Meenakshi Chaudhary | హీరోకు 58 – హీరోయిన్ 28 – మీనాక్షి చౌదరితో అక్షయ్ కుమార్ రొమాన్స్ – ఏజ్ గ్యాప్‌పై ట్రోల్స్
టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అక్షయ్ కుమార్ భాగమ్‌భాగ్2లో మీనాక్షి హీరోయిన్‌గా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్షయ్, మీనాక్షి ఏజ్ గ్యాప్‌పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
Entertainment | Published On Feb 19, 2026, 4.28 pm IST
Meenakshi Chaudhary | టాలీవుడ్ హీరోయిన్లకు బాలీవుడ్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. రష్మిక మందన్న, సాయిపల్లవితో పాటు మరికొందరు హీరోయిన్లు హిందీలో టాప్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. తెలుగులో బ్లాక్‌బస్టర్స్ అందుకొని బాలీవుడ్‌లో అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు. వీరి బాటలోనే మీనాక్షి చౌదరి అడుగులు వేయబోతుంది. తొలి సినిమాలోనే బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్‌కుమార్‌తో రొమాన్స్ చేయబోతున్నట్లు టాక్.
మోస్ట్ వాంటెడ్ హీరోయిన్...
సంక్రాంతికి వస్తున్నాం, అనగనగా ఒక రాజు విజయాలతో టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది మీనాక్షి చౌదరి. ప్రస్తుతం నాగచైతన్య వృషకర్మ సినిమాలో నటిస్తోంది. తాజాగా బాలీవుడ్ నుంచి మీనాక్షి ఓ బంపరాఫర్ అందుకున్నట్లు సమాచారం.
సూపర్ హిట్ కాంబో...
బాలీవుడ్‌లో హీరో అక్షయ్ కుమార్, డైరెక్టర్ ప్రియదర్శన్‌లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో ఇప్పటివరకు ఆరు సినిమాలు వచ్చాయి. మరో రెండు సినిమాలు భూత్ బంగ్లాతో పాటు హైవాన్ సినిమాలు రిలీజ్‌కు రెడీ ఉన్నాయి. హైవాన్ షూటింగ్ దశలో ఉండగానే ప్రియదర్శన్‌తో మరో సినిమాకు అక్షయ్‌కుమార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
మీనాక్షి జోడీగా...
అక్షయ్ కుమార్ హీరోగా ప్రియదర్శన్ డైరెక్షన్‌లో భాగమ్‌భాగ్ 2 సినిమా చేరాబోతున్నట్లు సమాచారం. 2006లో వచ్చిన భాగమ్ భాగ్‌కు సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో అక్షయ్‌కుమార్‌కు జోడీగా మీనాక్షి చౌదరి, ఆయేషా ఖాన్ హీరోయిన్లుగా నటించబోతున్నారు. భాగమ్‌భాగ్‌లో అక్షయ్‌కుమార్‌తో పాటు గోవిందా మరో హీరోగా కనిపించాడు. గోవిందా ప్లేస్‌లో సీక్వెల్‌లో మనోజ్ బాజ్‌పాయ్ కనిపించనున్నాడు.
కాగా ఈ సినిమా కోసం యంగ్ హీరోయిన్ మీనాక్షితో అక్షయ్ జోడీకట్టడంపై విమర్శలు వ్యక్తమవుతోన్నాయి. అక్షయ్ ఏజ్ 58 కాగా...మీనాక్షి చౌదరి ఏజ్ 28 కావడం గమనార్హం. తనకన్న వయసులో సగం ఉన్న హీరోయిన్‌తో రొమాన్స్ ఏంటి అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
తొలి అడుగు...
భాగమ్ భాగ్‌తోనే మీనాక్షి చౌదరి బాలీవుడ్‌లో తొలి అడుగు వేయబోతుంది. అక్షయ్‌కుమార్ సినిమా కావడంతో తెలుగు సినిమాల డేట్స్ అడ్జెస్ట్ చేసి మరి భాగమ్‌భాగ్ 2కు మీనాక్షి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతోన్నారు.
నాగచైతన్య, మీనాక్షి చౌదరి కాంబినేషన్‌లో తెరకెక్కిన వృషకర్మ మూవీ సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సితార బ్యానర్‌లో కార్తీ, నాని హీరోలుగా నటిస్తోన్న సినిమాల్లో మీనాక్షి హీరోయిన్‌గా అవకాశాలను దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



