త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malayalam OTT | ఓటీటీలోకి మ‌ల‌యాళం టైమ్ ట్రావెల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ – తెలుగులోనూ రిలీజ్‌

టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందిన మ‌ల‌యాళం థ్రిల్ల‌ర్ మూవీ సంభ‌వం అధ్యాయం ఒన్ను క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఏప్రిల్ 15 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మ‌ల‌యాళంలో పాటు తెలుగులోనూ రిలీజ్ కాబోతుంది.

N

Entertainment | Published On Apr 9, 2026, 3.43 pm IST

Malayalam OTT | ఓటీటీలోకి మ‌ల‌యాళం టైమ్ ట్రావెల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ – తెలుగులోనూ రిలీజ్‌
Advertisement

Malayalam OTT | ఈ ఏడాది మ‌ల‌యాళంలో చిన్న సినిమాగా రిలీజైన సంభ‌వం అధ్యాయం ఒన్ను విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో క‌మ‌ర్షియ‌ల్‌గా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మిస్ట‌రీ హార‌ర్ అంశాల‌కు టైమ్ ట్రావెల్ పాయింట్‌ను జోడించి ద‌ర్శ‌కుడు జీతూ స‌తీష‌న్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. అస్క‌ర్ అలీ, వినీత్ కుమార్‌, అస్సిమ్ జ‌మ‌ల్‌, సిద్ధార్థ్ భ‌ర‌త్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా మార్చి ఫ‌స్ట్ వీక్‌లో థియేట‌ర్ల‌లో రిలీజైంది. నిర్మాత‌ల‌కు రెట్టింపు లాభాల‌ను తెచ్చిపెట్టింది.

జియో హాట్‌స్టార్‌లో...

తాజాగా సంభ‌వం అధ్యాయం ఒన్ను ఓటీటీలోకి వ‌చ్చేసింది. ఈ మ‌ల‌యాళం మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ క‌న్ఫామ్ అయ్యాయి. ఏప్రిల్ 15 నుంచి జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ అవుతోంది.

హాలీవుడ్‌లో ఫేమ‌స్‌...

హాలీవుడ్‌లో ఫేమ‌స్ అయిన టైమ్‌లూప్ కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు సంభ‌వం అధ్యాయం ఒన్ను సినిమాను తెర‌కెక్కించారు. కాన్సెప్ట్‌, స్క్రీన్‌ప్లేతో పాటు ట్విస్ట్‌లు బాగున్నాయంటూ ఆడియెన్స్ నుంచి కామెంట్స్ వ‌చ్చాయి. ఐఎమ్‌డీబీలో ఈ సినిమాకు ప‌దికిగాను 7.2 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. మూడు కోట్ల బ‌డ్జెట్‌తో ప్ర‌యోగాత్మ‌కంగా రూపొందిన ఈ సినిమా 12 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది.

అడ‌విలో ఏం జ‌రిగింది....

కర్ణాట‌క - కేర‌ళ స‌రిహ‌ద్దుల్లో అట‌వీ ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేష‌న్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ అవుతాడు ఆనంద్‌. నైట్ డ్యూటీకి వెళ్లిన రెజీ, స్టీఫెన్ అనే పోలీసుల‌కు అడ‌విలో ఓ డెడ్‌బాడీ క‌నిపిస్తుంది. ఆ మృత‌దేహం ద‌గ్గ‌ర‌కు వెళ్లిన వాళ్లు ఓ ఆల‌యంలో చిక్కుకుపోతారు. వారిని కాపాడేందుకు అడ‌విలోకి వ‌చ్చిన ఆనంద్, అత‌డి టీమ్‌కు ఎలాంటి విచిత్ర‌మైన అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? ఓ ఫారిన్ మ‌హిళ త‌న భ‌ర్త‌తో ఓ పాటు ఓ యువ‌తిని ఎందుకు చంపింది? కాకి ఆకారంలో ఉన్న ఆల‌యం వెన‌కున్న మిస్ట‌రీ ఏమిట‌న్న‌దే ఈ మూవీ క‌థ‌.

 

Advertisement
Advertisement