Manchu Manoj | వచ్చే ఎన్నికల్లో నా భార్య పోటీ ….మాకు రాజకీయాలు కొత్త కాదు – మంచు మనోజ్ కామెంట్స్
సత్య, వెన్నెలకిషోర్‌లతో కలిసి వాట్ ద పిష్ పేరుతో ఓ సినిమా చేయాల్సిందని, కానీ వీసా సమస్యల వల్ల ఆ సినిమా ఆగిపోయిందని మంచు మనోజ్ అన్నారు. తన ప్రతి పుట్టినరోజును జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి జరుపుకోవడం అలవాటు అని చెప్పారు.
Entertainment | Published On May 19, 2026, 7.02 pm IST
Manchu Manoj | తాను పుట్టినప్పటి నుంచి రాజకీయాల్లోనే ఉన్నానని....కొత్తగా రాజకీయాల్లోకి రావడం అంటూ ఉండదని మంచు మనోజ్ అన్నారు. ప్రయోగాత్మక చిత్రాలతో హీరోగా తెలుగు ప్రేక్షకులను మెప్పించారు మంచు మనోజ్. 2018లో వచ్చిన ఒక్కడు మిగిలాడు తర్వాత సినిమాలకు దాదాపు ఏడేళ్ల పాటు గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ భైరవం మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. గత ఏడాది బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన మిరాయ్‌లో విలన్ పాత్రతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం హీరోగా డేవిడ్ రెడ్డితో పాటు మరికొన్ని సినిమాలు చేస్తున్నాడు. తన బర్త్‌డే (మే 20) సందర్భంగా మంగళవారం మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు మంచు మనోజ్. ఇటీవలే ప్రకటించిన ఐక్య ట్రస్ట్, తన సినీ ప్రయాణం, రాజకీయ జీవితం గురించి మంచు మనోజ్ ఏమన్నారంటే?
ఐక్య పేరుకు అర్థం ఇదే...
నేను సూపర్ మ్యాన్‌ని కాదు. అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండకపోవచ్చు. ఆ ఆలోచన నుంచే ఐక్య ట్రస్ట్ మొదలైంది. ఈ ట్రస్ట్‌కు ‘ఐక్య ధైర్య సేనా సమితి’ అని పేరు పెట్టడానికి చాలా కారణాలున్నాయి. ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం. విభజించుకుంటూ వెళ్తే చివరకు ఏమీ మిగలదు. అందుకే అందరం ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఐక్య అని పెట్టాం. నా కొడుకు పేరు ధైరవ్, నా బిడ్డ పేరు దేవ సేన ఇలా అందరి పేర్లు కలిపి ‘ఐక్య ధైర్య సేనా సమితి’ అని పెట్టాం. ఈ ట్రస్ట్ కూడా మాకు ఓ బిడ్డ లాంటిదే. ‘ఐక్య’ ట్రస్ట్ వెనుక రాజకీయ ఉద్దేశం లేదు. ఎప్పటి నుంచో ఇలాంటి ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని అనుకున్నాం. ప్రస్తుతం ఈ ట్రస్ట్‌కు సంబంధించిన నియమాలను రూపొందించే పనిలో ఉన్నాం. ఈ ట్రస్ట్ నడిపేందుకు అవసరమయ్యే నిధుల కోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహించే ఆలోచనలో ఉన్నా...
రక్షక్...
జూన్ 7న నా కొత్త సినిమా ‘రక్షక్’ ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ‘రక్షక్’ తెరకెక్కుతోంది. అందులో నేను పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నాను. ఆ మూవీ ప్రారంభోత్సవం నాడే ‘ఐక్య’కి సంబంధించిన అన్ని విషయాల్ని అధికారికంగా ప్రకటించబోతున్నాం...
జోక్యం చేసుకోం...
