Janhvi Kapoor | కేరళ కల్చర్‌ను అవమానించారు – జాన్వీకపూర్ సినిమాపై నేషనల్ అవార్డ్ విన్నర్ ఫైర్
జాన్వీకపూర్ బాలీవుడ్ మూవీ పరమ్‌సుందరిపై నేషనల్ అవార్డ్ విన్నింగ్ మలయాళ హీరో కాళిదాస్ జయరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ సంస్కృతిని అవమానించేలా ఈ సినిమా ఉందంటూ కామెంట్స్ చేశాడు.
Entertainment | Published On Feb 26, 2026, 8.50 am IST
Janhvi Kapoor | జాన్వీకపూర్ బాలీవుడ్ సినిమాపై నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరో ఫైర్ అయ్యారు. తమ సంస్కృతిని అవమానించేలా ఈ సినిమా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీకపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన మలయాళం మూవీ పరమ్‌సుందరి గత ఏడాది థియేటర్లలో రిలీజై హిట్టు టాక్‌ను తెచ్చుకుంది. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ సినిమాకు తుషార్ జలోటా దర్శకత్వం వహించాడు. అరవై కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా వంద కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. ఢిల్లీ అబ్బాయి, కేరళ అమ్మాయి ప్రేమకథతో ఈ మూవీ రూపొందింది.
జాన్వీకపూర్ మలయాళ భాష...
రిలీజ్ టైమ్‌లో పరమ్ సుందరిపై దారుణంగా విమర్శలొచ్చాయి. చర్చ్‌లో షూట్ చేసిన రొమాంటిక్ సీన్లతో పాటు కేరళ ఆచారాలు, ప్రజల జీవన శైలిపై వచ్చిన కామెడీ సీన్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. జాన్వీకపూర్ మలయాళ డైలాగ్స్, యాసపై ట్రోల్స్ వచ్చాయి. తాజాగా పరమ్ సుందరిపై మలయాళ హీరో, నేషనల్ అవార్డ్ విన్నర్ కాళిదాస్ జయరామ్ ఫైర్ అయ్యారు.
వెటకారంగా...
పరమ్ సుందరి అర్థపర్థం లేని ఓ చెత్త సినిమా అని కాళిదాస్ జయరామ్ అన్నారు. షకేరళ సంస్కృతిని, ఇక్కడి సంప్రదాయాలను వెటకారంగా చూపించారు. కేరళ ఆచారాలను అవమానించడమే ధ్యేయంగా పెట్టుకొని ఈ సినిమా తీసినట్లుగా అనిపించిందిష అంటూ ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాళిదాస్ పేర్కొన్నాడు. అతడి కామెంట్లు వైరల్ అయ్యాయి. నెటిజన్లు కూడా కాళిదాస్ జయరామ్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. జాన్వీకపూర్‌తో పాటు సిద్ధార్థ్ మల్హోత్రాలను ట్రోల్ చేస్తున్నారు. వారి సినిమాలను మలయాళంలో రిలీజ్ చేయద్దంటూ డిమాండ్ చేస్తున్నారు.
పెద్దితో....
కాగా ప్రస్తుతం జాన్వీకపూర్ రామ్‌చరణ్‌తో పెద్ది సినిమా చేస్తోంది. స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మార్చి 27న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ డిలేతో పాటు ఇతర కారణాల వల్ల ఏప్రిల్ 30కి వాయిదాపడింది. పెద్దితో పాటు తెలుగులో ఎన్టీఆర్ దేవర 2లో జాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



