Yellamma Movie | ఎట్టకేలకు సెట్స్‌పైకి దేవిశ్రీ ప్రసాద్ ఎల్లమ్మ – హైదరాబాద్‌లో తెలంగాణ విలేజ్ సెట్
దేవిశ్రీప్రసాద్ ఎల్లమ్మ మూవీ షూటింగ్ ఎట్టకేలకు మొదలుకాబోతుంది. ఈ నెలాఖరు నుంచి హైదరాబాద్‌లో ఎల్లమ్మ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో స్పెషల్ విలేజ్ సెట్‌ను వేస్తున్నట్లు సమాచారం.
Entertainment | Published On Apr 6, 2026, 4.48 pm IST
Yellamma Movie | టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ హీరోగా నటిస్తున్న ఎల్లమ్మ మూవీ ఎట్టకేలకు సెట్స్‌పైకి రాబోతుంది. ఈ నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతుంది. బలగం తర్వాత వేణు ఎల్దండి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు.
తెలంగాణ సంస్కృతి...
బలగం తరహాలోనే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు యాస, భాషలకు ప్రాముఖ్యతనిస్తూ వేణు ఎల్దండి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. నిమ్మకులానికి చెందిన డప్పు కళాకారుడి జీవన ప్రయాణంలో చోటుచేసుకున్న సంఘటనలతో ఎమోషనల్ డ్రామాగా ఎల్లమ్మ మూవీ ఉండబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అంతర్లీనంగా ఓ మైథలాజికల్ పాయింట్ ఉంటుందని టాక్ . దేవిశ్రీప్రసాద్ హీరోగా నటిస్తున్న ఫస్ట్ మూవీ ఇది. ఈ సినిమా కోసం దేవిశ్రీప్రసాద్ స్పెషల్‌గా మేకోవర్ అవుతున్నట్లు సమాచారం. కాగా ఎల్లమ్మ మూవీ ఈ నెలలోనే సెట్స్‌పైకి రాబోతుంది. ఏప్రిల్ 22 నుంచి హైదరాబాద్‌లో ఎల్లమ్మ మూవీ షూటింగ్ మొదలుకాబోతున్నట్లు సమాచారం.
తెలంగాణ విలేజ్ సెట్...
ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో తెలంగాణ పల్లెటూరిని తలపించేలా ఓ భారీ సెట్‌ను వేయబోతున్నారట. ఈ విలేజ్ సెట్‌లోనే చాలా వరకు ఎల్లమ్మ షూటింగ్ జరుబోతున్నట్లు సమాచారం. కొన్ని కీలక సన్నివేశాలను రియలిస్టిక్ లోకేషన్స్‌లో షూట్ చేయబోతున్నారట. ఇందుకోసం తెలంగాణలోని కొన్ని ప్రాంతాలను ఫైనల్ చేశారట డైరెక్టర్.
హీరోయిన్ ఎవరు?
ఎల్లమ్మ మూవీలో హీరోయిన్ ఎవరన్నది మేకర్స్ ఇప్పటివరకు రివీల్ చేయలేదు. తొలుత కథానాయికగా కీర్తి సురేష్ పేరు వినిపించింది. కానీ ఇటీవల జరిగిన ఓ సినిమా ప్రమోషన్స్‌లో తాను ఎల్లమ్మ సినిమా చేయడం లేదని కీర్తి సురేష్ ప్రకటించింది. కీర్తి సురేష్ ప్లేస్‌లో ఎవరిని హీరోయిన్‌గా తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
ఎల్లమ్మ మూవీలో హీరోగా నటిస్తూనే ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ ఏడాది చివరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
దేవిశ్రీప్రసాద్ కంటే ముందు ఈ సినిమాలో హీరోగా నాని, నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్‌తో పాటు మరికొందరి పేర్లు వినిపించాయి.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



