Trp Rating | టీఆర్‌పీలో కుమ్మేసిన మన శంకర వరప్రసాద్ గారు – జీ తెలుగులో చిరంజీవి మూవీ రికార్డ్
చిరంజీవి మన శంకర వరప్రసాద్‌గారు టీఆర్‌పీ రేటింగ్‌లో అదరగొట్టింది. జీ తెలుగు ఛానెల్‌లో హయ్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌ను దక్కించుకున్న టాప్ టెన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు వచ్చిన రేటింగ్ ఎంతంటే?
Entertainment | Published On Mar 12, 2026, 6.30 pm IST
Trp Rating | చిరంజీవి మన శంకర వరప్రసాద్‌గారు మూవీ థియేటర్లలోనే కాదు...టీవీలో అదరగొట్టింది. జీ తెలుగులో హయ్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌ను దక్కించుకున్న మూవీగా నిలిచింది. ఇటీవలే ఈ మూవీ జీ తెలుగు ఛానెల్‌లో టెలికాస్ట్ అయ్యింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు ఏకంగా 14.2 టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. ఈ విషయాన్ని జీ తెలుగు అఫీషియల్‌గా ప్రకటించింది. ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది.
శ్రీమంతుడు తర్వాత...
జీ తెలుగులో హయ్యెస్ట్ టీఆర్‌పీని దక్కించుకున్న టాప్ టెన్ సినిమాల్లో ఒకటిగా మన శంకర వరప్రసాద్‌గారు మూవీ నిలిచింది. ఈ లిస్ట్‌లో మహేష్‌బాబు శ్రీమంతుడు మూవీ (21.24 రేటింగ్) టాప్‌లో నిలిచింది. ఏడో ప్లేస్‌ను మన శంకర వరప్రసాద్‌గారు సొంతం చేసుకుంది.మన శంకర వరప్రసాద్‌గారు మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో నటించారు. చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్ తెలుగు మూవీ ఇదే కావడం గమనార్హం.
సంక్రాంతి విన్నర్....
సంక్రాంతికి థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పండుగ విన్నర్‌గా నిలిచింది. రెండు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ నాలుగు వందల కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. సాహు గారపాటితో కలిసి చిరంజీవి కూతురు సుస్మిత ఈ సినిమాను నిర్మించింది. భీమ్స్ మ్యూజిక్ అందించాడు.
శశిరేఖ కోసం...
శంకర వరప్రసాద్ అలియాస్ ప్రసాద్ (చిరంజీవి) సెంట్రల్ మినిస్టర్ నితిన్ శర్మకు ఛీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. అందరితో సరదాగా ఉండే ప్రసాద్ మనసులో మాత్రం అంతులేని బాధను మోస్తుంటాడు. ఇండియాలోనే టాప్ బిజినెస్ ఉమెన్ అయిన శశిరేఖ(నయనతార) ను ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు ప్రసాద్. కానీ మనస్పర్థల కారణంగా ప్రసాద్‌కు విడాకులు ఇస్తుంది శశిరేఖ. అందుకు కారణమేమిటి? శశిరేఖ, ప్రసాద్ విడిపోవడానికి కారణమైన జీవీఆర్ (శరధ్ ఖేల్కర్) ఎవరు? శశిరేఖతో పాటు తన పిల్లల ప్రాణాలు కాపాడటానికి మాజీ భార్య ఇంటికే సెక్యూరిటీ ఆఫీసర్‌గా ప్రసాద్ ఎందుకు రావాల్సివచ్చింది? ప్రసాద్ ను కాదని వెంకీ గౌడ (వెంకటేష్) పెళ్లి చేసుకోవడానికి శశిరేఖ ఎందుకు ఒప్పుకుంది? అన్నదే ఈ మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Telugu Serials | తెలుగు సీరియల్స్ టీఆర్‌పీ రేటింగ్ – గుండె నిండా గుడి గంటలు టాప్ – కార్తీక దీపం 2 డౌన్
జూన్ 25, 2026

Trisha | చిరంజీవి విశ్వంభర రిలీజ్‌డేట్ ఇదేనా – పదేళ్ల తర్వాత తెలుగులోకి త్రిష రీఎంట్రీ
ఏప్రిల్ 9, 2026

Bhagyashri Borse | లవ్లెటర్కు భాగ్యశ్రీ బోర్సే క్రేజీ రియాక్షన్ – నెట్టింట వైరల్ అవుతోన్న పోస్ట్
ఏప్రిల్ 6, 2026
తాజావార్తలు
- ●Minister Ponnam | చదువుకు ఆటంకం కలుగకుండా ఫీజు రీయింబ్స్‌మెంట్
- ●Bihar Student Protests | పాట్నాలో రణరంగం: బారికేడ్లు బద్దలుకొట్టి సీఎం ఇంటికి విద్యార్థుల మార్చ్.. లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు
- ●Kuttu Machine Scheme | ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్’ పథకం.. దరఖాస్తు ప్రక్రియ షురూ..
- ●Ponguleti Srinivas Reddy | ఎల్లుండి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా.. ఎంపిక కానివారికి డబ్బులు వాపస్ ఇస్తాం
- ●Rashmika Mandanna | రవితేజ ఇరుముడికి రష్మిక మందన్న ఎమోషనల్ రివ్యూ
- ●సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్: బెల్లంపల్లి డిప్సైడ్లో సన్నాహాలు – కార్మికులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు

Minister Ponnam | చదువుకు ఆటంకం కలుగకుండా ఫీజు రీయింబ్స్‌మెంట్

Bihar Student Protests | పాట్నాలో రణరంగం: బారికేడ్లు బద్దలుకొట్టి సీఎం ఇంటికి విద్యార్థుల మార్చ్.. లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు

Kuttu Machine Scheme | ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్’ పథకం.. దరఖాస్తు ప్రక్రియ షురూ..

Ponguleti Srinivas Reddy | ఎల్లుండి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా.. ఎంపిక కానివారికి డబ్బులు వాపస్ ఇస్తాం



