్యాస్‌తో నడవనున్న కార్లు.. కేంద్రం కొత్త స్కీమ్ షురూ
- ●Har Ghar Tiranga | హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనండి.. దేశప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
- ●Juloori Gouri Shankar | రాజేశ్వర్ రావుకు జూలూరు గౌరీ శంకర్ నివాళి
- ●CP Sajjanar | ఏఐ కెమెరాలతో నిరంతర నిఘా.. 2400 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు
- ●Priyanka | మెడికో ప్రియాంక మృతి
- ●Kadiyam Kavya | బైండ్ల సమాజం మరింత ఎదగాలి : ఎంపీ కడియం కావ్య

GOBARdhan Scheme India | ఇక నుంచి పెండతో తయారుచేసే బయోగ్యాస్‌తో నడవనున్న కార్లు.. కేంద్రం కొత్త స్కీమ్ షురూ

Har Ghar Tiranga | హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనండి.. దేశప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

Juloori Gouri Shankar | రాజేశ్వర్ రావుకు జూలూరు గౌరీ శంకర్ నివాళి

CP Sajjanar | ఏఐ కెమెరాలతో నిరంతర నిఘా.. 2400 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు



