Malayalam OTT | ఓటీటీలోకి మమ్ముట్టి, మోహన్‌లాల్ మలయాళ మల్టీస్టారర్ మూవీ – తెలుగులోనూ రిలీజ్
మమ్ముట్టి, మోహన్‌లాల్ హీరోలుగా నటించిన మలయాళం మల్టీస్టారర్ మూవీ పేట్రియాట్ ఓటీటీ రిలీజ్ కన్ఫామ్ అయ్యింది. జూన్ 5 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. నయనతార హీరోయిన్‌గా నటించిన పేట్రియాట్ థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచింది.
Entertainment | Published On May 22, 2026, 3.34 pm IST
Malayalam OTT | మలయాళంలో అగ్ర హీరోలుగా కొనసాగుతోన్నారు మమ్ముట్టి, మోహన్‌లాల్. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మల్టీస్టారర్ మూవీ పేట్రియాట్ ఇటీవలే థియేటర్లలో రిలీజైంది. దాదాపు పద్దెనిమిదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మమ్ముట్టి, మోహన్‌లాల్ కలిసి నటించిన సినిమా కావడంతో రిలీజ్‌కు ముందు పేట్రియాట్‌పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, నయనతార, కుంచకో బోబన్, దర్శనా రాజేంద్రన్ కీలక పాత్రల్లో నటించారు.
డిజాస్టర్...
దాదాపు 140 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ ఏడాది మలయాళంలో మోస్ట్ ప్రెస్టిజీయస్‌గా మూవీగా రిలీజైన పేట్రియాట్ డిజాస్టర్‌గా నిలిచింది. 80 కోట్ల లోపే వసూళ్లను దక్కించుకుంది.
తాజాగా ఈ మలయాళ మల్టీస్టారర్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. జూన్ 5 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించిన ప్లాట్‌ఫామ్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదలకానున్నట్లు ప్రకటించింది.
57వ మూవీ...
మమ్ముట్టి, మోహన్‌లాల్ కలయికలో వచ్చిన 57వ మల్టీస్టారర్ మూవీ ఇది. ఈ సినిమాకు మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించాడు. మమ్ముట్టి, మోహన్‌లాల్‌తో పాటు పలువురు సూపర్ స్టార్లు సినిమాలో ఉన్న వారి ఇమేజ్‌కు తగ్గట్లుగా పవర్‌ఫుల్ స్టోరీని డైరెక్టర్ రాసుకోలేకపోవడం, ట్విస్ట్‌లు అనుకున్న స్థాయిలో వర్కవుట్ కాకపోవడంతో పేట్రియాట్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సోషల్ మీడియా ద్వారా ప్రజల వ్యక్తిగత డేటాను చోరీ చేస్తూ కొందరు నేరాలకు పాల్పడుతున్నారనే అంశాలతో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందింది.
దేశద్రోహిగా ముద్ర...
డేనియన్ జేమ్స్ (మమ్ముట్టి) సైంటిస్ట్‌గా పనిచేస్తుంటాడు. దేశ రహస్యలను శత్రువులకు చేరవేస్తున్నాడని డేనియన్‌పై ఆరోపణలు వస్తాయి. దేశద్రోహి అనే నిందను భరించలేక విదేశాలకు వెళ్లిపోతాడు. శక్తి కార్పొరేషన్ పేరుతో మినిస్టర్ కొడుకు శక్తి సుందరం (ఫహాద్ ఫాజిల్) డేటా సెంటర్‌ను రన్ చేస్తుంటాడు. బిజినెస్ పేరుతో శక్తి చేస్తోన్న అక్రమాలను డేనియల్ ఎలా ఎదుర్కొన్నాడు? శక్తి దగ్గర పనిచేసిన జ్యోతి ఎలా చనిపోయింది. ఈ పోరాటంలో డేనియల్‌కు సాయం చేసిన కల్నల్ రహీమ్ నాయక్ (మోహన్ లాల్), లాయర్ లతిక (నయనతార) ఎవరు అన్నదే ఈ మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Pooja Hegde | మళ్లీ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా పూజా హెగ్డే.. ఇక కెరీర్ ట్రాక్‌లో పడినట్లేనా..?
మే 22, 2026

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026
తాజావార్తలు
- ●KTR | గల్ఫ్‌లో ఉన్నోళ్ల ఓట్లు పోనివ్వం.. ఎస్ఐఆర్పై సీఈసీని కలుస్తాం: కేటీఆర్
- ●Dialysis Patients | డయాలసిస్ పేషెంట్లకు అండగా ప్రభుత్వం.. 2,356 మందికి కొత్తగా పెన్షన్లు
- ●Nivetha Pethuraj | వెంకటేష్ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ - మరోసారి ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్?
- ●Thummala Nageshwar Rao | బ్యాంకులు దీర్ఘకాలిక పెట్టుబడి రుణాలు అందించాలి: మంత్రి తుమ్మల
- ●Stock Markets | బ్యాంకింగ్ షేర్ల జోరు.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- ●Twisha Sharma | ట్విషా శర్మ కేసులో ట్విస్ట్.. రెండోసారి పోస్టమార్టంకు హైకోర్టు అనుమతి

KTR | గల్ఫ్‌లో ఉన్నోళ్ల ఓట్లు పోనివ్వం.. ఎస్ఐఆర్పై సీఈసీని కలుస్తాం: కేటీఆర్

Dialysis Patients | డయాలసిస్ పేషెంట్లకు అండగా ప్రభుత్వం.. 2,356 మందికి కొత్తగా పెన్షన్లు

Nivetha Pethuraj | వెంకటేష్ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ - మరోసారి ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్?

Thummala Nageshwar Rao | బ్యాంకులు దీర్ఘకాలిక పెట్టుబడి రుణాలు అందించాలి: మంత్రి తుమ్మల



