త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heart Attack | విధుల్లో ఉన్న‌ కానిస్టేబుల్‌కు గుండెపోటు.. టిఫిన్ కోసం వెళ్తుండ‌గా ఘ‌ట‌న‌

Heart Attack | హైద‌రాబాద్ ఫిలింన‌గ‌ర్ ప‌రిధిలో విషాదం చోటుచేసుకుంది. ఓబులేశు అనే కానిస్టేబుల్ తన సెక్టార్ పరిధిలో ఆదివారం ఉద‌యం టిఫిన్ కోసం హోట‌ల్‌కు వెళ్తుండ‌గా గుండెపోటుకు గుర‌య్యారు.

S

Hyderabad | Published On Jun 14, 2026, 1.51 pm IST

Heart Attack | విధుల్లో ఉన్న‌ కానిస్టేబుల్‌కు గుండెపోటు.. టిఫిన్ కోసం వెళ్తుండ‌గా ఘ‌ట‌న‌
Advertisement

Heart Attack | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్ ఫిలింన‌గ‌ర్ ప‌రిధిలో విషాదం చోటుచేసుకుంది. డ్యూటీలో ఉండ‌గానే ఓ కానిస్టేబుల్‌కు గుండెపోటు వ‌చ్చిన ఘ‌ట‌న ఫిలింన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగింది. ఓబులేశు అనే కానిస్టేబుల్ తన సెక్టార్ పరిధిలో ఆదివారం ఉద‌యం టిఫిన్ కోసం హోట‌ల్‌కు వెళ్తుండ‌గా గుండెపోటుకు గుర‌య్యారు. స్థానికులు వెంట‌నే సీపీఆర్ చేసినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో హోట‌ల్ వ‌ద్దే ఆయ‌న ప్రాణాలు కోల్పోయారు.

సీపీఆర్ చేసినా..

ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓబులేశు కానిస్టేబుల్‌గా ప‌ని చేస్తున్నారు. ఆదివారం విధుల్లో ఉన్న ఆయ‌న టిఫిన్ కోసం ఓ హోట‌ల్‌కు వెళ్లాడు. లోప‌లికి వెళ్తుండ‌గానే మెట్లు ఎక్కే స‌మ‌యంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. ఇది గ‌మ‌నించిన స్థానికులు హుటాహుటినా వ‌చ్చి సీపీఆర్ (CPR) చేసినా ఫలితం ద‌క్క‌లేదు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గాంధీ ఆస్పత్రికి త‌ర‌లించారు. విధుల పట్ల అంకితభావంతో పనిచేసే ఓబులేశు మృతి పట్ల సహచర పోలీసులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement