Meenakshi Chaudhary | శాండల్‌వుడ్‌లోకి మీనాక్షి – కేజీఎఫ్ హీరోతో రొమాన్స్
టాలీవుడ్ లక్కీ ఛార్మ్‌గా పేరు తెచ్చుకున్న మీనాక్షి చౌదరి త్వరలోనే శాండల్‌వుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేజీఎఫ్ హీరో యశ్ నెక్స్ట్ మూవీలో త్రిప్తి డిమ్రితో పాటు మీనాక్షి చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి.
Entertainment | Published On Jul 10, 2026, 6.35 pm IST
Meenakshi Chaudhary | టాలీవుడ్‌లో లక్కీ ఛార్మ్‌గా కొనసాగుతోంది మీనాక్షి చౌదరి. సంక్రాంతికి వస్తున్నాం, లక్కీ భాస్కర్ సినిమాలతో బిగ్గెస్ట్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన అనగనగా ఒక రాజు కూడా వంద కోట్ల వసూళ్లను సాధించింది. ఈ బ్లాక్‌బస్టర్స్‌తో టాలీవుడ్‌లో మీనాక్షి టాప్ హీరోయిన్ల లీగ్‌లోకి అడుగుపెట్టింది.
యశ్ సినిమాలో....
తెలుగు, తమిళ భాషల్లో వరుస ఆఫర్లను చేజిక్కించుకుంటున్న ఈ బ్యూటీ తాజాగా శాండల్‌వుడ్‌పై కన్నేసిందట. కేజీఎఫ్ హీరో యశ్‌తో రొమాన్స్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. టాక్సిక్‌తో పాటు బాలీవుడ్ మూవీ రామాయణ పార్ట్ వన్ షూటింగ్‌లను యశ్ ఇటీవలే పూర్తిచేశారు. ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాలు ఈ ఏడాదే థియేటర్లలోకి రాబోతున్నాయి.తాజాగా యశ్ కన్నడంలో ఓ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి ఓకే చెప్పాడని అంటున్నారు. నార్తన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో హీరోయిన్లుగా త్రిప్తి డిమ్రితో పాటు మీనాక్షి చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి. కన్నడ ఎంట్రీ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోన్న మీనాక్షి ...యశ్ సినిమాలో ఆఫర్ కావడంతో వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.
లవర్ బాయ్‌గా...
కేజీఎఫ్, టాక్సిక్ సినిమాల్లో రగ్డ్‌డ్ లుక్‌లో కనిపించిన యశ్ ....నార్తన్ సినిమాలో మాత్రం గెటప్‌ను కంప్లీట్‌గా ఛేంజ్ చేయబోతున్నట్లు సమాచారం. లవర్ బాయ్‌గా కనిపించనున్నట్లు చెబుతున్నారు.త్వరలోనే ఈ మూవీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు వార్తలొస్తున్నాయి.
రెమ్యూనరేషన్ ఎంతంటే?
వరుస సక్సెస్ కారణంగా మీనాక్షి చౌదరి తన రెమ్యూనరేషన్‌ను పెంచిందని అంటున్నారు. ఈ కన్నడ మూవీ కోసం ఐదు కోట్ల వరకు పారితోషికం స్వీకరించబోతున్నట్లు సమాచారం. లక్కీ భాస్కర్ కంటే ముందు సినిమాకు కోటి మాత్రమే తీసుకుంది. సంక్రాంతికి వస్తున్నాం, అనగనగా ఒక రాజు సక్సెస్‌లతో రెమ్యూనరేషన్‌ను నాలుగింతలు పెంచినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి
కార్తి సినిమాలో....
మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన తెలుగు మూవీ వృషకర్మ విడుదలకు రెడీగా ఉంది. మిస్టిక్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీలో నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దర్శకత్వం వహించాడు. కార్తితో ఓ తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీ కూడా చేస్తుంది మీనాక్షి చౌదరి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Meenakshi Chaudhary | లక్కీ భాస్కర్ డైరెక్టర్‌తో మీనాక్షి చౌదరి తెలుగు వెబ్‌సిరీస్ – సినిమాకు మించిన బడ్జెట్‌తో…
ఆగస్టు 8, 2026

OTT Review | కేస్ ఆఫ్ కొండాన రివ్యూ – తెలుగులో రిలీజైన కన్నడ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
జులై 25, 2026

Bhatti Vikramarka | డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జూన్ 26, 2026
తాజావార్తలు
- ●Horoscope | ఆగస్టు 14 రాశిఫలాలు.. ఈ రాశివారు అందరినీ ఆకట్టుకుంటారు!
- ●Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి
- ●SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి
- ●Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!
- ●BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత
- ●BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్

Horoscope | ఆగస్టు 14 రాశిఫలాలు.. ఈ రాశివారు అందరినీ ఆకట్టుకుంటారు!

Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి

SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి

Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!



