Varun Tej | కనకరాజు మాస్ స్టెప్పులు – రాసా గుమ్మాడి సాంగ్ ట్రెండింగ్
జానపద పాటతో అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు మెగా హీరో వరుణ్ తేజ్. కొరియన్ కనకరాజు మూవీ నుంచి రాసా గుమ్మాడి సాంగ్‌ను మేకర్స్ సోమవారం రిలీజ్ చేశారు. నల్గొండ గద్దర్ ఆలపించిన ఈ పాట ట్రెండ్ అవుతోంది. రాసా గుమ్మాడి పాటలో వరుణ్‌తేజ్‌తో కలిసి స్టెప్పులేసింది దక్షా నగార్కర్.
Entertainment | Published On Jul 20, 2026, 6.09 pm IST
Varun Tej | టాలీవుడ్‌లో ప్రస్తుతం ఫోక్ సాంగ్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ ట్రెండ్‌లోకి మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఎంటరయ్యాడు. అతడు హీరోగా నటిస్తోన్న కొరియన్ కనకరాజు మూవీ ఆగస్ట్ 7న థియేటర్లలోకి రాబోతుంది. హారర్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో కమెడియన్ సత్య ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
రాసా గుమ్మాడి...
కొరియన్ కనకరాజు నుంచి రాసా గుమ్మాడి అనే సాంగ్‌ను మేకర్స్ సోమవారం రిలీజ్ చేశారు. జానపద శైలిలో సాగిన ఈ పాటను నల్గొండ గద్దర్ ఆలపించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటకు తమన్ మ్యూజిక్ అందించాడు.
దక్షా నగార్కర్...
రాసా గుమ్మాడి పాటలో వరుణ్ తేజ్‌తో కలిసి దక్షా నగార్కర్ స్టెప్పులు వేసింది. ఫోక్ స్టైల్‌లో సాగిన లిరిక్స్, వరుణ్ తేజ్, దక్షా నగార్కర్ మాస్ స్టెప్పులు ఈ పాటకు హైలైట్‌గా నిలుస్తోన్నాయి. ప్రస్తుతం రాసా గుమ్మాడి సాంగ్ యూట్యూబ్‌తో పాటు ఇతర మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది. జాతర నేపథ్యంలో ఆ సాంగ్ సాగనున్నట్లు తెలుస్తోంది. విజువల్స్ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి.
కొరియన్ గ్యాంగ్‌స్టర్....
కొరియన్ కనకరాజు సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. తెలుగు యువకుడిలోకి కొరియన్ గ్యాంగ్‌స్టర్ ఆత్మ ఎలా ప్రవేశించింది? ఆ తర్వాత జరిగిన పరిణామాలేమిటి అనే కాన్సెప్ట్‌తో కొరియన్ కనకరాజు మూవీ తెరకెక్కుతోంది.
బరి....
ఎఫ్ 3 తర్వాత వరుణ్ తేజ్‌కు సరైన హిట్టు లేదు. మట్కా, ఆపరేషన్ వాలెంటైన్, గాంఢీవధారి అర్జున సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. దాంతో కొరియన్ కనకరాజు మూవీతో వరుణ్ తేజ్ హిట్టు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కొరియన్ కనకరాజు తర్వాత బరి పేరుతో స్పోర్ట్స్ యాక్షన్ మూవీ చేస్తోన్నారు వరుణ్ తేజ్. నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఈ మూవీకి కమిటీ కుర్రాళ్లు ఫేమ్ యదు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






