త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malayalam OTT | ఓటీటీలోకి మ‌ణిర‌త్నం హీరోయిన్ మ‌ల‌యాళం సైక‌లాజిక‌ల్‌ థ్రిల్ల‌ర్ మూవీ -బ‌ట్ట‌ర్‌ఫ్లై ఎఫెక్ట్ తో

సీనియ‌ర్ న‌టి ఊర్వ‌శి, జోజు జార్జ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మ‌ల‌యాళం మూవీ ఆశ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. అక్టోబ‌ర్ 16 నుంచి జీ5 ఓటీటీలో మ‌ల‌యాళంతో పాటు తెలుగులో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమాలో ఐశ్వ‌ర్య‌ల‌క్ష్మి హీరోయిన్‌గా న‌టించింది.

N

Entertainment | Published On Oct 13, 2026, 5.08 pm IST

Malayalam OTT |  ఓటీటీలోకి మ‌ణిర‌త్నం హీరోయిన్ మ‌ల‌యాళం సైక‌లాజిక‌ల్‌ థ్రిల్ల‌ర్ మూవీ -బ‌ట్ట‌ర్‌ఫ్లై ఎఫెక్ట్ తో
Advertisement

Malayalam OTT |  సీనియ‌ర్ న‌టి ఊర్వ‌శి, జోరు జార్జ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఆశ డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్ మూవీగా మ‌ల‌యాళ (Malayalam ) ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. స‌ఫ‌ర్ స‌న‌ల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో ఐశ్వ‌ర్య‌ల‌క్ష్మి (Aishwarya Lekshmi) హీరోయిన్‌గా న‌టించింది. ఆమెతో ల‌క్ష్మి మీన‌న్‌, విజ‌య్ రాఘ‌వ‌న్‌, భాగ్య‌ల‌క్ష్మి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సెప్టెంబ‌ర్‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఆశ మూవీ థియేట‌ర్ల‌లో మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ సినిమాకు జోజు జార్జ్ ఓ ర‌చయిత‌గా ప‌నిచేశారు.

ఓటీటీలోకి...

తాజాగా ఆశ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. అక్టోబ‌ర్ 16 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ వెర్ష‌న్ల‌లో రిలీజ్ కాబోతుంది.

క్లైమాక్స్ ట్విస్ట్‌...

ఆశ క‌థ‌తో పాటు ఊర్వ‌శి, జోజు జార్జ్ యాక్టింగ్ ఈ సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ఓ చిన్న ప్ర‌మాదం సొసైటీలో ఎలాంటి గొడ‌వ‌లు క్రియేట్ చేసింది? రెండు కుటుంబాల్లో ఏ విధంగా మ‌న‌శ్శాంతి లేకుండా చేసింద‌నే అంశాల‌తో ద‌ర్శ‌కుడు స‌ఫ‌ర్ స‌న‌ల్ ఈ సినిమాను రూపొందించారు. క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్‌బ్లాక్ అంటూ ఆడియెన్స్ నుంచి కామెంట్లు వ‌చ్చాయి. చిన్న చిన్న నిర్ణయాలు ఊహించని పరిణామాలకు ఎలా దారితీస్తాయనే ‘బటర్‌ఫ్లై ఎఫెక్ట్’ ప్రధాన ఇతివృత్తంగా ఆశ సాగుతుంది రెగ్య‌కుల‌ర్ రివేంజ్ సినిమాలా కాకుండా పాత్రలు, వాటి నిర్ణయాలు, త‌దానంత‌ర‌ పర్యవసానాల చుట్టూ ఆస‌క్తిక‌రంగా సాగుతుంది.

కులం రంగు...

ఆశ భ‌ర్త చ‌నిపోతాడు. చిన్న కూత‌రు అన‌ఘ‌తో క‌లిసి ఓ అద్దె ఇంట్లో ఉంటుంది. మాన‌సిక స‌మ‌స్య‌ల కార‌ణంగా కోపిష్టిగా మారిపోతుంది. ఓ చిన్న యాక్సిడెంట్ కార‌ణంగా జీమోన్‌తో ఆశ గొడ‌వ‌ప‌డుతుంది. కోపంలోనే అత‌డిపై పోలీసుల‌కు కంప్లైంట్ ఇస్తుంది. ఇద్ద‌రి మ‌ధ్య మొద‌లైన వివాదం కాస్త కుల రంగును పుల‌ముకుంటుంది. ఈ కేసు కార‌ణంగా ఆశ‌తో పాటు జీమోన్ జీవితాలు ఎలాంటి మ‌లుపులు తిరిగాయ‌న్న‌దే ఈ మూవీ క‌థ‌. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళంలో ప‌లు సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది ఐశ్వ‌ర్య ల‌క్ష్మి. జ‌గ‌మే తంత్రం, కింగ్ ఆఫ్ కోతా, గాడ్సే, కుమారి, గ‌ట్టా కుస్తీ సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన పొన్నియ‌న్ సెల్వ‌న్‌, పొన్నియ‌న్ సెల్వ‌న్ 2తో పాటు థ‌గ్‌లైఫ్‌లో డిఫ‌రెంట్ రోల్స్ చేసింది.

 

Advertisement
Advertisement