త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kayadu Lohar | ఓటీటీలోకి క‌య‌దు లోహ‌ర్ మ‌ల‌యాళం ఫాంట‌సీ థ్రిల్ల‌ర్ మూవీ – క్రికెట‌ర్ ఆత్మ‌గా మారితే…

క‌య‌దు లోహ‌ర్ హీరోయిన్‌గా న‌టించిన మ‌ల‌యాళ మూవీ ఐ యాగ్ గేమ్ థియేట‌ర్ల‌లో డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఫాంట‌సీ యాక్ష‌న్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. న‌వంబ‌ర్ 6 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.

N

Entertainment | Published On Oct 31, 2026, 4.12 pm IST

Kayadu Lohar | ఓటీటీలోకి క‌య‌దు లోహ‌ర్ మ‌ల‌యాళం ఫాంట‌సీ థ్రిల్ల‌ర్ మూవీ – క్రికెట‌ర్ ఆత్మ‌గా మారితే…
Advertisement

Kayadu Lohar |  ప్ర‌స్తుతం ద‌క్షిణాదిలో ఏ భాష‌లో చూసిన క‌య‌దు లోహ‌ర్ (Kayadu Lohar)క‌నిపిస్తోంది. ఈ ఏడాది ప‌ది నెల‌ల గ్యాప్‌లోనే ఈ అస్సాం బ్యూటీ హీరోయిన్‌గా న‌టించిన ఆరు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. ఒక్క రోజు కూడా గ్యాప్ తీసుకోకుండా క‌ష్ట‌ప‌డుతోంది. క‌నీసం ప్ర‌మోష‌న్స్‌కు కూడా హాజ‌రుకాలేద‌నంత బిజీగా మారిపోయింది.

మలయాళం మూవీ...

క‌య‌దు లోహ‌ర్ హీరోయిన్‌గా న‌టించిన ది ప్యార‌డైజ్‌, ఇమ్మోర్ట‌ల్ గ‌త వారం ఓటీటీలోకి వ‌చ్చాయి. తాజాగా ఈ బ్యూటీ మ‌ల‌యాళ మూవీ ఐ యామ్ గేమ్ స్ట్రీమింగ్ డేట్ కూడా క‌న్ఫామ్ అయ్యింది. న‌వంబ‌ర్ 6న జియో హాట్‌స్టార్‌లో రిలీజ్ కాబోతుంది. మ‌ల‌యాళంతో పాటు తెలుగులో విడుద‌ల‌కానున్న‌ట్లు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్ర‌క‌టించింది.
ఫాంట‌సీ యాక్ష‌న్ మూవీగా తెర‌కెక్కిన ఐ యామ్ గేమ్ సినిమాలో దుల్క‌ర్ స‌ల్మాన్ (Dulquer Salmaan) హీరోగా న‌టించాడు. న‌హాస్ హిద‌య‌త్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో ఆంటోనీ వ‌ర్గీస్‌, సంయుక్త విశ్వ‌నాథ‌న్‌, మిస్కిన్‌, జ‌య‌సుధ కీల‌క పాత్ర‌లు పోషించారు. హీరోగా న‌టిస్తూనే ఈ సినిమాకు ప్రొడ్యూస‌ర్‌గా కూడా దుల్క‌ర్ స‌ల్మాన్ వ్య‌వ‌హ‌రించారు.

ఎనభై కోట్ల బడ్జెట్..

దాదాపు ఎన‌భై కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మ‌ల‌యాళం మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది. న‌ల‌భై కోట్ల లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. రొటీన్ రివేంజ్ ఫార్ములా కాన్సెప్ట్‌తో పాటు మూడు గంట‌ల‌కుపైగా ర‌న్‌టైమ్‌తో సాగ‌దీయడం ఈ సినిమాకు మైన‌స్‌గా మారింది. దుల్క‌ర్ స‌ల్మాన్ వ‌రుస స‌క్సెస్‌ల‌కు ఐ యామ్ గేమ్‌తో బ్రేక్ ప‌డింది.

క్రికెట్ బెట్టింగ్...

డాన్ జాన్ కోటీశ్వ‌రుడు. గ్యాబ్లింగ్‌, క్రికెట్ బెట్టింగ్‌ల‌కు పాల్ప‌డుతూ జ‌ల్సాలు చేస్తుంటాడు. ఓ సారీ త‌ల్లి మెర్సీ డ‌బ్బుల‌ను దొంగ‌త‌నం చేసి బెట్టింగ్‌లో పెడ‌తాడు. ఆ డ‌బ్బులు కోల్పోతాడు. ఆ కోపంలో గ్యాంబ్లింగ్ ముఠా స‌భ్యుల‌ను కొట్టి పారిపోతుండ‌గా డాన్ జాన్ కారుకు యాక్సిడెంట్ అవుతుంది. కుడిచేతిని కోల్పోతాడు. విక్కీ అనే క్రికెట‌ర్ చేతిని డాన్ జాన్‌కు అమ‌ర్చుతారు డాక్ట‌ర్లు. అప్ప‌టి నుంచి కుడిచేయి డాన్ మాట విన‌డం మానేస్తుంది. మాఫియా డాన్ డేవిడ్‌ను చంప‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది. విక్కీ చేయి అత‌డి మాట విన‌క‌పోవ‌డానికి కార‌ణ‌మేమిటి? విక్కీ ఎలా చ‌నిపోయాడు? డాన్ జాన్ ప్రేమించిన ఇషా ఎవ‌రు? అన్న‌దే ఐ యామ్ గేమ్ మిగిలిన క‌థ‌.

 

ట్యాగ్స్:

Dulquer SalmaanFantasy Action MovieI Am Game MovieI Am Game OTT Release DateKayadu LoharKayadu Lohar Malayalam MovieMalayalam Movie
Advertisement
Advertisement