త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Yellamma Movie | ఎల్ల‌మ్మ కు హీరోయిన్ దొరికేదెప్పుడో? – తెర‌పైకి మ‌ల‌యాళ బ్యూటీ పేరు!

మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీప్ర‌సాద్ హీరోగా న‌టిస్తోన్న ఎల్ల‌మ్మ మూవీ క‌ష్టాలు కొన‌సాగు...తూనే ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా వారానికో కొత్త పేరు తెర‌పైకి వ‌స్తోంది తాజాగా మ‌ల‌యాళ బ్యూటీని క‌థానాయిక‌గా తీసుకోవాల‌ని మేక‌ర్స్ భావిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

N

Entertainment | Published On May 28, 2026, 11.22 am IST

Yellamma Movie | ఎల్ల‌మ్మ కు హీరోయిన్ దొరికేదెప్పుడో? – తెర‌పైకి మ‌ల‌యాళ బ్యూటీ పేరు!
Advertisement

Yellamma Movie |  బ‌ల‌గం వేణు ఎల్ల‌మ్మ మూవీకి ఆరంభం నుంచి క‌ష్టాలు ఎదుర‌వుతూనే ఉన్నాయి. టాలీవుడ్‌లోని హీరోలంద‌రి చుట్టూ తిరిగిన ఈ క‌థ చివ‌ర‌కు దేవిశ్రీప్ర‌సాద్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాతోనే దేవిశ్రీప్ర‌సాద్ క‌థానాయ‌కుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. హీరో క‌న్ఫామ్ కావ‌డానికే రెండు, మూడేళ్లు ప‌ట్టింది. కానీ హీరోయిన్ లెక్క మాత్రం ఇంకా తేల‌లేదు. ఎల్ల‌మ్మ‌లో క‌థానాయిక‌గా కీర్తి సురేష్‌, మృణాల్ ఠాకూర్‌, భాగ్య‌శ్రీ బోర్సే...ఇలా వారానికో పేరు తెర‌పైకి వ‌స్తోంది.ఎవ‌రూ క‌న్ఫామ్ కాలేదు. రా అండ్ ర‌స్టిక్‌గా సాగే హీరోయిన్ పాత్ర కోసం మృణాల్ ఠాకూర్ ఓకే చెప్పిందంటూ జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. చివ‌ర‌కు మృణాల్ వార్త కూడా ఓ రూమ‌ర్‌గానే మిగిలిపోయింది.

మ‌ల‌యాళ బ్యూటీ...

తాజాగా మ‌రో కొత్త పేరు తెర‌పైకి వ‌చ్చింది. మ‌ల‌యాళ బ్యూటీ మ‌మితా బైజు ఎల్ల‌మ్మ‌లో హీరోయిన్‌గా న‌టించ‌నుందంటూ టాలీవుడ్ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల రిలీజైన ధ‌నుష్ క‌ర మూవీలో డీ గ్లామ‌ర్ రోల్‌లో మ‌మితా బైజు న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. గ్లామ‌ర్ పాత్ర‌లు మాత్ర‌మే కాకుండా ప‌ర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌కు కూడా మ‌మితా న్యాయం చేయ‌గ‌ల‌ద‌ని ఈ మూవీ నిరూపించింది. క‌ర మూవీ చూసిన ఎల్ల‌మ్మ మేక‌ర్స్ హీరోయిన్ పాత్ర కోసం మ‌మితా బైజును అప్రోచ్ అయ్యార‌ట‌. క‌నీసం ఈ మ‌ల‌యాళ బ్యూటీ అయినా హీరోయిన్‌గా క‌న్ఫామ్ అవుతుందా? లేదంటే ఇది కూడా గాసిప్‌గానే మిగిలిపోతుందా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

జ‌న‌నాయ‌గ‌న్‌లో...

ప్ర‌స్తుతం ప‌లు పాన్ ఇండియ‌న్ సినిమాల‌తో మ‌మితా బైజు బిజీగా ఉంది. ద‌ళ‌ప‌తి విజ‌య్ జ‌న‌నాయ‌గ‌న్‌లో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది. సూర్య హీరోగా న‌టిస్తోన్న విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్‌లో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇవే కాకుండా మ‌రో మూడు త‌మిళ, మ‌ల‌యాళ సినిమాల్లో హీరోయిన్‌గా క‌నిపించ‌బోతుంది.

 

Advertisement
Advertisement