త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manchu Manoj | శివాజీ త‌ర‌ఫున క్ష‌మాప‌ణలు చెప్పిన మంచు మ‌నోజ్

దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్‌ల‌పై యాక్ట‌ర్ శివాజీ చేసిన కామెంట్ల‌పై మంచు మ‌నోజ్ స్పందించారు. శివాజీ త‌ర‌ఫున తాను క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నానంటూ ఓ లేఖ‌ను రిలీజ్ చేశారు. హిళ‌ల ఇలాంటి దుస్తులే ధ‌రించాలి. నైతికంగా ఇలాగే ఉండాలి అంటూ హ‌ద్దులు విధించ‌డం క‌రెక్ట్ కాద‌న్నారు.

N

Entertainment | Published On Dec 23, 2025, 4.39 pm IST

Manchu Manoj | శివాజీ త‌ర‌ఫున క్ష‌మాప‌ణలు చెప్పిన మంచు మ‌నోజ్
Advertisement

హీరోయిన్ల డ్రెస్‌ల గురించి సీనియ‌ర్ యాక్ట‌ర్ శివాజీ చేసిన వ్యాఖ్యల‌పై హీరో మంచు మ‌నోజ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌హిళ‌లు ఎలాంటి దుస్తులు ధ‌రించాల‌న్న‌ది వారి వ్య‌క్తిగ‌త ఇష్ట‌మ‌ని, ఈ విష‌యంలో వారిని అవ‌మానించేలా మాట్లాడ‌టం క‌రెక్ట్ కాద‌ని మంచు మ‌నోజ్ అన్నారు. ఈ మేర‌కు మంచు మ‌నోజ్ ఓ ప్ర‌క‌ట‌న‌ను రిలీజ్ చేశారు. ఈ లెట‌ర్‌లో శివాజీ పేరును మంచు మ‌నోజ్ ఎక్క‌డ ప్ర‌స్తావించ‌లేదు. సీనియ‌ర్ యాక్ట‌ర్ అంటూ పేర్కొన్నారు. శివాజీ త‌ర‌ఫున తాను క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న‌ట్లు ఈ లెట‌ర్‌లో మంచు మ‌నోజ్ పేర్కొన్నారు.
ఓ సీనియ‌ర్ యాక్ట‌ర్ కామెంట్స్ త‌న‌ను తీవ్ర నిరాశకు గురిచేశాయ‌ని మంచు మ‌నోజ్ అన్నారు. "మ‌హిళ‌ల ఇలాంటి దుస్తులే ధ‌రించాలి. నైతికంగా ఇలాగే ఉండాలి అంటూ హ‌ద్దులు విధించ‌డం క‌రెక్ట్ కాదు. గౌర‌వం, జవాబుదారీతనం అన్న‌వి వ్యక్తిగత ప్రవర్తనతో వ‌స్తాయి త‌ప్పితే ధ‌రించే దుస్తుల‌ను బ‌ట్టి రావు. డ్రెస్‌లో విష‌యంలో మ‌హిళ‌ల‌ను అవ‌మానించ‌డం స‌మంజ‌సం కాదు. . ప్ర‌జా ప్ర‌తినిధులు మాట‌లు స‌మాజాన్ని చాలా ప్ర‌భావితం చేస్తాయి. అందుకే ప్ర‌తి మాట బాధ్య‌తాయుతంగా మాట్లాడాలి. మ‌హిళ‌ల‌ను కించే ప‌రిచే ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డ‌మంటే భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన‌ట్లే. సమానత్వం, గౌరవం మరియు వ్యక్తిగత స్వేచ్ఛ అన్న‌వి చ‌ర్చ‌ల‌తో ముడిప‌డిన‌ అంశాలు కావు. ప్ర‌జ‌ల అభిప్రాయాలు, ఇష్టాల‌నే అనుప‌రించే మ‌హిళ‌ల దుస్తులు ఉండాల‌నేం లేదు. మ‌హిళ‌ల‌ను ఓ ఆట వస్తువులుగా పేర్కొంటూ వారిపై అవ‌మాన‌క‌ర వ్యాఖ్య‌లు చేసిన సీనియర్ నటుడి తరపున నేను క్షమాపణలు చెబుతున్నా. ఇలాంటి మాట‌లు ఎవ‌రూ మాట్లాడిన మ‌హిళ‌లు భ‌రించాల్సిన‌ అవ‌స‌రం లేదు" అంటూ మంచు మ‌నోజ్ పేర్కొన్నారు.
శివాజీ చేసిన వ్యాఖ‌ల‌పై మంచు మ‌నోజ్‌తో పాటు యాంక‌ర్ అన‌సూయ‌, సింగ‌ర్ చిన్మ‌యి కూడా ఫైర్ అయ్యారు. డ్రెసెస్ అన్నది పర్సనల్ ఛాయిస్ అని అనసూయ అన్నది. ఇన్ సెక్యూరిటీతోనే శివాజీ ఇలాంటి చీప్ కామెంట్స్ చేశాడ‌ని విరుచుకుప‌డింది . మ‌రోవైపు స్పీచ్‌లో శివాజీ వాడిన భాష‌ను చిన్మ‌యి త‌ప్పుప‌ట్టింది.

ALSO READ Anasuya | శివాజీకి అనసూయ కౌంటర్ – మెట్టెలు పెట్టుకోవాలంటూ చిన్మయి పోస్ట్‌

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement