Manju Warrier | పెళ్లి చేసుకోవాలంటూ డైరెక్టర్ వేధింపులు – కోర్టును ఆశ్రయించిన మలయాళ హీరోయిన్
డైరెక్టర్ సనల్ కుమార్‌పై మలయాళ హీరోయిన్ మంజు వారియర్ కోర్టును ఆశ్రయించింది. పెళ్లి చేసుకోవాలంటూ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని కేసు పెట్టింది. ఈ డైరెక్టర్‌పై పరువు నష్టం దావా వేసింది.
Entertainment | Published On Sep 20, 2026, 2.50 pm IST
Manju Warrier | సోషల్ మీడియా వేధింపులపై మలయాళ హీరోయిన్ మంజు వారియర్ కోర్టును ఆశ్రయించారు. అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సనల్ కుమార్ తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాడంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దర్శకుడిపై పరువు నష్టం దావా వేసింది.
కఠిన చర్యలు ...
గత ఆరేళ్లుగా డైరెక్టర్ సనల్ కుమార్ తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని మంజు వారియర్ పేర్కొన్నది. తన వ్యక్తిత్వాన్ని వక్రీకరించేలా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్ట్‌లు, ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తున్నాడని అన్నది. సోషల్ మీడియాల నుంచి ఈ పోస్ట్‌లను తొలగించడమే కాకుండా తనపై అసత్యపు ప్రచారాలను చేస్తోన్న సనల్ కుమార్‌తో పాటు అతడి అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎర్నాకులం కోర్టును ఆశ్రయించింది మంజు వారియర్. డైరెక్టర్ సనల్ కుమార్‌పై పరువు నష్టం దావా వేసింది. మంజు వారియర్ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు సనల్ కుమార్‌తో పాటు ఫేస్‌బుక్‌కు సమన్లు జారీ చేసింది.
కయట్టం మూవీ...
2020లో రిలీజైన కయట్టం మూవీ నుంచే మంజు వారియర్, సనల్ కుమార్ మధ్య వివాదం మొదలైంది. సనల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మంజు వారియర్ హీరోయిన్‌గా నటించింది.పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఈ మూవీ స్క్రీనింగ్ అయ్యింది.
పెళ్లి చేసుకోవాలంటూ...
ఈ సినిమా సమయంలో మంజు వారియర్‌తో సనల్‌కుమార్‌కు స్నేహం మొదలైంది. ఆ సాన్నిహిత్యాన్ని అడ్డుగా పెట్టుకొని తనను పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఈ డైరెక్టర్‌పై మంజు వారియర్ ఆరోపణలు చేసింది. ఫోన్ కాల్స్, మెసేజ్‌లతో వేధించడమే కాకుండా తనపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్ట్‌లు పెడుతున్నాడంటూ చెప్పింది. ప్రవర్తన మార్చుకోవాలంటూ చెప్పిన వినలేదని అన్నది.
పోలీస్ కంప్లైంట్...
దర్శకుడి టార్చర్ ఎక్కువ కావడంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంజు వారియర్ కంప్లైంట్ స్వీకరించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. బెయిల్‌పై రిలీజైన సనల్‌కుమార్ ప్రవర్తనలో మార్పు రాలేదని, సోషల్ మీడియాలో వేధింపులను కొనసాగిస్తూనే ఉన్నాడంటూ మంజు వారియర్ కోర్టు మెట్లు ఎక్కడం మలయాళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మంజు వారియర్ కేసుపై దర్శకుడు సనల్ కుమార్ రియాక్ట్ అయ్యారు. ఆమె ఆరోపణలు అబద్దమని, తనంటే గిట్టని కొందరు మంజు వారియర్‌ను అడ్డుపెట్టుకొని తనపై తప్పుడు కేసులు పెట్టారని అన్నారు.
తెలుగులోకి డబ్
మలయాళంలో అగ్ర నాయికల్లో ఒకరిగా కొనసాగుతోంది మంజు వారియర్. ఆమె హీరోయిన్‌గా నటించిన ఒడియన్, లూసిఫర్‌తో పాటు తమిళ సినిమాలు వెట్టయన్, తినువు, అసురన్‌తో పాటు పలు సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Priyanka Mohan | ఇరుముడి సెంటిమెంట్ కంటిన్యూ - ఓజీ హీరోయిన్‌తో మాస్ మహారాజా రొమాన్స్
- ●Kishan Reddy | ఎయిర్‌ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్ కోసం నోడల్ అధికారిని నియమించండి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
- ●Riyadh Airport Attack | రియాద్ విమానాశ్రయంపై హౌతీ రెబల్స్ భారీ క్షిపణి దాడి.. గాల్లోనే కూల్చేసిన సౌదీ ఎయిర్ డిఫెన్స్
- ●Vijay Devarakonda | సందీప్ రెడ్డి వంగా సూచన సూపర్బ్.. విజయ్ దేవరకొండ ట్వీట్
- ●Mumbai Coastal Road Accident | రోడ్డుపై గాల్లోకి లేచి పల్టీలు కొట్టిన బీఎండబ్ల్యూ.. బ్రిడ్జి పైనుంచి పడి ముగ్గురు దుర్మరణం
- ●MLC Dasoju Sravan | నిన్న పులి.. నేడు పిల్లి.. 'దానం'పై ఎమ్మెల్సీ దాసోజు సెటైర్లు

Priyanka Mohan | ఇరుముడి సెంటిమెంట్ కంటిన్యూ - ఓజీ హీరోయిన్‌తో మాస్ మహారాజా రొమాన్స్

Kishan Reddy | ఎయిర్‌ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్ కోసం నోడల్ అధికారిని నియమించండి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

Riyadh Airport Attack | రియాద్ విమానాశ్రయంపై హౌతీ రెబల్స్ భారీ క్షిపణి దాడి.. గాల్లోనే కూల్చేసిన సౌదీ ఎయిర్ డిఫెన్స్

Vijay Devarakonda | సందీప్ రెడ్డి వంగా సూచన సూపర్బ్.. విజయ్ దేవరకొండ ట్వీట్






