Meenakshi Chaudhary | తెలుగు సినిమాలో తమిళ హీరోతో మీనాక్షి రొమాన్స్…
మీనాక్షి చౌదరి మరో బంపర్ ఆఫర్ అందుకుంది. ఓ తెలుగు సినిమాలో తమిళ హీరో కార్తీతో రొమాన్స్ చేయబోతుంది. ఆ సినిమా ఏదంటే?
Entertainment | Published On May 7, 2026, 6.31 pm IST
Meenakshi Chaudhary | ఓ బ్యానర్‌లో హీరోహీరోయిన్లు ఇప్పుడు ఒకటి రెండు సినిమాలు చేయడమే కష్టంగా మారింది. కానీ మీనాక్షి చౌదరి మాత్రం ఒకే నిర్మాణ సంస్థలో వరుసగా ఐదో సారి నటించబోతుంది. తమిళ హీరోతో రొమాన్స్‌కు రెడీ అయ్యింది. కార్తీ హీరోగా మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఓ కామెడీ లవ్‌స్టోరీ తెరకెక్కుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గురువారం హైదరాబాద్‌లో ఈ కొత్త మూవీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఐదో సినిమా...
తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి బైలింగ్వల్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కార్తీకి జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.ఇందులో కార్తీ, మీనాక్షి రొమాన్స్ అదిరిపోతుందని టాక్. కాగా సితార బ్యానర్‌లో మీనాక్షి చౌదరి చేస్తోన్న ఐదో ప్రాజెక్ట్ ఇది. సూర్య దేవర నాగవంశీ నిర్మించిన గుంటూరు కారం, లక్కీ భాస్కర్, అనగనగా ఒక రాజు సినిమాల్లో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో నెట్‌ఫ్లిక్స్ కోసం నాగవంశీ ఓ వెబ్‌సిరీస్ చేస్తున్నారు. ఇందులోనూ లీడ్ రోల్‌లో మీనాక్షి చౌదరి కనిపించబోతుండటం గమనార్హం. తనకు అచ్చొచ్చిన బ్యానర్ కావడంతో ఫస్ట్ సిట్టింగ్‌లోనే కార్తీ మూవీకి మీనాక్షి చౌదరి ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ వీక్‌లోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
డబ్బింగ్ సినిమాలతో...
తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు కార్తీక్. అవారా, ఖాకీతో పాటు అతడు హీరోగా నటించిన పలు డబ్బింగ్ సినిమాలు పెద్ద హిట్టయ్యాయి. స్ట్రెయిట్‌గా తెలుగులో ఊపిరి సినిమా చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పెద్ద హిట్టయ్యింది. ఊపిరి తర్వాత కార్తీ తెలుగులో చేస్తోన్న సెకండ్ స్ట్రెయిట్ మూవీ ఇది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



