Trisha | చిరంజీవి విశ్వంభర రిలీజ్‌డేట్ ఇదేనా – పదేళ్ల తర్వాత తెలుగులోకి త్రిష రీఎంట్రీ
దాదాపు పదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత విశ్వంభర మూవీతో త్రిష టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ మూవీ జూలై 10న రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు.
Entertainment | Published On Apr 9, 2026, 2.26 pm IST
Trisha | చెన్నై క్వీన్ త్రిష తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చి పదేళ్లు దాటిపోయింది. 2016లో రిలీజైన నాయకి తర్వాత టాలీవుడ్‌కు బ్రేక్ ఇచ్చిన త్రిష తమిళం, మలయాళంలోనే సినిమాలు చేస్తోంది. లాంగ్ గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన విశ్వంభరతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తయి ఏడాది దాటిపోయింది. గ్రాఫిక్స్,వీఎఫ్ఎక్స్ విషయంలో విమర్శలు రావడంతో మేకర్స్ విశ్వంభరను వాయిదావేస్తూ వస్తున్నారు.
జూలైలో రిలీజ్...
ఎట్టకేలకు విశ్వంభర రిలీజ్ డేట్ కన్ఫామ్ అయినట్లు సమాచారం. జూలై 10న ఈ సినిమా థియేటర్లలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోస్ట్‌ప్రొడక్షన్ పనులన్నీ దాదాపు పూర్తయ్యాయట. త్వరలోనే ఓ గ్రాండ్ ఈవెంట్ ద్వారా విడుదల తేదీని అనౌన్స్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
సత్య లోకం కథతో...
విశ్వంభర మూవీకి వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఓ అమ్మాయి కోసం పధ్నాలుగు లోకాలు దాటి బ్రహ్మ సృష్టించిన సత్యలోకానికి విశ్వంభర ఎందుకు వెళ్లాడు? ఆ అమ్మాయితో అతడికి ఉన్న సంబంధం ఏమిటనే అంశాలతో సోషియా ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వశిష్ట మల్లిడి ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో అంతర్లీనంగా ఓ మైథలాజికల్ అంశాల ప్రస్తావన ఉంటుందని అంటున్నారు. దాదాపు 180 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ విశ్వంభర సినిమాను రూపొందించింది.
స్టాలిన్ తర్వాత...
చిరంజీవి, త్రిష కాంబినేషన్‌లో వస్తోన్న సెకండ్ మూవీ ఇది. గతంలో వీరిద్దరు కలయికలో వచ్చిన స్టాలిన్ పెద్ద హిట్టయ్యింది. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత విశ్వంభర కోసం మరోసారి జోడీకట్టారు. విశ్వంభర సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందించారు.
విశ్వంభరతో పాటు త్రిష హీరోయిన్‌గా నటించిన తమిళ మూవీ కరుప్పు రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. సూర్య హీరోగా నటించిన ఈ మూవీ మే 14న రిలీజ్ కాబోతుంది. కరుప్పు సినిమాకు తెలుగులో వీరభద్రుడు అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మూడు నెలల గ్యాప్‌లో త్రిష హీరోయిన్‌గా నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
తాజావార్తలు
- ●CS Jaju | ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎస్ సంజయ్ జాజు ఆదేశం..
- ●ఆపరేషన్ సిందూర్ వేళ సైబర్ దాడులు: రామగుండం సహా 5 ప్రాంతాల్లో NIA మెరుపు సోదాలు.. అసలు లింకేంటి?
- ●Urea price impact Telangana | రైతన్నలూ.. తక్కువ ధరకు దొరికే యూరియాను వాడకండి.. నేల ఆరోగ్యం దెబ్బతింటుంది
- ●Revanth Reddy | మూసీ భూసేకరణలో వేగం పెంచండి.. చిక్కులు రావొద్దు
- ●Tamannaah | హీరోతో గొడవలు - సినిమా నుంచి తప్పుకున్న దర్శకుడు - చిక్కుల్లో తమన్నా బాలీవుడ్ మూవీ?
- ●Minister Ponnam | చదువుకు ఆటంకం కలుగకుండా ఫీజు రీయింబ్స్‌మెంట్

CS Jaju | ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎస్ సంజయ్ జాజు ఆదేశం..

ఆపరేషన్ సిందూర్ వేళ సైబర్ దాడులు: రామగుండం సహా 5 ప్రాంతాల్లో NIA మెరుపు సోదాలు.. అసలు లింకేంటి?

Urea price impact Telangana | రైతన్నలూ.. తక్కువ ధరకు దొరికే యూరియాను వాడకండి.. నేల ఆరోగ్యం దెబ్బతింటుంది

Revanth Reddy | మూసీ భూసేకరణలో వేగం పెంచండి.. చిక్కులు రావొద్దు






