త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalamkaval Review | క‌ల‌మ్‌కావ‌ల్ రివ్యూ – మ‌మ్ముట్టి సీరియల్ కిల్ల‌ర్‌గా న‌టించిన మూవీ ఎలా ఉందంటే?

మ‌మ్ముట్టి , వినాయ‌క‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మ‌ల‌యాళం మూవీ క‌ల‌మ్‌కావ‌ల్ సోనీ లివ్ ఓటీటీలో రిలీజైంది. ఈ మ‌ల‌యాళం క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

N

Entertainment | Published On Jan 16, 2026, 2.38 pm IST

Kalamkaval Review | క‌ల‌మ్‌కావ‌ల్ రివ్యూ – మ‌మ్ముట్టి సీరియల్ కిల్ల‌ర్‌గా న‌టించిన మూవీ ఎలా ఉందంటే?
Advertisement

Kalamkaval Review |  మ‌మ్ముట్టి విల‌న్‌గా న‌టించిన మ‌ల‌యాళం మూవీ క‌ల‌మ్‌కావ‌ల్ థియేట‌ర్ల‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వ‌చ్చింది. సోనీలివ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.జితిన్ కే జోస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో జైల‌ర్ ఫేమ్ వినాయ‌క‌న్ కీల‌క పాత్ర‌లో న‌టించాడు. ఈ మ‌ల‌యాళం క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

సీరియల్ కిల్లర్ కథ...

కేర‌ళ స‌రిహ‌ద్దుల్లోని ఓ పోలీస్ స్టేష‌న్‌లో పెళ్లి కావాల్సిన ఓ అమ్మాయి మిస్స‌వుతుంది. ఈ మిస్సింగ్‌ కేసు మ‌త గొడ‌వ‌ల‌కు దారి తీయ‌డంలో ఇన్వేస్టిగేష‌న్ చేసే బాధ్య‌త స్పెష‌ల్ ఆఫీస‌ర్ జ‌య‌కృష్ణ‌న్ (వినాయ‌క‌న్‌) చేప‌డ‌తాడు. ఆ మిస్సింగ్ ఇన్వేస్టిగేష‌న్‌లో కేర‌ళ‌, త‌మిళ‌నాడు స‌రిహ‌ద్దుల్లోని గ్రామాల్లో చాలా మంది మ‌హిళ‌లు అదృశ్య‌మ‌య్యార‌నే నిజం బ‌య‌ట‌ప‌డుతుంది. పెళ్లి వ‌య‌సు వ‌చ్చిన యువ‌తుల‌తో పాటు విడాకులు తీసుకున్న మ‌హిళ‌లే ఎక్కువ‌గా క‌నిపించ‌కుండా పోయార‌ని జ‌య‌కృష్ణ‌న్ క‌నిపెడ‌తాడు. వారంద‌రిని స్టాన్లీ దాస్ (మ‌మ్ముట్టి) దారుణంగా హ‌త‌మారుస్తుంటాడు. కానీ పోలీసులు మాత్రం అత‌డికి వ్య‌తిరేకంగా ఒక్క క్లూ కూడా సంపాదించ‌లేక‌పోతారు. స్టాన్లీ దాస్ ఎందుకు ఈ హ‌త్య‌లు చేస్తున్నాడు? జ‌య‌కృష్ణ‌న్‌కు స్టాన్లీ దాస్‌కు ఉన్న సంబంధం ఏమిటి? ఈ సీరియ‌ల్ కిల్ల‌ర్‌ను జ‌య‌కృష్ణ‌న్ ఎలా ప‌ట్టుకున్నాడు? అన్న‌దే క‌ల‌మ్‌కావ‌ల్ మూవీ క‌థ‌.

సైనెడ్ మోహ‌న్ కేసు...

సీరియ‌ల్‌ కిల్ల‌ర్ సైనెడ్ మోహ‌న్ కేసు 2000 ద‌శ‌కంలో దేశ‌వ్యాప్తంగా సంచ‌లనంగా మారింది. పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి ఇర‌వైకిపైగా పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల‌కు చెందిన మ‌హిళ‌ల‌ను దారుణంగా సైనెడ్ మోహ‌న్ హ‌త‌మార్చాడు. సైనెడ్ ఉప‌యోగించి అత‌డు ఈ హ‌త్య‌లు చేశాడు. ఈ సైనెడ్ మోహ‌న్ కేసు ఆధారంగా ద‌ర్శ‌కుడు జితిన్ కే జోస్ క‌ల‌మ్ కావ‌ల్ మూవీని రూపొందించారు.

