త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malayalam Actor | మ‌ల‌యాళ సీనియ‌ర్ యాక్ట‌ర్ శ్రీనివాస‌న్ క‌న్నుమూత

Malayalam Actor | మ‌ల‌యాళ సీనియ‌ర్ యాక్ట‌ర్ శ్రీనివాస‌న్ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో క‌న్నుమూశారు. ఐదు ద‌శాబ్దాల సినీ ప్ర‌యాణంలో యాక్ట‌ర్‌గానే కాకుండా రైట‌ర్‌గా, డైరెక్ట‌ర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా ప్ర‌తిభ‌ను చాటుకున్నారు శ్రీనివాస‌న్‌.

N

Entertainment | Published On Dec 20, 2025, 10.47 am IST

Malayalam Actor | మ‌ల‌యాళ సీనియ‌ర్ యాక్ట‌ర్ శ్రీనివాస‌న్ క‌న్నుమూత

శ్రీనివాస‌న్‌

Advertisement

Malayalam Actor | మ‌ల‌యాళ వెట‌ర‌న్ యాక్ట‌ర్ శ్రీనివాస‌న్‌ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో శ‌నివారం క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న గుండె సంబంధిత  వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. మ‌ల‌యాళ (Malayalam)ఇండ‌స్ట్రీలో బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలిగా శ్రీనివాస‌న్ పేరు తెచ్చుకున్నారు. యాక్ట‌ర్‌గానే కాకుండా ర‌చ‌యిత‌గా, డైరెక్ట‌ర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా ప్ర‌తిభ‌ను చాటుకున్నారు. ప్రొడ్యూస‌ర్‌గా కొన్ని సినిమాలు చేశారు. 1976లో వ‌చ్చిన మ‌నిముజ‌క్కం సినిమాతో యాక్ట‌ర్‌గా శ్రీనివాస్ కెరీర్ ప్రారంభ‌మైంది. ఐదు ద‌శాబ్దాల సినీ ప్ర‌యాణంలో 225కుపైగా సినిమాల్లో డిఫ‌రెంట్ రోల్స్ చేశాడు. హీరోగా, క‌మెడియ‌న్‌, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌, విల‌న్‌గా కూడా న‌టించాడు. పోలీస్ పాత్ర‌ల‌తో మ‌ల‌యాళంలో ఫేమ‌స్ అయ్యారు శ్రీనివాస‌న్‌.
యాభైకిపైగా మ‌ల‌యాళ సినిమాల‌కు స్టోరీ, స్క్రీన్‌ప్లే రైట‌ర్‌గా ప‌నిచేశారు శ్రీనివాస‌న్‌. ప్రియ‌ద‌ర్శ‌న్‌, స‌త్య‌న్ అంతిక్కాడ్‌తో పాటు ప‌లువురు టాప్ మ‌ల‌యాళ డైరెక్ట‌ర్ల సినిమాల‌కు క‌థ‌లు అందించారు. వడక్కునొక్కియంత్రం, చింత‌విష్ట‌యైన శ్యామ‌ల అనే సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు శ్రీనివాస‌న్‌. ఈ రెండు సినిమాల్లో ఆయ‌నే హీరోగా న‌టించాడు. చింత‌విష్ట‌యైన శ్యామ‌ల సినిమా నేష‌న‌ల్ అవార్డును (National Award) ద‌క్కించుకుంది.
ప్రొడ్యూస‌ర్‌గా రెండు సినిమాల‌ను నిర్మించారు శ్రీనివాస‌న్‌. మ‌ల‌యాళంలో కొన్ని సినిమాల్లో మ‌మ్ముట్టికి డ‌బ్బింగ్ చెప్పారు. సుదీర్ఘ సినీ ప్ర‌యాణంలో ఓ నేష‌న‌ల్ అవార్డుతో పాటు ఆరు కేర‌ళ స్టేట్ అవార్డుల‌ను అందుకున్నారు శ్రీనివాస‌న్‌.
శ్రీనివాస‌న్‌కు భార్య విమ‌ల‌తో పాటు ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. తండ్రి శ్రీనివాస‌న్ బాట‌లోనే త‌న‌యులు వినీత్ శ్రీనివాస‌న్‌, ధ్యాన్ శ్రీనివాస‌న్ సినిమా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టారు. ప్ర‌స్తుతం మ‌ల‌యాళంలో హీరోలుగా కొన‌సాగుతున్నారు. శ్రీనివాస‌న్ మృతితో మ‌ల‌యాళ సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం అలుముకుంది. ఆయ‌న మృతికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement