Manchu Lakshmi | సినిమాలు తీసి అప్పుల పాలయ్యా – మంచు లక్ష్మి కామెంట్స్
సినిమాలు నిర్మించి అప్పుల పాలయ్యానని మంచు లక్ష్మి అన్నది. అప్పులు కట్టడానికే ఇతర సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తున్నట్లు చెప్పింది.
Entertainment | Published On Feb 17, 2026, 7.20 pm IST
Manchu Lakshmi | సినిమాలు నిర్మించి అప్పుల పాలయ్యానని మంచు లక్ష్మి అన్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తమిళ మూవీ పూకీ గత వారం థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాతోనే దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మి. పూకీ సినిమాను కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ నిర్మించారు. అంతే కాకుండా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా, ఎడిటర్‌గాను వ్యవహరించాడు. విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ దిషాన్ ఇందులో హీరోగా నటించాడు. పూకీ సినిమా తెలుగులో బూకీ పేరుతో ఫిబ్రవరి 20న థియేటర్లలోకి రాబోతుంది.
అప్పులు కట్టడానికే...
బూకీ మూవీ ప్రెస్‌మీట్‌ను మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో మంచు లక్ష్మి పాల్గొన్నది. తెలుగులో సినిమాలు నిర్మించి తాను అప్పుల పాలయ్యానని అన్నది. ఐదేళ్ల క్రితం తీసిన ఓ సినిమా అప్పులను తాను ఇప్పటికీ కడుతున్నానని చెప్పింది. ఆ ఆప్పులను తీర్చడానికే ఇతర సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తున్నానని చెప్పింది.
గమ్మత్తైన రోల్...
బూకీ యూత్‌ఫుల్ మూవీ అని మంచు లక్ష్మి అన్నది. యూనివర్సల్ కాన్సెప్ట్‌తో డైరెక్టర్ ఈ సినిమాను రూపొందించారని, కొరియన్ లాంగ్వేజ్‌లో చూసిన ఈ సినిమా అర్థమవుతుందని తెలిపింది. సైకియాట్రిస్ట్‌తన పాత్ర తాలూకు ఎక్స్‌ప్రెషన్స్ గమ్మత్తుగా ఉంటాయని చెప్పింది. నా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసి ఈ సినిమాలో అవకాశం ఇచ్చానని డైరెక్టర్ అన్నాడు. "చాలా ఫన్నీగా క్యారెక్టర్‌ను డిజైన్ చేశారు. ఈ సినిమాకు తెలుగుతో పాటు తమిళంలోనూ నేనే సొంతంగా డబ్బింగ్ చెప్పా. ఇందులో పాట పాడే అవకాశం ఇవ్వమని విజయ్ ఆంటోనీని అడిగా. కానీ నెక్స్ట్ సినిమాలో అవకాశం ఇస్తానని ఆయన మాటిచ్చాడు సినిమా కంటే నేనే బయటే బాగుంటావని చాలా మంది నాతో అంటుంటారు. కానీ నాకు మాత్రం సిల్వర్ స్క్రీన్‌పైనే అందంగా కనిపించాలని ఉంటుంది. . ఇందులో హీరోయిన్ ధనూషతో పాటు నన్ను చాలా బాగా చూపించారు" కెమెరామెన్ అని అన్నది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



