త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aishwarya Lekshmi | పెళ్లి వ‌ద్దు.. స‌హ‌జీవ‌న‌మే ముద్దు.. మ‌ల‌యాళ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్‌

పెళ్లి కంటే లివింగ్ రిలేష‌న్ బెట‌ర్ అంటూ మ‌ల‌యాళ బ్యూటీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మి అన్న‌ది. ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య మంచి అండ‌ర్‌స్టాండింగ్ ఉంటే పెళ్లి చేసుకోకుండా క‌లిసి ఆనందంగా బ‌త‌కొచ్చ‌ని చెప్పింది. సంబ‌రాలు ఏటిగ‌ట్టు హీరోయిన్ చేసిన ఈ కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

N

Entertainment | Published On Mar 21, 2026, 12.24 pm IST

Aishwarya Lekshmi | పెళ్లి వ‌ద్దు.. స‌హ‌జీవ‌న‌మే ముద్దు.. మ‌ల‌యాళ హీరోయిన్  బోల్డ్ కామెంట్స్‌
Advertisement

Aishwarya Lekshmi | మ‌ల‌యాళ సినిమాల‌తో కెరీర్‌ను ప్రారంభించి ఆ త‌ర్వాత తెలుగు, త‌మిళ భాష‌ల్లోకి ఎంట‌రైంది ఐశ్వ‌ర్య ల‌క్ష్మి. మ‌మ్ముట్టి, దుల్క‌ర్ స‌ల్మాన్ ధ‌నుష్ వంటి స్టార్ హీరోల‌తో సినిమాలు చేసింది. స‌త్య‌దేవ్ గాడ్సే మూవీతో హీరోయిన్‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది ఈ మ‌ల‌యాళ బ్యూటీ. కెరీర్ ఆరంభం నుంచి గ్లామ‌ర్ రోల్స్‌కు దూరంగా ఉంటోంది. యాక్టింగ్‌కు ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర‌లు మాత్ర‌మే చేస్తోంది. హీరోయిన్‌గా క‌నిపించాల‌నే రూల్ పెట్టుకోకుండా త‌న పాత్ర‌కు ప్రాధాన్య‌ముంద‌ని అనిపిస్తే చిన్న చిన్న రోల్స్‌లో కూడా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం మెగా సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోగా న‌టిస్తోన్న సంబ‌రాల ఏటిగ‌ట్టులో క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

స‌హ‌జీవ‌న‌మే ...

తాజాగా పెళ్లి, ప్రేమ‌పై ఐశ్వ‌ర్య ల‌క్ష్మి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. పెళ్లి కంటే స‌హ‌జీవ‌న‌మే మంచిదంటూ చెప్పింది. "పెళ్లిపై ఒక‌ప్పుడు త‌న‌కు మంచి అభిప్రాయ‌మే ఉండ‌దేని, కానీ కాలం గ‌డిచే కొద్ది ఆ ఆలోచ‌న మారిపోయింద‌ని అన్న‌ది. పెళ్లి త‌ర్వాత‌ సంతోషంగా ఉన్న జంటలను నేను చాలా తక్కువ మందిని చూశాను. వివాహం కార‌ణంగా జీవిత భాగ‌స్వాములు తమ కెరీర్‌లో ఇబ్బందులు పడటం , త‌మ‌కు ఇష్ట‌మైన చాలా విష‌యంలో రాజీప‌డ‌టం నేను గ‌మ‌నించా. ఇవ‌న్నీ పెళ్లి విష‌యంలో నా దృక్ప‌థాన్ని మార్చేశాయి. పరిపూర్ణమైన జీవితాన్ని గడపడానికి వివాహం అన్న‌ది తప్పనిసరి కాదు. పెళ్లి చేసుకోకుండా కూడా సంతోషంగా ఉండ‌గ‌లం" అని అన్న‌ది.

బెట‌ర్ ఛాయిస్‌...

పెళ్లి చేసుకున్న‌వాళ్లే క‌లిసి జీవించాల‌నేం లేద‌ని ఐశ్వ‌ర్య ల‌క్ష్మి చెప్పింది. "ఇద్దరు వ్యక్తుల మధ్య ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న‌, అనుబంధం ఉంటే పెళ్లి చేసుకోకుండానే త‌మ‌ బంధాన్ని కొనసాగిస్తూ క‌లిసి ఆనందంగా బ‌త‌కొచ్చ‌ని అన్న‌ది. అందుకే పెళ్లి కంటే త‌న దృష్టిలో లివింగ్ రిలేష‌న్ బెట‌ర్ ఛాయిస్‌గా భావిస్తున్నా" అని ఐశ్వ‌ర్య ల‌క్ష్మి అన్న‌ది. ఆమె వ్యాఖ్య‌లు కోలీవుడ్ నాట ఆస‌క్తిక‌రంగా మారాయి.

ప్ర‌స్తుతం సంబ‌రాల ఏటిగ‌ట్టుతో పాటు త‌మిళంలో గ‌ట్ట కుస్తీ 2 సినిమాలో హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది ఐశ్వ‌ర్య ల‌క్ష్మి. మ‌ల‌యాళంలో ఆశ పేరుతో ఓ థ్రిల్ల‌ర్ మూవీ చేస్తోంది.

 

Advertisement

తాజావార్తలు

Advertisement