Meenakshi Chaudhary | ఇటు నాని…అటు కార్తీ – మీనాక్షి చౌదరి డబుల్ ట్రీట్
తెలుగు ఆడియెన్స్‌కు మీనాక్షి చౌదరి డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు టాక్. ఒకే సారి, ఒకే బ్యానర్‌లో రెండు సినిమాలు అంగీకరించినట్లు చెబుతున్నారు. ఆ సినిమాలు ఏవంటే?
Entertainment | Published On Feb 15, 2026, 3.45 pm IST
Meenakshi Chaudhary |సంక్రాంతికి వస్తున్నాం, అనగనగా ఒక రాజు సినిమాలతో వరుసగా రెండు సంక్రాంతి పండుగలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది మీనాక్షి చౌదరి. ఈ బ్లాక్‌బస్టర్స్‌తో తెలుగులో మీనాక్షికి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. కానీ వచ్చిన సినిమాలన్నీ కాకుండా నచ్చినవి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది. రొటీన్ స్క్రిప్ట్‌లను నిర్మొహమాటంగా తిరస్కరిస్తూ కథ, పాత్రల పరంగా వైవిధ్యత ఉన్న సినిమాలనే సెలెక్ట్ చేసుకుంటుందట మీనాక్షి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించింది. అనగనగా ఒక రాజులో పల్లెటూరి అమ్మాయిగా ఆకట్టుకుంది. ప్రస్తుతం నాగచైతన్యతో చేస్తోన్న వృషకర్మ సినిమాలో ఆర్కియాలజిస్ట్ క్యారెక్టర్‌లో కనిపించబోతుంది.
ఒకే బ్యానర్‌లో...
తాజాగా మీనాక్షి చౌదరి తెలుగులో రెండు సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తెలుగు, తమిళ హీరోలు నటిస్తున్న ఈ సినిమాలు ఒకే బ్యానర్‌లో రూపొందుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ స్టార్ కార్తీ కథానాయకుడిగా మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ డైరెక్షన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఓ సినిమా రాబోతుంది. అలాగే నాచురల్ స్టార్ నాని హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ బయోపిక్ మూవీని నిర్మించేందుకు సితార సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు సినిమాల్లో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని ఫిక్స్ చేసినట్లు సమాచారం.
బయోపిక్...
కార్తీ మూవీ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందట. యూనిక్ పాయింట్‌తో తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా కళ్యాణ్ శంకర్ ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు చెబుతోన్నారు.
మరోవైపు నాని, వెంకీ అట్లూరి సినిమా ఓ బయోపిక్ అని టాక్. వాహన పరిశ్రమను మలుపుతిప్పిన ఓ పాపులర్ వ్యక్తి జీవితం ఆధారంగా ఈ సినిమా ఉంటుందట. ఈ సినిమాకు 796 సీసీ అనే టైటిల్ పరిశీలిస్తోన్నట్లు సమాచారం.
మోడ్రన్ అమ్మాయిగా....
ఈ రెండు సినిమాల్లో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని మేకర్స్ ఫైనల్ చేశారట. కార్తీ సినిమాలో మోడ్రన్ యువతిగా, నాని సినిమాలో ఛాలెంజింగ్ రోల్‌లో మీనాక్షి కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాదే ఈ రెండు సినిమాలు సెట్స్‌పైకి రానున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



