Malayalam OTT | ఓటీటీలోకి కాంట్రవర్సియల్ మలయాళం మూవీ – సినిమా ఇండస్ట్రీలోని రాజకీయాలే కథగా..
మలయాళం కాంట్రవర్సియల్ మూవీ మాలీవుడ్ టైమ్స్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. జూలై 3 నుంచి జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. ప్రేమలు ఫేమ్ నస్లీన్ హీరోగా నటించిన ఈ డార్క్ కామెడీ మూవీలో బాసిల్ జోసెఫ్ గెస్ట్ రోల్‌లో కనిపించారు.
Entertainment | Published On Jun 26, 2026, 6.23 pm IST
Malayalam OTT | ప్రేమలు ఫేమ్ నస్లీన్ హీరోగా నటించిన మలయాళం మూవీ మాలీవుడ్ టైమ్స్‌ను రిలీజ్‌కు ముందు అనేక వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమా దర్శకనిర్మాతలపై సెన్సార్ బోర్డ్ కేసు పెట్టింది. వివాదాలు, కోర్టు కేసులతో వార్తల్లో నిలిచిన ఈ మలయాళం మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. మాలీవుడ్ టైమ్స్ మూవీ జూలై 3 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. మలయాళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతోంది.
బాసిల్ జోసెఫ్....
డార్క్ కామెడీ కథతో తెరకెక్కిన ఈ మలయాళం సినిమాకు అభినవ్ సుందర్ నాయక్ దర్శకత్వం వహించాడు. నస్లీన్‌తో పాటు వినీత్ శ్రీనివాసన్, షరాఫ్ ఉద్దీన్ కీలక పాత్రల్లో కనిపించారు. మలయాళ అగ్ర హీరో బాసిల్ జోసెఫ్ గెస్ట్ రోల్ చేశారు. దాదాపు ఎనిమిది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన మాలీవుడ్ టైమ్స్ థియేటర్లలో 18 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. నిర్మాతలకు పది కోట్ల వరకు లాభాలు తెచ్చిపెట్టింది.
సెన్సార్ బోర్డ్ కేసు...
మాలీవుడ్ టైమ్స్ దర్శకనిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లపై సెన్సార్ బోర్డ్ కేసు పెట్టడం మలయాళంలో చర్చనీయాంశంగా మారింది. సెన్సార్ సమయంలో బోర్డు సభ్యులు సినిమాలోని కొన్ని సీన్లు, డైలాగ్స్ కట్ చేయాల్సిందిగా సూచించారు. కానీ మేకర్స్ మాత్రం సీబీఎఫ్‌సీ కట్స్ చెప్పిన సీన్లు, డైలాగ్స్‌తోనే ఈ సినిమాను థియేటర్లలో ప్రదర్శించడం వివాదానికి దారితీసింది. సీబీఎఫ్‌సీ కోర్టును ఆశ్రయించింది.
హారర్ మూవీ....
వినీత్ మాధవన్ సినిమాలంటే పిచ్చి. దర్శకుడు కావాలని, ఓ హారర్ సినిమా చేయాలని కలలు కంటుంటాడు. ఓ కథను రాసుకొని సినిమా చేయాలని అనుకుంటాడు. ఇండస్ట్రీలోని రాజకీయాలు, నెపోటిజం వల్ల వినీత్‌కు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి. వినీత్ కథను కాపీ కొట్టి సినిమా తీసిన అర్జున్ హరిదాస్ ఎవరు? సినిమా తీయాలనే వినీత్ కల నెరవేరిందా? లేదా? అన్నదే మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

OTT | డేటింగ్ కాన్సెప్ట్‌తో రియాలిటీ షో – బిగ్‌బాస్‌కు పోటీగా స్ట్రీమింగ్ – హోస్ట్‌గా సీనియర్ హీరోయిన్
జూన్ 18, 2026

Kajal Aggarwal | లేడీ డాన్‌గా కాజల్ – సైలెంట్‌గా తెలుగు వెబ్‌సిరీస్‌కు ప్యాకప్
జూన్ 13, 2026

Bigg Boss 10 Telugu | ఆటలో సవాల్ కాదు … ఆటే సవాల్ …బిగ్‌బాస్ సీజన్ 10 వచ్చేస్తోంది ..లాంఛింగ్ ఎప్పుడంటే?
జూన్ 7, 2026
తాజావార్తలు
- ●Rashmika Mandanna | కాక్టెయిల్ 2 వర్సెస్ మా ఇంటి బంగారం - సమంత సినిమాకు లాభాలు - రష్మిక సినిమాకు నష్టాలు
- ●IND vs IRE | వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ఉత్కంఠ.. గంభీర్ వ్యూహంపైనే అందరి దృష్టి..! సీతాన్షు కొటక్ ఏమన్నారంటే..?
- ●Kharif season | 423 మండలాల్లో వర్షాలే లేవ్
- ●Monsoon | రుతుపవనాల జాడేది?
- ●NSE | స్టాక్ ధర కాదు.. వ్యాపారమే ముఖ్యం.. ఎన్ఎస్ఈ సీఈఓ కీలక సూచనలు..
- ●Shruthi Haasan | తండ్రి సినిమాలో యాక్టర్‌గా ఛాన్స్ - రిజెక్ట్ చేసిన శృతి హాసన్

Rashmika Mandanna | కాక్టెయిల్ 2 వర్సెస్ మా ఇంటి బంగారం - సమంత సినిమాకు లాభాలు - రష్మిక సినిమాకు నష్టాలు

IND vs IRE | వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ఉత్కంఠ.. గంభీర్ వ్యూహంపైనే అందరి దృష్టి..! సీతాన్షు కొటక్ ఏమన్నారంటే..?

Kharif season | 423 మండలాల్లో వర్షాలే లేవ్

Monsoon | రుతుపవనాల జాడేది?



