Malayalam OTT | గే క్యారెక్టర్‌లో మమ్ముట్టి – ఓటీటీలోకి వచ్చిన మలయాళ వివాదాస్పద సినిమా
మమ్ముట్టి హీరోగా నటించిన కాంట్రవర్సియల్ మూవీ కాథల్ ది కోర్ ఓటీటీలోకి వచ్చింది. జీ5 ఓటీటీలో మలయాళంతో పాటు తెలుగులోనూ రిలీజైంది. ఈ మలయాళం మూవీలో జ్యోతిక హీరోయిన్‌గా నటించింది.
Entertainment | Published On Apr 16, 2026, 1.56 pm IST
Malayalam OTT | మమ్ముట్టి హీరోగా నటించిన కథాల్ ది కోర్ కమర్షియల్‌గా సక్సెస్‌గా నిలవడమే కాకుండా అనేక అవార్డులను అందుకుంది. అదే స్థాయిలో ఈ సినిమాపై విమర్శలు కూడా వచ్చాయి. ఎల్‌జీబీటీ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను గల్ఫ్ కంట్రీస్‌తో పాటు మరికొన్ని దేశాలు బ్యాన్ చేశాయి. కాథల్ సినిమాలో మమ్ముట్టి సరసన జ్యోతిక హీరోయిన్‌గా నటించింది. జియో బేబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మమ్ముట్టి స్వయంగా నిర్మించారు.
తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది. ఈ విషయాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ అఫీషియల్‌గా ప్రకటించింది.
స్వలింగ సంపర్కుడిగా...
కాథల్ ది కోర్‌లో మమ్ముట్టి స్వలింగ సంపర్కుడిగా ఛాలెంజింగ్ క్యారెక్టర్‌లో కనిపించారు. స్టార్ హీరో అయ్యి ఉండి ఇలాంటి క్యారెక్టర్ చేయడంపై ప్రశంసలతో పాటు విమర్శలు వచ్చాయి. కేవలం ఐదు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 15 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. స్వలింగ సంపర్కులకు సమాజంతో పాటు కుటుంబం నుంచే ఎలాంటి అవహేళనలు ఎదురవుతాయనే మెసేజ్‌తో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు.
భర్త పై విడాకుల కేసు...
మాథ్యూ గే. ఓమనతో అతడికి పెళ్లవుతుంది. భర్త హోమో సెక్సువల్ అనే విషయంలో ఓమనకు తెలుస్తుంది. అయినా కూతురు కోసం ఆ నిజాన్ని భరిస్తూ వస్తోంది. మాథ్యూ ఊరి ఎన్నికల్లో పోటీ చేస్తాడు. అదే టైమ్‌లో ఓమన భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టులో కేసు వేస్తుంది. ఆ తర్వాత ఏమైంది. ఓమన గే అనే విషయం ఊరందరికి తెలిసిందా? మాథ్యూ ఎన్నికల్లో గెలిచాడా? మాథ్యూతో రంగాకు ఉన్న సంబంధమేమిటన్నదే ఈ సినిమా కథ. దాదాపు పదమూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత కాథల్ ది కోర్ మూవీతో జ్యోతిక మలయాళంలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఐదు కేరళ స్టేట్ అవార్డులను అందుకుంది. ఫిల్మ్‌ఫేర్‌తో పాటు అనేక పురస్కారాలను దక్కించుకుంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