భైరవం, మిరాయ్ సినిమాలు నాకు నటుడిగా పునర్జన్మనిచ్చాయి. ఇకపై హీరోగానే కాకుండా అన్ని రకాల పాత్రల్ని చేయాలని అనుకుంటున్నాను. కెరీర్ ప్రారంభం నుంచీ ఇప్పటి వరకు ప్రతీ స్క్రిప్ట్, కథని నేనే విన్నాను. నేనే ఓకే చేశా. ఇప్పుడు కూడా నేనే వింటాను. నాకు నచ్చిన కథల్నే చేస్తాను. నా కెరీర్ విషయంలో భార్య మౌనిక జోక్యం చేసుకోదు. ఆమె వృత్తిపరమైన జీవితంలోకి నేను కలుగజేసుకోను. మేం పరస్పరం ఆ విషయంలో ఒకరినొకరం గౌరవించుకుంటాం . నాతో పాటు మౌనికకు రాజకీయాలు కొత్త కాదు. మేం పుట్టినప్పటి నుంచీ రాజకీయాల్లోనే ఉన్నాం. కొత్తగా రాజకీయాల్లోకి రావడం అంటూ ఏం లేదు. వచ్చే ప్రత్యక్ష ఎన్నికల్లో నా భార్య పోటీ చేయబోతుంది.నా ప్రతి పుట్టిన రోజుని జూనియర్ ఎన్టీఆర్‌తో జరుపుకోవడం అలవాటు. ఈ సారి కూడా అలాగే జరుపుకోవాలని అనుకుంటున్నా..
ఎవరిని అడగాలో తెలుసుగా...
నాన్న మోహన్‌బాబుతో పాటు అన్న మంచు విష్ణుతో నెలకొన్న ఆస్తి విభేదాలపై కూడా ఇంటర్వ్యూలో మనోజ్ రియాక్ట్ అయ్యారు. ఈ గొడవలు సమసిపోయాయా అని అడగ్గా...వాటి గురించి ఎవరిని అడగాలో మీకు తెలుసు. కానీ మైక్‌తో వెళ్లకండి. వెళ్లినా హెల్మెట్ పెట్టుకొని వెళ్లండి అంటూ సరదాగా కామెంట్స్ చేశారు.
వీసా సమస్యలతో....
తన నెక్స్ట్ సినిమాల గురించి మంచు మనోజ్ మాట్లాడుతూ నేను హీరోగా నటించిన డేవిడ్ రెడ్డి గ్లింప్స్ బుధవారం సాయంత్రం రాబోతుంది. డేవిడ్ రెడ్డి షూటింగ్ దాదాపు 40 శాతం పూర్తయింది.ఇటీవలే మధ్య ప్రదేశ్‌లో షూటింగ్ చేశాం. నేను, సత్య, వెన్నెల కిషోర్ వాట్ ది ఫిష్ పేరుతో ఓ సినిమా చేయాల్సింది. వీసా సమస్యల వల్ల సినిమా ఆగిపోయింది. స్క్రిప్ట్ చాలా బాగుంటుంది. కానీ పరిస్థితులు కలిసి రాలేదు. మరో మూడు నాలుగు సినిమాలు చేస్తోన్న. వాటికి సంబంధించిన అనౌన్స్మెంట్‌లు ఈ నెలలోనే వస్తాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●PhonePe | ఫోన్ పే రూ.10 పెట్టుబడి ఫీచర్‌కు విశేష రీతిలో స్పందన.. భారీగా పెరుగుతున్న కస్టమర్లు..
- ●Minister Uttam Kumar Reddy | రైతుల ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం.. ప్రతీ గింజకూ లెక్క చెప్పాల్సిందే : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
- ●Kaloji Health University | విద్యార్థులకు అలర్ట్.. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ
- ●Faridabad Teacher | 30 సెకన్లలో 34 కత్తిపోట్లు.. స్కూల్ టీచర్‌పై వ్యక్తి పైశాచిక దాడి
- ●Penny Stocks | కాసుల వర్షం కురిపిస్తున్న పెన్నీ స్టాక్స్.. 6 నెలల్లో 198 శాతం లాభాలు..
- ●Harish Rao | డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కు పూర్తి స్థాయి అధికారిని నియమించాలి.. హరీశ్ రావు డిమాండ్

PhonePe | ఫోన్ పే రూ.10 పెట్టుబడి ఫీచర్‌కు విశేష రీతిలో స్పందన.. భారీగా పెరుగుతున్న కస్టమర్లు..

Minister Uttam Kumar Reddy | రైతుల ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం.. ప్రతీ గింజకూ లెక్క చెప్పాల్సిందే : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి

Kaloji Health University | విద్యార్థులకు అలర్ట్.. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ

Faridabad Teacher | 30 సెకన్లలో 34 కత్తిపోట్లు.. స్కూల్ టీచర్‌పై వ్యక్తి పైశాచిక దాడి






