త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Meenakshi Chaudhary | డ్యూడ్ హీరోతో మీనాక్షి చౌద‌రి రొమాన్స్ – రెండేళ్ల త‌ర్వాత త‌మిళ సినిమాలో?

Meenakshi Chaudhary | మీనాక్షి చౌద‌రి కోలీవుడ్‌లో (Kollywood) బంప‌రాఫ‌ర్ అందుకున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌తో ఓ సినిమా చేసే ఛాన్స్ ద‌క్కించుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

N

Entertainment | Published On Dec 21, 2025, 2.36 pm IST

Meenakshi Chaudhary | డ్యూడ్ హీరోతో మీనాక్షి చౌద‌రి రొమాన్స్ – రెండేళ్ల త‌ర్వాత త‌మిళ సినిమాలో?
Advertisement

Meenakshi Chaudhary |ఈ ఏడాదిసంక్రాంతికి వ‌స్తున్నాంతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకుంది మీనాక్షి చౌద‌రి. వెంక‌టేష్ హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీ 300 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీ (Pawan Kalyan Og)త‌ర్వాత 2025లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన తెలుగు సినిమాగా సంక్రాంతికి వ‌స్తున్నాం నిలిచింది. ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో మీనాక్షికి తెలుగుతో పాటు త‌మిళంలో స్టార్ హీరోల సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చాయ‌ట‌. గ‌త సినిమాల ఫ‌లితాల‌ను దృష్టిలో పెట్టుకొని క‌థ‌, త‌న పాత్ర‌లు న‌చ్చ‌క చాలా ఆఫ‌ర్ల‌ను రిజెక్ట్ చేసిన‌ట్లు స‌మాచారం.
ప్ర‌స్తుతం తెలుగులో న‌వీన్ పొలిశెట్టి అన‌గ‌న‌గా ఒక రాజుతో పాటు నాగ‌చైత‌న్య వృష‌క‌ర్మ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టిస్తోంది మీనాక్షి చౌద‌రి. తాజాగా ఈ హ‌ర్యానా బ్యూటీ మ‌రో బంప‌రాఫ‌ర్ అందుకున్న‌ట్లు స‌మాచారం.

హ్యాట్రిక్ హిట్స్‌...

ల‌వ్ టుడే, డ్రాగ‌న్‌, డ్యూడ్ సినిమాల‌తో హీరోగా హ్యాట్రిక్ విజ‌యాల‌ను అందుకున్నాడు కోలీవుడ్ (Kollywood) హీరో ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌. ఈ మూడు సినిమాలు వంద కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాయి. ఈ స‌క్సెస్‌ల‌తో త‌మిళంలో మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా మారిపోయాడు.
డ్యూడ్ త‌ర్వాత త‌న‌కు అచ్చొచ్చిన రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ జాన‌ర్‌లోనే ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ నెక్స్ట్ సినిమాను చేయ‌బోతున్నాడ‌ట‌. ఈ సినిమాకు అత‌డే ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోనున్న‌ట్లు స‌మాచారం. ఏజీఎస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించ‌నున్న ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌యిన‌ట్లు స‌మాచారం.

హీరోతో స‌మానంగా...

ఈ మూవీలో హీరోయిన్‌గా మీనాక్షి చౌద‌రిని మేక‌ర్స్ ఫైన‌లైజ్ చేసిన‌ట్లు స‌మాచారం. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌లా కాకుండా ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌తో స‌మానంగా ఇందులో మీనాక్షి చౌద‌రి రోల్‌కు ఇంపార్టెన్స్ ఉంటుంద‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకి రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలుగులో పాటు త‌మిళంలో ఏక‌కాలంలో ఈ సినిమా రూపొంనుంద‌ట‌. ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ మూవీతో దాదాపు రెండేళ్ల త‌ర్వాత కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతుంది. గ‌తంలో కొలైతో పాటు ద‌ళ‌ప‌తి విజ‌య్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాలు చేసింది మీనాక్షి చౌద‌రి. ఈ సినిమాలు ఆమెకు నిరాశ‌నే మిగిల్చాయి. మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టించిన అన‌గ‌న‌గా ఒక రాజు షూటింగ్ పూర్త‌య్యింది. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement