Malavika Mohanan | నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోతో రాజాసాబ్ బ్యూటీ సినిమా – టైటిల్ రివీల్ చేసిన సమంత
రాజాసాబ్ బ్యూటీ మాళవికా మోహనన్ తమిళంలో ఓ కొత్త సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్‌తో జోడీగా నటించబోతుంది. ఆ హీరో ఎవరు..సినిమా ఏదంటే?
Entertainment | Published On Feb 17, 2026, 2.30 pm IST
Malavika Mohanan | రాజాసాబ్ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి తొలి అడుగు వేసింది మాళవికా మోహనన్. ఈ హారర్ కామెడీ మూవీలో భైరవి అనే గ్లామర్ రోల్‌లో కనిపించింది. ప్రభాస్ సినిమాతో హిట్టు కొట్టి టాలీవుడ్‌లో సెటిలవ్వాలని కలలు కన్నది. కానీ ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా రాజాసాబ్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ప్రభాస్ సినిమా కోసం మాళవికా మూడేళ్ల పాటు పడిన శ్రమ మొత్తం వృథాగా మారింది. రాజాసాబ్ తర్వాత మాళవికా మోహనన్ ఓ కొత్త సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే తెలుగులో కాదు..తమిళంలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరో విజయ్ సేతుపతితో ఓ డిఫరెంట్ మూవీ చేయబోతుంది.
సూపర్ డీలక్స్ తర్వాత....
సూపర్ డీలక్స్ తర్వాత విజయ్ సేతుపతి, డైరెక్టర్ త్యాగరాజా కుమార్‌రాజా కాంబినేషన్‌లో దాదాపు ఆరేళ్ల తర్వాత పాకెట్ నావెల్ పేరుతో ఓ మూవీ రాబోతుంది. సోమవారం ఈ సినిమాను అఫీషియల్‌గా మేకర్స్ అనౌన్స్‌చేశారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను సమంత, లోకేష్ కనగరాజ్, రమ్యకృష్ణ, వామికా గబ్బి కలిసి రిలీజ్ చేశారు.
రెడ్ కలర్‌లో డిజైన్ చేసిన ఈ పోస్టర్‌లో స్కెచ్ రూపంలో విజయ్ సేతుపతి ముఖం కనిపిస్తోంది. లోయలోకి జారిపోతున్న ఓ వ్యక్తి, అతడి చేతులో ఉన్న సూట్‌కేస్ నుంచి ఎగురుతున్న కాగితాలతో ఈ పోస్టర్ ఆసక్తిని పంచుతోంది.
డార్క్ హ్యూమర్ థ్రిల్లర్...
డార్క్ హ్యూమర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విజయ్ సేతుపతికి జోడీగా మాళవికా మోహనన్ హీరోయిన్‌గా నటించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కన్నడ నటుడు రాజ్ బీ శెట్టి ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇళయరాజా ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.
మూడో సినిమా...
విజయ్ సేతుపతి, మాళవికా మోహనన్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా ఇది. గతంలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించిన రజనీకాంత్ పేట, దళపతి విజయ్ మాస్టర్ సినిమాల్లో మాళవికా మోహనన్ హీరోయిన్‌గా నటించింది. పాకెట్ నావెల్‌లో మాత్రం వీరిద్దరు జంటగా కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పాకెట్ నావెల్ సినిమాను ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్యాగరాజాకుమార్ రాజా దర్శకత్వంలో రూపొందిన సూపర్ డీలక్స్ మూవీకిగాను విజయ్ సేతుపతి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా నేషనల్ అవార్డును అందుకున్నారు.
సంబంధిత వార్తలు

Kaviya Maran | కోలీవుడ్ రాక్‌స్టార్‌తో ఏడడుగులు వేయబోతున్న కావ్య పాప – పెళ్లి ఎప్పుడు..ఎక్కడంటే?
మే 21, 2026

Meenakshi Chaudhary | సంక్రాంతి హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి..! కార్తితో మ్యాజిక్ రిపీట్ చేసేనా..?
మే 20, 2026

Janhvi Kapoor | కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోన్న జాన్వీ కపూర్ – స్టార్ హీరో తనయుడికి జోడీగా
మే 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



