Mamitha Baiju | హనుమాన్ సీక్వెల్‌లో మలయాళం హీరోయిన్ – మైథాలజీ మూవీతో టాలీవుడ్‌లో తొలి అడుగు
మలయాళ బ్యూటీ మమితా బైజు టాలీవుడ్‌లోకి తొలి అడుగు వేయబోతుంది. హనుమాన్ సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న జై హనుమాన్‌లో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రిషబ్ శెట్టి శెట్టిగా నటిస్తోన్న ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
Entertainment | Published On Oct 8, 2026, 6.22 pm IST
ప్రస్తుతం దక్షిణాదిలో మమితా బైజు జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది విశ్వనాథ్ అండ్ సన్స్, బెత్లెహం కుడుంబ యూనిట్ సినిమాలతో పెద్ద విజయాలను అందుకుంది. ఈ సినిమాల్లో అల్లరి అమ్మాయిగా హుషారైన నటనతో ఆకట్టుకుంది. దళపతి విజయ్ జననాయగన్‌లో ఓ కీలక పాత్రలో కనిపించింది. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టాయి. ఒకే ఏడాదిలో వరుసగా రెండు వందల కోట్లకుపైగా వసూళ్లను సాధించిన మూడు సినిమాల్లో నటించిన హీరోయిన్‌గా అరుదైన రికార్డును నెలకొల్పింది.
టాలీవుడ్‌లోకి ఎంట్రీ...
తాజాగా మమితా బైజు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. బ్లాక్‌బస్టర్ మైథాలజీ మూవీ సీక్వెల్‌లో ఈ మలయాళ బ్యూటీ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మమితా బైజుకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా నటించిన పలు తమిళ, మలయాళ సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ అయ్యాయి. అయితే ఇప్పటివరకు స్ట్రెయిట్ మూవీ మాత్రం చేయలేదు.
200 కోట్ల బడ్జెట్...
హనుమాన్ సీక్వెల్‌తో మమితా బైజు తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జై హనుమాన్ పేరుతో రూపొందుతోన్న ఈ సీక్వెల్‌లో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. రానా దగ్గుబాటి ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దాదాపు 200 కోట్లతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్నారు.
మైథాలజీ మూవీ...
ఈ మైథాలజీ మూవీలో ఓ కీలక పాత్ర కోసం మమితా బైజును దర్శకుడు ప్రశాంత్ వర్మ సంప్రదించినట్లు సమాచారం. హీరోతో సమానంగా కథలో ప్రాముఖ్యమున్న పాత్ర కావడంతో ఈ సీక్వెల్‌లో నటించడానికి మమితా బైజు అంగీకరించినట్లు సమాచారం. త్వరలోనే ఈ మలయాళ బ్యూటీ జై హనుమాన్ సెట్స్‌లో అడుగుపెట్టనున్నట్లు తెలిసింది.
కీరవాణి...
జై హనుమాన్‌లో హనుమంతుడిగా రిషబ్ శెట్టి కనిపించబోతుండగా...అశ్వత్థామ పాత్రను రానా దగ్గుబాటి పోషిస్తున్నారు. ఈ సీక్వెల్‌కు ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Song Lyrics | సద్ది గట్టి…సెలకల తొవ్వ బట్టి – తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ – ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో…
అక్టోబర్ 9, 2026

Sharwanand | అచ్చ తెలంగాణ మాండలికంతో భోగి పాట – కమ్మరోళ్ల గంగగా శర్వానంద్
అక్టోబర్ 9, 2026

Anupama Parameswaran | తెలంగాణ యాస నేర్చుకున్న అనుపమ – బొమ్మరిల్లు లాంటి సినిమా – క్రేజీ కళ్యాణంపై నిర్మాత కామెంట్స్
అక్టోబర్ 9, 2026
తాజావార్తలు
- ●Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!
- ●OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
- ●Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...
- ●K Kavitha | చిత్రపురి అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలి : కల్వకుంట్ల కవిత
- ●Jantar Mantar Protest | ఢిల్లీలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు.. కేంద్రంపై సీజేపీ విమర్శలు..
- ●Black Holes | బ్లాక్హోల్స్తోనూ గ్రహాల సృష్టి!

Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!

OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ

Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...

K Kavitha | చిత్రపురి అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలి : కల్వకుంట్ల కవిత