రియ‌లిస్టిక్ అప్రోచ్‌...

సాధార‌ణంగా సీరియ‌ల్ కిల్ల‌ర్ సినిమాల్లో వ‌య‌లెన్స్‌, ర‌క్త‌పాతం, యాక్ష‌న్ స‌న్నివేశాలు ఎక్కువే ఉంటాయి. కానీ క‌లమ్‌కావ‌ల్ మాత్రం అందుకు భిన్నంగా రియ‌లిస్టిక్‌ ఇన్వేస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌గా సాగుతుంది. నిజంగా పోలీస్ ఎంక్వైరీ ఎలా ఉంటుందో అలాగే ఈ సినిమాలో చూపిస్తూ ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేశారు. ఇందులో ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా ఫైట్ సీక్వెన్స్ ఉండ‌దు. కిల్ల‌ర్ మ‌ర్డ‌ర్ చేసే సీన్ల‌ను చూపించ‌కుండా డైలాగ్స్ ద్వారానే వాటిని చెప్పించారు. క‌మ‌ర్షియ‌ల్ ప‌డిక‌ట్టు సూత్రాల‌కు భిన్నంగా కూడా క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీని ఇంట్రెస్టింగ్‌గా తెర‌కెక్కించ‌వ‌చ్చ‌ని ఈ సినిమాతో నిరూపించారు.

ఇంట‌ర్వెల్ ట్విస్ట్ అదుర్స్‌...

ఈ సినిమాను పార్ట్‌లుగా విడ‌గొట్టి...ఒక్కో భాగానికి ఒక్కో పేరు పెట్టి తెర‌కెక్కించ‌డం కొత్త‌గా ఉంది. స్టాన్లీ దాస్ వ‌రుస హ‌త్య‌లు చేయ‌డం ...మ‌రోవైపు హంత‌కుడి కోసం జ‌య‌కృష్ణ‌న్ ఎంక్వైరీతో ఈ సినిమా ముందుకు సాగుతుంది. ఎవ‌రికోస‌మైతే జ‌య‌కృష్ణ‌న్ వెతుకుతున్నాడో...అత‌డే స్వ‌యంగా ఈ ఇన్వేస్టిగేష‌న్ టీమ్‌లో భాగ‌మ‌య్యే సీన్‌తో ఇంట‌ర్వెల్ ముందు వ‌చ్చే ట్విస్ట్ అదిరిపోతుంది.
సెకండాఫ్‌లో ఆ కిల్ల‌ర్‌కు సంబంధించిన ఆధారాల‌ను జ‌య‌కృష్ణ‌న్ ఎలా సేక‌రించాడు? చివ‌ర‌కు అత‌డికి ఎలాంటి శిక్ష విధించాడు అనే అంశాల‌తో ఇంట్రెస్టింగ్‌గా న‌డిపించారు డైరెక్ట‌ర్‌క‌థ ఇంట్రెస్టింగ్‌గా క‌థ‌నం మాత్రం చాలా స్లోగా సాగుతుంది. ఒకే పాయింట్ చుట్టూ రెండున్న‌ర గంట‌లు తిప్ప‌డం కాస్తంత బోర్ ఫీలింగ్‌ను క‌లిగిస్తుంది.

ఛాలెంజింగ్ రోల్‌లో...

క‌ల‌మ్‌కావ‌ల్ మూవీలో సీరియ‌ల్ కిల్ల‌ర్ పాత్ర‌లో మ‌మ్ముట్టి అద‌ర‌గొట్టేశారు. ఓ స్టార్ హీరో అయ్యుండి ఇలాంటి నెగెటివ్ రోల్ చేయ‌డం అంటే ఒక ర‌కంగా ఛాలెంజ్‌. లుక్‌, బాడీలాంగ్వేజ్‌, సిగ‌రెట్ తాగే స్టైల్‌తోనే విల‌నిజాన్ని పండించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. జైల‌ర్ ఫేమ్ వినాయ‌క‌న్ ఈ సినిమాకు హీరో. పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో సెటిల్డ్ యాక్టింగ్‌తో మెప్పించాడు. వీరిద్ద‌రు త‌ప్ప ఈ సినిమాలో మిగిలిన క్యారెక్ట‌ర్ల‌కు పెద్ద‌గా ఇంపార్టెన్స్ లేదు.
క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీస్‌ను ఇష్ట‌ప‌డేవారిని క‌ల‌మ్‌కావ‌ల్ మెప్పిస్తుంది. మ‌మ్ముట్టి యాక్టింగ్ కోసం ఈ సినిమాను చూడొచ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement