Meenakshi Chaudhary | టాలీవుడ్‌లో కొత్త కాంబో సెట్ – నితిన్ సరసన మీనాక్షి
టాలీవుడ్‌లో మరో కొత్త కాంబో సెట్టయ్యింది. నితిన్, మీనాక్షి చౌదరి కలయికలో ఓ రొమాంటిక్ కామెడీ మూవీ రాబోతుంది. నారి నారి నడుమ మురారి, సామజవరగమనా సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన రామ్ అబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.
Entertainment | Published On Oct 12, 2026, 2.56 pm IST
Meenakshi Chaudhary | నితిన్ హిట్టు అనే మాట విని ఆరేళ్లు దాటిపోయింది. 2020లో వచ్చిన భీష్మ తర్వాత ఈ టాలీవుడ్ హీరో చేసిన ఏడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా వరుసగా కొత్త సినిమాలను సెట్స్‌పైకి తీసుకొస్తున్నాడు. ఇప్పటికే హీరోగా మూడు సినిమాలు చేస్తోన్న నితిన్...తాజాగా మరో రొమాంటిక్ కామెడీ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి, సామజవరగమనా ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను నితిన్ మేనేజర్ వెంకటరత్నం నిర్మించనున్నట్లు సమాచారం.
కామెడీ యాంగిల్...
రామ్ అబ్బరాజు గత సినిమాల తరహాలోనే కామెడీ ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తూ రైటర్లు భాను - నందు ఓ కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. నితిన్‌లోని కామెడీ యాంగిల్‌ను కొత్త కోణంలో ఆవిష్కరించనున్నట్లు చెబుతున్నారు. ఈ ఏడాది చివరికల్లా స్క్రిప్ట్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి వచ్చే ఏడాది ప్రథమార్థం నుంచి ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
మీనాక్షి చౌదరి...
ఈ రొమాంటిక్ కామెడీ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని ఎంపికచేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ ఇద్దరిపై ఇటీవలే ఓ లుక్ టెస్ట్‌ను కూడా నిర్వహించినట్లు సమాచారం. మీనాక్షితో పాటు మరో నాయిక కూడా ఈ సినిమాలో కనిపించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
అలియాస్ రుక్మిణి...
ప్రస్తుతం అలియాస్ రుక్మిణితో పాటు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నితిన్ ఓ సినిమా చేస్తోన్నాడు. నాని నిర్మాతగా వ్యవహరిస్తోన్న అలియాస్ రుక్మిణి మూవీ డిసెంబర్ 4న థియేటర్లలోకి రాబోతుంది. మురళీకాంత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రూపొందుతోన్న ఫన్ లవ్‌స్టోరీకి సోము, నర్రి డైరెక్టర్లుగా వ్యవహరిస్తోన్నారు. ఆయ్ ఫేమ్ అంజి శ్రీనుతో నితిన్ ఓ సినిమా కమిటయ్యాడు.
మరోవైపు సంక్రాంతికి వస్తున్నాం, అనగనగా ఒక రాజు సినిమాలతో బ్లాక్‌బస్టర్లు అందుకున్న మీనాక్షి చౌదరి నాగచైతన్య వృషకర్మ సినిమా చేస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Keerthi Reddy | పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ హీరోయిన్… ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
అక్టోబర్ 11, 2026

Rakul Preet Singh | అలనాటి దిగ్గజ హీరోయిన్‌గా రకుల్ – ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో ఛాన్స్
అక్టోబర్ 11, 2026

Rajamouli | శ్రీకృష్ణుడి పాత్రలో డైరెక్టర్ రాజమౌళి – సగం షూటింగ్ పూర్తయిన తర్వాత ఆగిపోయిన మైథాలజీ మూవీ
అక్టోబర్ 10, 2026
తాజావార్తలు
- ●Acer Iconia Tab 11 5G | ఏసర్ నుంచి రెండు కొత్త 5జి ట్యాబ్లెట్లు.. ధరలు రూ.23,999 నుంచే..
- ●Ramchandar Rao | టైం మీరే చెప్పండి.. 10 మందిని తీసుకురండి చాలు
- ●Srikanth Daughter | టాలీవుడ్లోకి మరో వారసురాలు - టీనేజ్ లవ్‌స్టోరీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న శ్రీకాంత్ కూతురు
- ●Suta | రూ.6 లక్షలతో మొదలు.. రూ.73.5 కోట్లకు చేరిన సోదరీమణుల వ్యాపారం..
- ●Farmers Protest | కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చి తప్పు చేశాం.. ఇప్పుడు చెప్పులతో కొట్టుకుంటున్నం
- ●Delhi Tour of Congress Leaders | ఎల్‌నినోపై మీటింగన్నారు.. ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు
Acer Iconia Tab 11 5G | ఏసర్ నుంచి రెండు కొత్త 5జి ట్యాబ్లెట్లు.. ధరలు రూ.23,999 నుంచే..

Ramchandar Rao | టైం మీరే చెప్పండి.. 10 మందిని తీసుకురండి చాలు

Srikanth Daughter | టాలీవుడ్లోకి మరో వారసురాలు - టీనేజ్ లవ్‌స్టోరీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న శ్రీకాంత్ కూతురు

Suta | రూ.6 లక్షలతో మొదలు.. రూ.73.5 కోట్లకు చేరిన సోదరీమణుల వ్యాపారం..



