త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manasa Varanasi | మిస్ ఇండియాతో రొమాన్స్ చేయ‌నున్న మెగా హీరో – బ‌రిలో హీరోయిన్ ఎవ‌రంటే?

మెగా హీరో వ‌రుణ్ తేజ్ త‌న నెక్స్ట్ మూవీలో మిస్ ఇండియాతో రొమాన్స్ చేయ‌బోతున్నాడు. వ‌రుణ్‌తేజ్ హీరోగా న‌టిస్తున్న బ‌రి మూవీ ఇటీవ‌ల లాంఛ్ అయ్యింది. స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో మాన‌స వార‌ణాసి హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

N

Entertainment | Published On Apr 9, 2026, 5.15 pm IST

Manasa Varanasi | మిస్ ఇండియాతో రొమాన్స్ చేయ‌నున్న మెగా హీరో – బ‌రిలో హీరోయిన్ ఎవ‌రంటే?
Advertisement

Manasa Varanasi |  స‌క్సెస్‌, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా క‌థ‌, పాత్ర‌ల ప‌రంగా ప్ర‌యోగాలు చేస్తుంటారు మెగా హీరో వ‌రుణ్‌తేజ్‌. హార‌ర్ కామెడీ మూవీ కొరియ‌న్ క‌న‌క‌రాజుతో త్వ‌ర‌లోనే తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఈ సినిమా రిలీజ్‌కాక‌ముందే ఇటీవ‌లే బ‌రి పేరుతో మ‌రో సినిమాకు వ‌రుణ్‌తేజ్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. వ‌రుణ్‌తేజ్ సోద‌రి, మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఈ మూవీ ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌తో గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. ఈ వేడుక‌ల‌కు మెగాస్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యాడు.

ప‌ల్లెటూరి అమ్మాయిగా...

కాగా బ‌రి మూవీ కోసం మిస్ ఇండియాతో వ‌రుణ్ తేజ్ రొమాన్స్ చేయ‌బోతున్నాడ‌ట‌. స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో మాన‌స వార‌ణాసి హీరోయిన్‌గా ఎంపికైన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఈ సినిమాలో మాన‌స వార‌ణాసి ప‌ల్లెటూరి అమ్మాయిగా క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇందులో వ‌రుణ్ తేజ్‌, మాన‌స కెమిస్ట్రీ కొత్త‌గా ఉండ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు.

రొమాంటిక్ ల‌వ్‌స్టోరీ...

మాన‌స వార‌ణాసి హీరోయిన్‌గా న‌టించిన క‌పుల్ ఫ్రెండ్లీ ఇటీవ‌లే థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ సినిమాలో మిత్ర పాత్ర‌లో త‌న నాచుర‌ల్ యాక్టింగ్‌, ఎక్స్‌ప్రెష‌న్స్‌తో తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించింది. క‌పుల్ ఫ్రెండ్లీ మూవీలో మాన‌స యాక్టింగ్‌కు ఇంప్రెస్ అయిన డైరెక్ట‌ర్ య‌దు వంశీతో పాటు ప్రొడ్యూస‌ర్ నిహారిక కొణిదెల బ‌రిలో హీరోయిన్‌గా ఆమె పేరును ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానుంద‌ని అంటున్నారు. మ‌రోవైపు బ‌రితో పాటు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ పెద్దిలోనూ స్పెష‌ల్ సాంగ్‌లో మాన‌స వార‌ణాసి న‌టించ‌బోతున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

మిస్ ఇండియా...

హైద‌రాబాద్‌లో పుట్టి పెరిగిన మాన‌స వార‌ణాసి 2020 మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. మిస్ వ‌ర‌ల్డ్ పోటీల్లో సెకండ్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. మ‌హేష్‌బాబు మేన‌ల్లుడు అశోక్ గ‌ల్లా హీరోగా న‌టించిన దేవ‌కీ నంద‌న వాసుదేవ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. క‌పుల్ ఫ్రెండ్లీ మూవీతో హీరోయిన్‌గా ఫ‌స్ట్ హిట్‌ను అందుకుంది.

Advertisement
Advertisement