త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malayalam OTT | ఒకే రోజు ఓటీటీలోకి మ‌మ్ముట్టి, మోహ‌న్‌లాల్ మ‌ల‌యాళ సినిమాలు – ఒక‌టి కామెడీ – మ‌రోటి సైకో కిల్ల‌ర్

మ‌మ్ముట్టి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మ‌ల‌యాళం మూవీ కాల‌మ్ కావ‌ల్ జ‌న‌వ‌రి 16న సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. అదే రోజు మోహ‌న్‌లాల్ భా భా బా మూవీ కూడా జీ5 ఓటీటీలో రిలీజ్ కాబోతుంది.

N

Entertainment | Published On Jan 11, 2026, 2.00 pm IST

Malayalam OTT | ఒకే రోజు ఓటీటీలోకి మ‌మ్ముట్టి, మోహ‌న్‌లాల్ మ‌ల‌యాళ సినిమాలు – ఒక‌టి కామెడీ – మ‌రోటి సైకో కిల్ల‌ర్
Advertisement

Malayalam OTT | మ‌మ్ముట్టి, మోహ‌న్‌లాల్ న‌టించిన మ‌ల‌యాళ సినిమాలు ఓకే రోజు ఓటీటీలోకి రాబోతున్నాయి. ఒక‌టి కామెడీ మూవీ కాగా...మ‌రో సినిమా సైకో కిల్ల‌ర్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కాయి. మ‌మ్ముట్టి కాల‌మ్‌కావ‌ల్ మూవీ సోనీలివ్ , మోహ‌న్‌లాల్ భా భా బా మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. రెండు జ‌న‌వ‌రి 16న విడుద‌ల‌కానున్నాయి.

సైకో కిల్ల‌ర్‌గా...

కాల‌మ్ కావ‌ల్ మూవీ క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్‌గా రూపొందింది. జితిన్ కే జోస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో మ‌మ్ముట్టి సైకో కిల్ల‌ర్‌గా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో క‌నిపించాడు. ఈ సినిమాలో జైల‌ర్ ఫేమ్ వినాయ‌గ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టించాడు.
సైనేడ్ మోహ‌న్ అనే సీరియ‌ల్ కిల్ల‌ర్ జీవితం ఆధారంగా ఈ మూవీ రూపొందించిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది.
కేర‌ళ - త‌మిళ‌నాడు స‌రిహ‌ద్దుల్లోని గ్రామాల్లో మ‌హిళ‌లు వ‌రుస‌గా హ‌త్య‌ల‌కు గురువుతుంటారు. వారిని ఓ సీరియ‌ల్ దారుణంగా హ‌త‌మార్చుతుంటాడు. ఈ కిల్ల‌ర్‌ను ప‌ట్టుకునే బాధ్య‌త‌ను పోలీస్ ఆఫీస‌ర్ జ‌య‌కృష్ణ‌న్ తీసుకుంటాడు. ఆ కిల్ల‌ర్ గురించి జ‌య‌కృష్ణ‌న్‌కు ఎలాంటి నిజాలు తెలిశాయి? అన్న‌దే ఈ మూవీ క‌థ‌. సైకో కిల్ల‌ర్‌గా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో మ‌మ్ముట్టి న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఈ సినిమాను మ‌మ్ముట్టి స్వ‌యంగా నిర్మించారు. సోనీ లివ్ ఓటీటీలో మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

భా భా బా...

దిలీప్ హీరోగా న‌టించిన మ‌ల‌యాళం యాక్ష‌న్ కామెడీ మూవీ భా భా బా లో మోహ‌న్‌లాల్ ఓ గెస్ట్ రోల్‌లో క‌నిపించాడు. డిసెంబ‌ర్ మూడో వారంలో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. టైటిల్‌తోనే ఈ మ‌ల‌యాళం మూవీ ఆడియెన్స్‌లో ఆస‌క్తిని క్రియేట్ చేసింది. కానీ కాన్సెప్ట్‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం, కామెడీ అంత‌గా వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా నిలిచింది.
మ‌ల‌యాళంలో ప‌లు సూప‌ర్ హిట్ సినిమాల‌కు స్ఫూఫ్‌గా భా భా బా మూవీని తెర‌కెక్కించారు డైరెక్ట‌ర్ ధ‌నంజ‌య్ శంక‌ర్‌.
కేర‌ళ సీఏం సీకే జోస‌ఫ్‌ను కామ‌న‌ర్ అనే రౌడీ కిడ్నాప్ చేస్తాడు. ఈ కిడ్నాప్ రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారుతుంది. కామ‌న‌ర్‌ను ప‌ట్టుకోవ‌డానికి నోబుల్ అనే పోలీస్ ఆఫీస‌ర్‌ను ప్ర‌త్యేకంగా నియ‌మిస్తుంది ప్ర‌భుత్వం. సీఏంను కామ‌న‌ర్ ఎందుకు కిడ్నాప్ చేశాడు? కామ‌న‌ర్ స‌హాయం చేసిన గిల్లి బాలు ఎవ‌రు? అన్న‌దే భా భా బా మూవీ క‌థ‌.

 

Advertisement

తాజావార్తలు

Advertisement