త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mammootty – Mohan Lal | మ‌మ్ముట్టి, మోహ‌న్‌లాల్ కాంబోలో 56వ మ‌ల్టీస్టార‌ర్‌ – పేట్రియాట్ రిలీజ్ డేట్ ఇదే

మ‌మ్ముట్టి, మోహ‌న్‌లాల్ కాంబినేష‌న్‌లో 56 మ‌ల్టీస్టార‌ర్ మూవీగా పేట్రియాట్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తెలుగు వెర్ష‌న్ ఫ‌స్ట్ లుక్‌ను సోమ‌వారం విజ‌య్ దేవ‌ర‌కొండ రిలీజ్ చేశారు. పేట్రియాట్ మూవీ ఏప్రిల్ 23న థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతుంది.

N

Entertainment | Published On Jan 26, 2026, 2.37 pm IST

Mammootty – Mohan Lal | మ‌మ్ముట్టి, మోహ‌న్‌లాల్ కాంబోలో  56వ మ‌ల్టీస్టార‌ర్‌ – పేట్రియాట్ రిలీజ్ డేట్ ఇదే
Advertisement

Mammootty - Mohan Lal | మ‌ల‌యాళ అగ్ర న‌టులు మ‌మ్ముట్టి, మోహ‌న్‌లాల్ కాంబినేష‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 55 మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు వ‌చ్చాయి. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో 56వ సినిమాగా పేట్రియాట్ రాబోతుంది. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ తెలుగులోనూ రిలీజ్ కాబోతుంది. తెలుగు వెర్ష‌న్ ఫ‌స్ట్ లుక్‌ను సోమ‌వారం విజ‌య్ దేవ‌ర‌కొండ రిలీజ్ చేశారు. పేట్రియాట్ మూవీకి మ‌హేష్ నారాయ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

18 ఏళ్ల త‌ర్వాత‌...

18 ఏళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత మ‌మ్ముట్టి, మోహ‌న్‌లాల్ క‌లిసి న‌టిస్తున్న ఈ మూవీపై భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. చివ‌ర‌గా వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో 2008లో ట్వంటీ సినిమా వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఒక‌రి సినిమాల్లో మ‌రొక‌రు గెస్ట్ క్యారెక్ట‌ర్స్‌లో క‌నిపించారు కానీ ఫుల్ లెంగ్త్ రోల్స్ చేయ‌లేదు. పేట్రియాట్‌తో ఈ స్టార్ హీరోల కాంబో మ‌ళ్లీ కుదిరింది. ఈ మ‌ల‌యాళ మూవీలో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఫ‌హాద్ ఫాజిల్‌, కుంచ‌కోబోబ‌న్, రేవ‌తి, ద‌ర్శ‌నా రాజేంద్ర‌న్‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఏప్రిల్‌లో రిలీజ్‌..

ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఏప్రిల్ 23న పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.
సంఘ విద్రోహ‌క శ‌క్తుల‌ను ఎదుర్కొనే క్ర‌మంలో కొంద‌రు ఆఫీస‌ర్ల‌కు ఎలాంటి అడ్డంకులు ఎదుర‌య్యాయి? త‌మ‌పై ప‌డిన అప‌వాదుల‌ను తొల‌గించుకునేందుకు వారు ఎలాంటి పోరాటం సాగించార‌నే అంశాల‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. దేశ‌భ‌క్తి యాంగిల్‌లో ఈ మూవీలో కొత్త కోణంలో చూపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

1981లో...

1981 ఐవీ శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన అహింస సినిమాలో మొద‌టిసారి క‌లిసి న‌టించారు మ‌మ్ముట్టి, మోహ‌న్‌లాల్‌. ప‌ద‌యోట్టం, నంబ‌ర్ 20 మ‌ద్రాస్‌, న‌ర‌సింహం, హ‌రికృష్ణ‌న్స్‌, ట్వంటీతో పాటు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ప‌లు మ‌ల‌యాళం సినిమాలు సూప‌ర్ హిట్‌గా నిలిచాయి. సుదీర్ఘ సినీ ప్ర‌యాణంలో మ‌మ్ముట్టి ఇప్ప‌టివ‌ర‌కు 425 సినిమాలు చేయ‌గా...మ‌మ్మ‌ట్టి 360 సినిమాలు చేశారు. ఆదివారం మమ్ముట్టికి కేంద్రం  పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. ఆయనకు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు అందజేస్తున్నారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement