Mammootty | విలన్ పాత్రలతో బెస్ట్ యాక్టర్‌గా రెండు సార్లు నేషనల్ అవార్డ్ – మెగాస్టార్ రేర్ రికార్డ్
శనివారం ప్రకటించిన నేషనల్ అవార్డుల్లో బెస్ట్ యాక్టర్‌గా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ సంయుక్తంగా ఎంపికయ్యారు. భ్రమయుగం సినిమాకుగాను మమ్ముట్టికి జాతీయ పురస్కారం దక్కింది. ఈ సినిమాలో మమ్ముట్టి హీరోగా కాకుండా విలన్‌గా నటించారు. విలన్ పాత్రతో మమ్ముట్టి నేషనల్ అవార్డ్ అందుకోవడం ఇది రెండో సారి.
Entertainment | Published On Jul 19, 2026, 1.07 pm IST
Mammootty |2024 ఏడాదికిగాను 72వ నేషనల్ అవార్డులను శనివారం ప్రకటించారు. ఇందులో బెస్ట్ యాక్టర్‌గా బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్‌తో కలిసి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి జాతీయ పురస్కారాన్ని దక్కించుకున్నారు. భ్రమయుగం సినిమాకుగాను మమ్ముట్టికి ఈ అవార్డు దక్కింది. ఈ సినిమాలో మమ్ముట్టి హీరోగా కాకుండా విలన్‌గా నటించడం గమనార్హం. తాంత్రిక విద్యలు తెలిసిన కుడుమోన్ పొట్టి అనే పాత్రలో మలయాళ మెగాస్టార్ అసమాన నటనను ప్రదర్శించారు. విలన్ రోల్స్ అనగానే రక్తపాతం, హింస, పంచ్ డైలాగ్స్ లాంటివి గుర్తొస్తాయి. ఈ మూస ఫార్ములాకు భిన్నంగా ఎక్స్‌ప్రెషన్లు, మ్యానరిజమ్స్, క్రూరమైన నవ్వుతోనే ఆడియెన్స్‌ను ఈ సినిమాతో భయపెట్టాడు. తనకున్న ఇమేజ్‌ను పక్కనపెట్టి డీ గ్లామర్ రోల్‌లో కనిపించారు. అహం, ఆధిపత్య ధోరణి కలిగిన దుష్ట శక్తి పాత్రలో మమ్ముట్టి నటనకు దక్షిణాది ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
కథ ఇదే....
తక్కువ కులానికి చెందిన ఓ జానపద కళాకారుడు దారితప్పి అడవి మధ్యలో ఉన్న ఓ ఇంటిలోకి వస్తాడు. ఆ ఇంటిలో కుడుమోన్ పొట్టి అనే యజమానితో పాటు ఓ వంటవాడు మాత్రమే ఉంటారు. తనను ఆ పాడుబడ్డ ఇంటిలో కుడుమోన్ పొట్టి ట్రాప్ చేశాడని తెలుసుకున్న జానపద కళాకారుడు పారిపోవాలని ప్రయత్నించి విఫలమవుతాడు. చివరకు కుడుమోన్ పొట్టి గురించి అతడికి ఏం తేలిసింది? తన ఇంట్లో అడుగుపెట్టిన వారిని అతడు ఎందుకు చంపుతున్నాడనే అంశాలతో ఈ మూవీ రూపొందింది.
విధేయన్....
మమ్ముట్టికి మొత్తంగా బెస్ట్ యాక్టర్‌గా ఇది నాలుగో నేషనల్ అవార్డ్ కాగా...విలన్ పాత్ర ద్వారా జాతీయ అవార్డును అందుకోవడం ఇది సెకండ్ టైమ్. భ్రమయుగం కంటే ముందు 1994లో విధేయన్ సినిమాకుగాను బెస్ట్ యాక్టర్‌గా మమ్ముట్టికి జాతీయ అవార్డు దక్కింది. ఆదూర్ గోపాలకృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మమ్ముట్టి విలన్‌గా కనిపించారు. తక్కువ కులాల వారిపై ఆధిపత్యం చెలాయించే అధికార గర్వం, అహకారం కలిగిన భూస్వామి పాత్రలో నెగెటివ్ రోల్‌లో అద్భుత నటనను కనబరిచారు. ఈ సినిమాలో మమ్ముట్టి పాత్ర ఆద్యంతం సీరియస్‌గా సాగుతుంది.
కుల వివక్ష
భ్రమయుగంతో పాటు విధేయన్ రెండు సినిమాల్లో మమ్ముట్టి పాత్ర చనిపోవడంతోనే సినిమా ఎండ్ కావడం గమనార్హం. కుల వివక్ష, బానిసత్వం అనే అంశాలతోనే ఈ రెండు సినిమాలు రూపొందాయి. రెండు సార్లు విలన్ పాత్రలతో బెస్ట్ యాక్టర్‌గా అవార్డ్ అందుకున్న ఒకే ఒక నటుడిగా మమ్ముట్టి రికార్డ్ క్రియేట్ చేశాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sreeleela | శ్రీలీల, సాయిపల్లవి తమిళ మూవీ థియేటర్లలోకి వచ్చేది అప్పుడే – రజనీకాంత్‌కు పోటీగా!
జులై 26, 2026

National Awards | నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ వీళ్లే – బెస్ట్ యాక్టర్‌గా మమ్ముట్టి – ఉత్తమ నటిగా యామీ గౌతమ్
జులై 18, 2026

National Awards | నేషనల్ అవార్డుల్లో సత్తా చాటిన పుష్ప 2, కల్కి – టాలీవుడ్‌కే అత్యధిక పురస్కారాలు
జులై 18, 2026
తాజావార్తలు
- ●RS Praveen Kumar | రంగానాథ్‌ను అరెస్టు చేయాల్సింది.. హైకోర్టు తీర్పు రేవంత్‌కు చెంపదెబ్బలాంటిది
- ●Anti Paper Leak Bill | యాంటీ పేపర్ లీక్ బిల్లుపై రేపు లోక్‌సభలో చర్చ.. అనంతరం ఓటింగ్
- ●Delhi Riots | తాహీర్‌కు ఉరేసరి.. ఐబీ అధికారి అంకిత్ శర్మ కేసులో కోర్టును కోరిన పోలీసులు
- ●Pooja Hegde | ఐటెంసాంగ్‌లో బుట్టబొమ్మ - నాచురల్ స్టార్‌తో మాస్ స్టెప్పులు
- ●KCR | మీరేం జేస్తరో చేయండి.. మా పెద్దిని కాపాడండి..
- ●Supreme Court | రామ మందిర విరాళాల కేసు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని సిట్‌కు సుప్రీంకోర్టు ఆదేశం..

RS Praveen Kumar | రంగానాథ్‌ను అరెస్టు చేయాల్సింది.. హైకోర్టు తీర్పు రేవంత్‌కు చెంపదెబ్బలాంటిది

Anti Paper Leak Bill | యాంటీ పేపర్ లీక్ బిల్లుపై రేపు లోక్‌సభలో చర్చ.. అనంతరం ఓటింగ్

Delhi Riots | తాహీర్‌కు ఉరేసరి.. ఐబీ అధికారి అంకిత్ శర్మ కేసులో కోర్టును కోరిన పోలీసులు

Pooja Hegde | ఐటెంసాంగ్‌లో బుట్టబొమ్మ - నాచురల్ స్టార్‌తో మాస్ స్టెప్పులు



