త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telugu OTT | తెలుగులో ఓటీటీలో రిలీజైన రెండు మ‌ల‌యాళం సినిమాలు ఒక‌టి మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ – మ‌రోటి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌

మ‌ల‌యాళం సినిమాలు కాటాల‌న్‌, భ‌ర‌త‌నాట్యం తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. ఆహా ఓటీటీలో ఈ రెండు సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. కాటాల‌న్‌లో ఆంటోనీ వ‌ర్గీస్ సునీల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపించ‌గా..భ‌ర‌త‌నాట్యం సినిమాలో సైజు కురుప్ హీరోగా న‌టించాడు.

N

Entertainment | Published On Sep 12, 2026, 8.23 pm IST

Telugu OTT | తెలుగులో ఓటీటీలో రిలీజైన రెండు మ‌ల‌యాళం సినిమాలు ఒక‌టి మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ – మ‌రోటి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌
Advertisement

Telugu OTT |మ‌ల‌యాళం సినిమాలు కాటాలన్‌, భ‌ర‌త‌నాట్యం తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. ఒకే రోజు ఒకే ఓటీటీలో ఈ రెండు సినిమాలు రిలీజ‌య్యాయి. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్నాయి. కాటాల‌న్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థ‌తో రూపొంద‌గా... భ‌ర‌త‌నాట్యం మూవీ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీగా తెర‌కెక్కింది.

లోకేష్ క‌న‌గ‌రాజ్‌...

కాటాల‌న్ సినిమాలో ఆంటోనీ వ‌ర్గీస్‌, సునీల్ దుషారా విజ‌య‌న్ ప్ర‌ధాన‌ పాత్ర‌ల్లో న‌టించారు. కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ గెస్ట్ రోల్‌లో క‌నిపించాడు. కాటాల‌న్ సినిమాకు పాల్ జార్జ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అల్లు అర్జున్ పుష్ప స్ఫూర్తితో తెర‌కెక్కిన ఈ యాక్ష‌న్ మూవీ మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది.

ఏనుగు దంతాల వ్యాపారం...

కేర‌ళ అడ‌వుల్లో ఏనుగు దంతాల అక్ర‌మ వ్యాపారం చేస్తుంటాడు మారి. అత‌డి వ్యాపారంపై క‌న్నేసిన ఎడ్డీ ....మారి వ‌ద్ద‌ ఉన్న ఇర‌వై ఐదు కోట్ల ఏనుగు దంతాల‌ను కొట్టేస్తాడు. త‌న స‌రుకును ఎడ్డీ నుంచి తిరిగి సొంతం చేసుకోవ‌డానికి ఆంటోనీని రంగంలోకి దించుతాడు మారి. అస‌లు ఆంటోనీ ఎవ‌రు? ఎడ్డీ నుంచి పాతిక కోట్ల ఏనుగు దంతాల‌ను అత‌డు ఎలా కొట్టేశాడు? మారి కింద ప‌నిచేసే ఆంటోనీ అత‌డికే ఎందుకు ఎదురుతిరిగాడు? అనే అంశాల‌తో ఈ మూవీ రూపొందింది.

భ‌ర‌త‌నాట్యం...

సైజు కురుప్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మ‌ల‌యాళం మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ భ‌ర‌త‌నాట్యం క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు కృష్ణ‌దాస్ ముర‌ళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. భ‌ర‌త‌న్ నాయ‌ర్ ఊరికి పెద్ద‌దిక్కుగా ఉంటాడు. ప‌రువు, మ‌ర్యాద‌ల‌కు ప్రాణ‌మిచ్చే కుటుంబం వారిది. భ‌ర‌త‌న్ చ‌నిపోతూ త‌న రెండో పెళ్లికి సంబంధించిన ర‌హ‌స్యాన్ని కొడుకు శ‌శికి చెబుతాడు. ఆ సీక్రెట్‌ను దాచ‌డం కోసం శ‌శి ఫ్యామిలీ ఎలాంటి క‌ష్టాలు ప‌డింది? అనుకోకుండా ఓ హ‌త్యానేరంలో చిక్కుకున్న వారి కుటుంబం ఆ స‌మ‌స్య నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డార‌న్న‌దే ఈ మూవీ క‌థ‌.

 

Advertisement
Advertisement