త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Oscars 2027 | ఇండియా నుంచి ఆస్కార్ బ‌రిలో మ‌రాఠీ థ్రిల్ల‌ర్ మూవీ – పెద్ది, ఇరుముడి సినిమాలకు నిరాశ‌

ఇండియా నుంచి ఆస్కార్‌కు అఫీషియ‌ల్ ఎంట్రీగా మ‌రాఠీ మూవీ గోంధాల్ ఎంపికైంది. ఆస్కార్ కోసం మొత్తం 33 సినిమాలు రేసులో నిల‌వ‌గా...వాటిలో నుంచి గోంధాల్‌ను ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసింది. తెలుగు నుంచి నాలుగు సినిమాలో పోటీలో నిల‌వ‌గా...వాటికి నిరాశే మిగిలింది. 99వ ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేట‌గిరీలో గోంధాల్‌ పోటీప‌డ‌నుంది.

N

Entertainment | Published On Sep 18, 2026, 4.28 pm IST

Oscars 2027 | ఇండియా నుంచి ఆస్కార్ బ‌రిలో మ‌రాఠీ థ్రిల్ల‌ర్ మూవీ – పెద్ది, ఇరుముడి సినిమాలకు నిరాశ‌
Advertisement

Oscars 2027 |  టాలీవుడ్‌కు మ‌రోసారి నిరాశే మిగిలింది. ఇండియా నుంచి ఈ సారి ఆస్కార్ బ‌రిలో తెలుగు సినిమాకు చోటు ద‌క్క‌డం ఖాయ‌మ‌ని ఫ్యాన్స్ భావించారు. కానీ జ్యూరీ క‌మిటీ టాలీవుడ్‌కు పెద్ద షాకిచ్చింది. ఈ ఏడాది ఇండియా నుంచి ఆస్కార్‌కు అఫీషియ‌ల్ ఎంట్రీగా మ‌రాఠీ మూవీ గోంధాల్ ఎంపికైంది. ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా ఈ విష‌యాన్ని శుక్ర‌వారం ప్ర‌క‌టించింది.

33 సినిమాలు పోటీ...

ఆస్కార్ ఎంట్రీ కోసం మొత్తం 33 సినిమాలు రేసులో నిలిచాయి. వీటిలో హిందీ నుంచి ప‌ధ్నాలుగు, తెలుగు, మ‌రాఠీ , గుజ‌రాతీ భాష‌ల నుంచి నాలుగేసి సినిమాలు పోటీప‌డ్డాయి . త‌మిళం నుంచి మూడు, మ‌ల‌యాళం, నాగ‌మీ భాష‌ల నుంచి ఒక్కో సినిమాతుది జాబితాలో చోటుద‌క్కించుకున్నాయి. వీటిలో నుంచి పీ శేషాద్రి నేతృత్వంలోని జ్యూరీ క‌మిటీ మ‌రాఠీ మూవీ గోంధాల్‌ను ఇండియా నుంచి ఆస్కార్ కోసం ఎంపిక‌చేసింది. 99వ ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేట‌గిరీలో ఈ సినిమా పోటీప‌డ‌నుంది.

పెద్ది...ఇరుముడి...

తెలుగు నుంచి రామ్ చ‌ర‌ణ్ పెద్ది, ర‌వితేజ ఇరుముడితో పాటు సింగ్ గీతం, ఇగ్వా సినిమాలు ఆస్కార్ స్క్రీనింగ్‌కు ఎంపిక‌య్యాయి. బాలీవుడ్ నుంచి ఇక్కీస్‌, ధురంధ‌ర్‌, 120 బ‌హ‌దూర్‌, బోర్డ‌ర్ 2, హ‌నుమాన్ అంశ్‌తో పాటు మ‌రొక‌న్ని సినిమాలు పోటీప‌డ్డాయి. వాట‌న్నింటికి కాద‌ని చిన్న సినిమాను ఆస్కార్ క‌మిటీ ఎంపిక చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌...

సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన గోంధాల్ మూవీకి సంతోష్ ధ‌వాక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కిశోర్ కదమ్, ఇషితా దేశ్‌ముఖ్, యోగేష్ సోహోని కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మ‌హారాష్ట్ర గ్రామీణ సంస్కృతులు, ఆచారాలు, సంప్ర‌దాయాల‌కు క్రైమ్ థ్రిల్ల‌ర్ ఎలిమెంట్స్ జోడించి ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించారు. గోంధాల్ అనే పూజ చుట్టూ ఈ మూవీ సాగుతుంది. సుమ‌న్, సాహేబ్రావ్ ప్రేమించుకుంటారు. కానీ పెద్ద‌లు మాత్రం వీరి ప్రేమ‌ను వ్య‌తిరేకిస్తారు.ఆనంద్ అనే యువ‌కుడితో సుమ‌న్ పెళ్లిజ‌రిపిస్తారు. వివాహం త‌ర్వాత ఇంట్లో దుష్ట శ‌క్తులు తొల‌గిపోవాల‌ని భ‌ర్త‌తో క‌లిసి గోంధాల్ పూజ చేయాల‌ని సుమ‌న్ నిర్ణ‌యించుకుంటుంది. ఈ పూజ రోజే భ‌ర్త‌ను చంపి ఆ నేరాన్ని స‌ర్దేరావ్‌పై నెట్టేయాల‌ని ప్లాన్ చేస్తుంది? ఆమె ప‌న్నాగం స‌క్సెస్ అయ్యిందా? సుమ‌న్ చ‌నిపోయాడా? అస‌లు స‌ర్ధేరావ్ ఆ పూజ‌కు ఎందుకు వ‌చ్చాడు అనే అంశాల‌తో ద‌ర్శ‌కుడు ఈ సినిమాను రూపొందించారు. గ‌త ఏడాది జ‌రిగిన ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియాలో సిల్వ‌ర్ పికాక్ అవార్డు ఈ సినిమా ద‌క్కించుకుంది.

 

Advertisement
Advertisement