త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malayalam OTT | తెలుగులో రిలీజైన మ‌ల‌యాళం క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ – పోలీస్‌పై కామ‌న్ మ్యాన్ రివేంజ్‌

దృశ్యం డైరెక్ట‌ర్ జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మ‌ల‌యాళం క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ వ‌ల‌తు వ‌శ‌త్తే క‌ల్ల‌న్ తెలుగులోకి వ‌చ్చింది. ల‌య‌న్స్ గేట్ ప్లే ఓటీటీలో తెలుగు వెర్ష‌న్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో జోజు జార్జ్‌, బిజు మీన‌న్ హీరోలుగా న‌టించారు.

N

Entertainment | Published On Apr 18, 2026, 7.32 pm IST

Malayalam OTT | తెలుగులో రిలీజైన మ‌ల‌యాళం క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ – పోలీస్‌పై కామ‌న్ మ్యాన్ రివేంజ్‌
Advertisement

Malayalam OTT |  దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మ‌ల‌యాళం మూవీ వ‌ల‌తు వ‌శ‌త్తే క‌ల్ల‌న్ తెలుగులోకి వ‌చ్చింది. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో జోజు జార్జ్‌, బిజు మీన‌న్ హీరోలుగా న‌టించారు. ఇటీవ‌లే అమెజాన్ ప్రైమ్‌తో పాటు మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీల‌లో ఈ సినిమా రిలీజైంది. తాజాగా మ‌రో ఓటీటీలోకి ఈ సినిమా అందుబాటులోకి వ‌చ్చింది. ల‌య‌న్స్ గేట్ ప్లే ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విష‌యాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది.

దృశ్యంతో కంపేరిజ‌న్స్‌...

థియేట‌ర్ల‌లో ఈ సినిమా ఫెయిలైనా జోజు జార్జ్‌, బిజు మీన‌న్ మాత్రం త‌మ యాక్టింగ్‌తో అద‌ర‌గొట్టేశారు. పోటాపోటీగా న‌టించారు. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ల‌తో దృశ్యం సినిమాతో చాలా మంది వ‌ల‌తు వ‌శ‌త్తే క‌ల్ల‌న్‌ను కంపేర్ చేశారు. కానీ ట్విస్ట్‌లు, ట‌ర్న్‌లు పెద్ద‌గా లేక‌పోవ‌డం, స్క్రీన్‌ప్లే బోరింగ్‌గా సాగ‌డంతో ఈ మూవీ ఫెయిలైంది.
ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌కు బిజు మీన‌న్ అటెండ్ కాక‌పోవ‌డం రిలీజ్‌కు ముందు వివాదానికి దారితీసింది. అత‌డి వ‌ల్ల సినిమాకు భారీగా న‌ష్టం జ‌రిగిందంటూ నిర్మాత‌లు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడ‌రేష‌న్‌లో కంప్లైంట్ ఇచ్చారు.

ఆంటోనీ వ‌ర్సెస్ సామ్‌...

ఆంటోనీ జేవియ‌ర్ (బిజు మీన‌న్‌) అవినీతిప‌రుడైన‌ పోలీస్ ఆఫీస‌ర్‌. ఓ లైంగిక వేధింపుల కేసులో నిందితుడి స‌పోర్ట్ చేస్తాడు ఆంటోనీ. దాంతో బాధితురాలు పోలీస్ స్టేష‌న్ ముందే ఆత్మ‌హ‌త్య చేసుకుంటుంది. ఈ కేసులో ఆంటోనీకి వ్య‌తిరేకంగా సాక్ష్యాలు సేక‌రించే ప‌నిలో ఉన్న ఐరీన్ అనే సోష‌ల్ యాక్టివిస్ట్‌ దారుణంగా హ‌త్య‌కు గుర‌వుతుంది. ఐరీన్ చ‌నిపోయేరోజు చివ‌ర‌గా ఆంటోనీనే క‌లిసింద‌నే నిజాన్ని ఐరీన్ తండ్రి సామ్ బ‌య‌ట‌పెడ‌తాడు. ఆంటోనీకి అవినీతి ప‌నుల‌న్నీ ఒక్కొక్క‌టిగా ఆధారాల‌తో నిరూపిస్తాడు. ఆంటోనీ కొడుకు ఫిలిప్‌ను కిడ్నాప్ చేస్తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? ఆంటోనీ స్టేష‌న్‌లోనే సామ్ ఎలా చ‌నిపోయాడు? ఫిలిప్‌ను కిడ్నాప్ చేసిన సామ్ ఎక్క‌డ దాచిపెట్టాడు? కొడుకును ఆంటోనీ కాపాడుకున్నాడా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

 

Advertisement
Advertisement