Telugu OTT | ఓటీటీలోకి తెలుగు టీనేజ్ బోల్డ్ లవ్‌స్టోరీ – ఇంటర్‌లోనే ప్రేమలో పడితే!
టాలీవుడ్ టీనేజ్ లవ్‌స్టోరీ తెల్లకాగితం మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. హర్ష్ రోషన్, నక్షత్ర హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌తో పాటు ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమాకు రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహించారు.
Entertainment | Published On Oct 19, 2026, 4.07 pm IST
Telugu OTT | హర్ష్ రోషన్, నక్షత్ర హీరోహీరోయిన్లుగా నటించిన తెల్లకాగితం మూవీ యూత్ ఆడియెన్స్‌ను మెప్పించింది. టీనేజ్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకు రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహించారు. నందు కథ, స్క్రీన్‌ప్లే డైలాగ్స్ అందించారు. దాదాపు ఐదు కోట్ల బడ్జెట్‌తో చిన్న సినిమాగా రూపొందిన తెల్లకాగితం పది కోట్ల వరకు వసూళ్లను దక్కించుకుంది. నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది.
రెండు ఓటీటీలలో...
ఈ రొమాంటిక్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. అక్టోబర్ 30 నుంచి ఈటీవీ విన్ ఓటీటీతో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతోంది.
తప్పటడుగు...
2000 సంవత్సరం బ్యాక్‌డ్రాప్‌లో తెల్లకాగితం మూవీని రూపొందించారు డైరెక్టర్. తెలిసి తెలియని వయసులో యువత వేసే తప్పటడుగులు వారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే అంశాలను బోల్డ్‌గా ఈ సినిమాలో చూపించారు. కథ పాతదే అయినా యూత్ ఆడియెన్స్‌ను మెప్పించేలా డబుల్ మీనింగ్ డైలాగ్స్, రొమాంటిక్ సీన్స్, కామెడీ సీన్స్‌తో సినిమాను నడిపించారు. హర్ష్‌రోషన్, నక్షత్ర కెమిస్ట్రీ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమాతోనే హీరోయిన్‌గా నక్షత్ర టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇంటర్ లవ్‌స్టోరీ...
రాము ఇంటర్‌మీడియట్ చదువుతుంటాడు. క్లాస్‌మేట్ ఆశతో ప్రేమలో పడతాడు. రామును అపార్థం చేసుకున్న ఆశ తొలుత అతడిని దూరం పెడుతుంది. అపోహలు తొలగిపోవడంతో ఆశ కూడా రాముతో ప్రేమలో పడుతుంది. అనుకోకుండా చేసిన ఓ తప్పు ఇద్దరి జీవితాలను కష్టాల్లో పడేస్తుంది? అదేమిటి? పరువుకే ప్రాధాన్యమిచ్చే ఆశ తండ్రి కూతురి ప్రేమ గురించి తెలిసి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అన్నదే ఈ మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Riteish Deshmukh | తెలుగు సినిమాలో జెనీలియా భర్త – రామ్ కోసం విలన్‌గా మారిన బాలీవుడ్ హీరో
అక్టోబర్ 19, 2026

Rashmika Mandanna | తెలంగాణ కోడలిగా ఇది నా తొలి బతుకమ్మ – రష్మిక కామెంట్స్ – నెటిజన్ల ప్రశంసలు
అక్టోబర్ 19, 2026

Trisha Krishnan | డిసెంబర్లో రాజకీయాల్లోకి త్రిష.. జోష్యం చెప్పిన ఆస్ట్రాలజర్
అక్టోబర్ 18, 2026
తాజావార్తలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ..
- ●Ramachander Rao | నిజానికి రాహుల్ గాంధీనే అసలైన దొంగ
- ●Special Inspection Drive | నకిలీ నంబర్ ప్లేట్లను వాడితే ఊచలే.. ప్రత్యేక డ్రైవ్‌లో ఎన్ని కేసులు అయ్యాయంటే!
- ●Ponguleti Srinivas Reddy | 34 నెలల్లో 12.40 లక్షల పట్టాదారు పాస్ బుక్‌లు జారీ
- ●IMD | ఈ వారంలో దక్షిణాదిలో భారీ వర్షాలు : ఐఎండీ
- ●Lawrence Bishnoi Sahab | గ్యాంగ్‌స్టర్‌కు 'సాహెబ్' మర్యాదా? టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల వేళ పోలీసుల పాత వీడియోతో దుమారం

Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ..

Ramachander Rao | నిజానికి రాహుల్ గాంధీనే అసలైన దొంగ

Special Inspection Drive | నకిలీ నంబర్ ప్లేట్లను వాడితే ఊచలే.. ప్రత్యేక డ్రైవ్‌లో ఎన్ని కేసులు అయ్యాయంటే!

Ponguleti Srinivas Reddy | 34 నెలల్లో 12.40 లక్షల పట్టాదారు పాస్ బుక్‌లు జారీ



