త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sai Dharam Tej | వేముల‌వాడ‌లో మెగా హీరో సాయి ధ‌ర‌మ్‌ తేజ్…భీమేశ్వ‌ర ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు

మెగా హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ వేముల‌వాడను ద‌ర్శించుకున్నారు. రాజ‌రాజేశ్వ‌ర స్వామితో పాటు భీమేశ్వ‌ర ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. సాయిధ‌ర‌మ్‌తేజ్ వేములవాడ ఆల‌యాన్ని సంద‌ర్శించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

N

Entertainment | Published On Apr 10, 2026, 4.20 pm IST

Sai Dharam Tej | వేముల‌వాడ‌లో మెగా హీరో సాయి ధ‌ర‌మ్‌ తేజ్…భీమేశ్వ‌ర ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు
Advertisement

Sai Dharam Tej |  మెగా హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ వేముల‌వాడలో సంద‌డి చేశారు. శుక్ర‌వారం వేముల‌వాడ వ‌చ్చిన సాయిధ‌ర‌మ్‌తేజ్ రాజ‌రాజేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్నారు. మెగా హీరోకు ఆల‌య సిబ్బంది స్వాగ‌తం ప‌లికారు. సంప్ర‌దాయ దుస్తుల్లో కోడె మొక్కును చెల్లించుకున్నారు. ఆ త‌ర్వాత భీమేశ్వ‌ర ఆల‌యంలో సాయిధ‌ర‌మ్‌తేజ్‌ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. రాజ‌రాజేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకోవ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని సాయిధ‌ర‌మ్‌తేజ్ అన్నారు. ఆ త‌ర్వాత వేముల‌వాడ నుంచి కొండ‌గ‌ట్టు బ‌య‌లుదేరారు సాయిధ‌ర‌మ్‌తేజ్‌.

సంబ‌రాల ఏటిగ‌ట్టు...

ప్ర‌స్తుతం సాయిధ‌ర‌మ్‌తేజ్ సంబ‌రాల ఏటిగ‌ట్టు పేరుతో ఓ యాక్ష‌న్ మూవీ చేస్తున్నారు. దాదాపు వంద కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ పాన్ ఇండియ‌న్ మూవీకి రోహిత్ కేపీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఐశ్వ‌ర్య ల‌క్ష్మి హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో శ్రీకాంత్‌, అన‌న్య నాగ‌ళ్ల కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సంబ‌రాల ఏటిగ‌ట్టు షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. త్వ‌ర‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.
సంబ‌రాల ఏటిగ‌ట్లు త‌ర్వాత క డైరెక్ట‌ర్లు సుజీత్‌, సందీప్‌ల‌తో త‌న నెక్స్ట్ మూవీ చేయ‌నున్నాడు సాయిధ‌ర‌మ్‌తేజ్‌. ఇటీవ‌లే ఈ సినిమాను అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు.

Advertisement
Advertisement