Ghooskhor Pandat | టైటిల్ వివాదం – మనోజ్ బాజ్‌పాయ్ ఘూస్కోర్ పండత్ మూవీ బ్యాన్?
మనోజ్ బాజ్‌పాయ్ హీరోగా నటించిన ఘూస్కోర్ పండత్ సినిమా రిలీజ్ కావడం అనుమానంగా మారింది. టైటిల్ వివాదం నేపథ్యంలో ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ సినీ ఎంప్లాయ్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. తమ నిర్ణయాన్ని కాదని సినిమాను రిలీజ్ చేస్తే నీరజ్ పాండ్‌తో కలిసి భవిష్యత్తులో పనిచేయబోమని హెచ్చరించారు.
Entertainment | Published On Feb 9, 2026, 5.05 pm IST
Ghooskhor Pandat | మనోజ్ బాజ్‌పాయ్ హీరోగా నటించిన ఘూస్కోర్ పండత్ సినిమా వివాదం రోజురోజుకు ముదురుతోంది. టైటిల్‌పై తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో ఈ సినిమా పేరు మార్చవచ్చని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఏకంగా సినిమానే నిషేదానికి గురయ్యే అవకాశాలు కనిపిస్తోన్నాయి. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ ది ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ (ఎఫ్‌డబ్ల్యూఐసీయి) డిమాండ్ చేస్తోంది. తమ డిమాండ్‌ను లెక్కచేయకుండా సినిమాను రిలీజ్ చేస్తే భవిష్యత్తులో నిర్మాత నీరజ్ పాండేతో పాటు ఈ సినిమాకు వర్క్‌చేసిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులతో కలిసి తమ యూనియన్ పనిచేయదని హెచ్చరికలు జారీ చేశారు.
సహాయ నిరాకరణ...
సినిమా అన్నది సృజనాత్మకతతో ముడిపడిన రంగమని, కానీ క్రియేటివిటీ పేరుతో సామాజిక వర్గాలను తక్కువ చేయాలని చూడటం, మనోభావాలను దెబ్బతీయాలని అనుకోవడం సరైంది కాదని ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ బీఎన్ తివారీ అన్నారు. ఈ సినిమాను బ్యాన్ చేయని పక్షంలో తమ యూనియన్‌లోని 36 అసోసియేషన్ల నుంచి మేకర్స్‌కు సహాయ నిరాకరణ నోటీసులను పంపిస్తామని హెచ్చరించారు. సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నిర్ణయంతో ఘూస్కోర్ పండత్ మూవీపై నిషేదం పడే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ కావడం అనుమానమేనని అంటోన్నారు.
నెట్‌ఫ్లిక్స్‌లో...
షూస్కోర్ పండత్ సినిమాలో మనోజ్ బాజ్‌పాయ్, రిద్దిమా పండిత్, జోయా అఫ్రోజ్, దివ్యా దత్తా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు నీరజ్ పాండే ఈ సినిమాకు కథను అందిస్తూ స్వయంగా నిర్మిస్తున్నారు. రితేష్ షా దర్శకత్వం వహించనున్నారు. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
బ్రహ్మణ సంఘాలు...
ఇటీవల ఘూస్కోర్ పండత్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్‌తోనే సినిమా వివాదంలో చిక్కుకుంది. టైటిల్‌ఫై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా బ్రహ్మణ సంఘాల నుంచి టైటిల్‌పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. బ్రహ్మణులను అవినీతిపరులు, లంచగొండి అంటూ కించపరిచేలా ఈ సినిమా టైటిల్ ఉందంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. నెటిజన్ల నుంచే కాకుండా మాయవతి, బ్రజేష్ పాఠక్ లాంటి పొలిటికల్ లీడర్స్ సైతం ఘూస్కోర్ పండత్ టైటిల్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ విమర్శించారు. ఈ వివాదానికి సంబంధించి నీరజ్ పాండేపై లక్నోలో కేసు కూడా నమోదు అయ్యింది. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ విమర్శల నేపథ్యంలో ఘూస్కోర్ పండత్ టీజర్‌ను తమ ఓటీటీ నుంచి నెట్‌ఫ్లిక్స్ తొలగించింది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



