త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Meerra Chopraa | క్యాబ్‌లో హీరోయిన్‌ మీరా చోప్రాకు భయంకర అనుభవం.. పవన్‌ హీరోయిన్‌ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌..!

Meerra Chopraa |టాలీవుడ్ హీరోయిన్ మీరా చోప్రా (Meerra Chopra) క్యాబ్ సేవల్లో భద్రతా లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ, ప్రయాణికుల సురక్షిత ప్రయాణంపై ప్రశ్నలు లేవనెత్తింది. ఉదయం సమయంలో ఊబర్‌లో క్యాబ్ బుక్ చేసుకున్నానని ఆమె తెలిపింది.

P

Entertainment | Published On Feb 25, 2026, 2.15 pm IST

Meerra Chopraa | క్యాబ్‌లో హీరోయిన్‌ మీరా చోప్రాకు భయంకర అనుభవం.. పవన్‌ హీరోయిన్‌ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌..!
Advertisement

Meerra Chopraa |టాలీవుడ్ హీరోయిన్ మీరా చోప్రా (Meerra Chopra) క్యాబ్ సేవల్లో భద్రతా లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ, ప్రయాణికుల సురక్షిత ప్రయాణంపై ప్రశ్నలు లేవనెత్తింది. ఉదయం సమయంలో ఊబర్‌లో క్యాబ్ బుక్ చేసుకున్నానని ఆమె తెలిపింది. అయితే, క్యాబ్‌ వచ్చిన క్షణం నుంచే పరిస్థితి అనుమానాస్పదంగా అనిపించిందని పేర్కొంది. వాహనం పూర్తిగా దుమ్ముతో నిండిపోయి ఉండడమే కాకుండా తీవ్ర దుర్వాసన వచ్చిందని ఆరోపించింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్టుగా కనిపించాడని, మాట్లాడేందుకు ప్రయత్నించినా సరిగా స్పందించలేదని పేర్కొంది. డ్రైవింగ్ చేస్తూనే నిద్రపోతున్నట్టుగా అనిపించడంతో కేవలం 20 నిమిషాల్లోనే రైడ్‌ను నిలిపివేసి మరో క్యాబ్ బుక్ చేసుకున్నానని చెప్పుకొచ్చింది. ‘ఇలాంటి పరిస్థితిలో ప్రయాణం కొనసాగించడం ప్రమాదకరం’ అని ఆమె వ్యాఖ్యానించింది.

అయితే, భద్రతా కారణాలతో మధ్యలోనే దిగిపోయినా, పూర్తి ప్రయాణానికి చార్జ్ వసూలు చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణికుల సురక్షిత ప్రయాణాన్ని కంటే వ్యాపార ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్న ధోరణి ఆందోళనకరమని వాపోయింది. ప్రస్తుతం మీరా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. యాప్ ఆధారిత క్యాబ్ సేవల్లో కఠిన భద్రతా ప్రమాణాలు అవసరమని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటివరకు ఉబర్ అధికారికంగా స్పందించలేదు. ప్రస్తుతం మీరా చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. యాప్‌ ఆధారిత క్యాబ్‌ సేవల్లో భద్రతా ప్రమాణాలపై మరింత కఠిన చర్యలు అవసరమని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇప్పటి వరకు యూబర్‌ స్పందించలేదు. ఇదిలా ఉండగా.. మీరా సినిమాల విషయానికి వస్తే చివరిసారిగా బాలీవుడ్‌లో 2023లో హిందీలో ‘సేఫ్డ్’ మూవీలో నటించింది. తెలుగులో పవన్‌ కల్యాణ్‌ సరసన బంగారంలో నటించింది. ఆ తర్వాత తెలుగులోనే వాన, మారో, గ్రీకువీరుడు మూవీలో కనిపించింది. ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమాలు చేయలేదు.

Read Also :

రూ.300 కోట్ల హిట్‌ మూవీ సీక్వెల్.. లోక: 2పై క్లారిటీ ఇచ్చిన కళ్యాణి ప్రదర్శన్‌..!

Nayan Sarika | లాయర్‌ కావాలనుకున్నా.. సినిమాలపై ఇష్టం కెరీర్‌గా మారిందన్న నయన్‌ సారిక..!

Virosh Wedding | విరోష్ వెడ్డింగ్‌.. కాబోయే జంట‌కు ప్ర‌త్యేక నోట్ పంపిన ప్ర‌ధాని మోదీ

Advertisement
Advertisement