Kalyani Priyadarshan | రూ.300 కోట్ల హిట్ మూవీ సీక్వెల్.. లోక: 2పై క్లారిటీ ఇచ్చిన కళ్యాణి ప్రియదర్శన్..!
Kalyani Priyadarshan | కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్‌హీరో చిత్రం లోక: చాప్టర్ 1 : చంద్ర. డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ గత ఏడాది థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. మలయాళంలో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ రికార్డు సృష్టించింది.
Entertainment | Published On Feb 25, 2026, 1.00 pm IST
Kalyani Priyadarshan | కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్‌హీరో చిత్రం లోక: చాప్టర్ 1 : చంద్ర. డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ గత ఏడాది థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. మలయాళంలో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం లోక యూనివర్స్‌పై భారీ చర్చ సాగుతోంది. ఈ చిత్రంలో టివినో థామస్ (Tovino Thomas), దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) శక్తివంతమైన క్యామియో పాత్రల్లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డైరెక్టర్ డొమినిక్ అరుణ్ ‘లోక’ను సూపర్ హీరో యూనివర్స్‌గా విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు ప్రకటించారు. కొద్దిరోజుల కిందల లోకః టీమ్ టివినో థామస్, దుల్కర్ సల్మాన్‌లతో కూడిన ఓ ప్రోమోను విడుదల చేసింది.
ఈ ప్రోమోకు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. ఆ తర్వాత మూవీకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ వస్తాయని అభిమానులు భావించారు. ఆ తర్వాత ఎలాంటి ప్రకటనలు రాలేదు. దాంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ‘లోక: చాప్టర్ 2’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ లోక యూనివర్స్‌కు సంబంధించి కీలక అప్‌డేట్‌ని వెల్లడించింది. ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెప్పింది. సెప్టెంబర్ నెలలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. సీక్వెల్‌లో ‘లోక’లో నటించిన నటీనటులు అందరూ మళ్లీ కనిపిస్తారని, తాను సైతం ఇందులో భాగమవుతున్నట్లు స్పష్టం చేసింది. దాంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొన్నది. మరోసారి లోక: యూనివర్స్‌పై చర్చ సాగుతోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. దాంతో సీక్వెల్‌పై భారీ అంచనాలున్నాయి.
పాన్ ఇండియా స్థాయిలో మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఓటీటీ విడుదలైన ‘లోక’ మూవీపై కొందరు విమర్శించారు. ఓవర్‌రేటెడ్‌గా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో లోకః2 సైతం ఎంపురాన్ తరహాలోనే ఉంటుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లుసిఫర్ విజయం తర్వాత వచ్చిన ఎంపురాన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కలెక్షన్స్ రాబట్టినా.. అభిమానులను మెప్పించలేకపోయింది. భారీగా పెరిగిన అంచనాల నేపథ్యంలో లోకః2 అలాంటి సవాళ్లను ఎదురయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి ‘లోకః చాప్టర్ 2’ని దర్శకుడు డొమినిక్ అరుణ్ ఎలా ముందుకు తీసుకువస్తారనేది చర్చనీయాంశంగా మారింది. అంచనాలను అందుకొని మరోసారి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలుస్తుందా? భారీ హైప్‌ను తట్టుకోలేక చతికిలపడుతుందా? అన్నది మూవీ విడుదల తర్వాత తేలనున్నది.
Read Also :
Nayan Sarika | లాయర్ కావాలనుకున్నా.. సినిమాలపై ఇష్టం కెరీర్‌గా మారిందన్న నయన్ సారిక..!
Virosh Wedding | విరోష్ వెడ్డింగ్.. కాబోయే జంటకు ప్రత్యేక నోట్ పంపిన ప్రధాని మోదీ
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



