త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malavika Mohanan | త‌ప్పంతా వారిలోనే ఉంది – గ్లామ‌ర్ రోల్స్‌పై రాజాసాబ్ హీరోయిన్ కామెంట్స్‌

పెద్ది సినిమాలో జాన్వీ క‌పూర్ పాత్ర‌పై దారుణంగా విమ‌ర్శ‌లొచ్చాయి. డ‌బ్బుల కోస‌మే హీరోయిన్లు అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు ఒప్పుకుంటున్నారంటూ చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఈ విమ‌ర్శ‌ల‌పై రాజాసాబ్ హీరోయిన్ మాళ‌వికా మోహ‌న‌న్ రియాక్ట్ అయ్యింది. గ్లామ‌ర్ పాత్ర‌లు చేసే వారిలో కాకుండా త‌ప్పుడు ఆలోచ‌న‌ల‌తో చూసే వారిలోనే సమస్య ఉందని అన్నది.

N

Entertainment | Published On Jul 18, 2026, 4.21 pm IST

Malavika Mohanan | త‌ప్పంతా వారిలోనే ఉంది – గ్లామ‌ర్ రోల్స్‌పై రాజాసాబ్ హీరోయిన్ కామెంట్స్‌
Advertisement

Malavika Mohanan | పెద్ది మూవీలో జాన్వీక‌పూర్ రోల్ వివాదం ఇంకా స‌మ‌సిపోలేదు.ఈ బాలీవుడ్ హీరోయిన్  పాత్రపై వచ్చిన అభ్యంత‌రాల‌పై రాజాసాబ్ హీరోయిన్ మాళ‌వికా మోహ‌న‌న్ రియాక్ట్ అయ్యింది. సినిమాల్లో హీరోయిన్లు గ్లామ‌ర‌స్‌గా క‌నిపించ‌డంలో ఎలాంటి త‌ప్పు లేద‌ని చెప్పింది. హీరోయిన్ల‌ను విమ‌ర్శించే క్ర‌మంలోనే కొంద‌రు త‌మ హ‌ద్దుల‌ను దాటుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

పేరు డ‌బ్బు కోస‌మే...

"గ్లామ‌ర్స్ రోల్స్ విష‌యంలో చాలా మంది హీరోయిన్ల‌నే త‌ప్పుప‌డుతుంటారు. పేరు, డ‌బ్బు కోస‌మే అలాంటి పాత్ర‌లు చేస్తున్నారంటూ విమ‌ర్శిస్తుంటారు. కానీ ఏ హీరోయిన్ కూడా అందాల ప్ర‌ద‌ర్శ‌న విష‌యంలో త‌న‌కు తానుగా హ‌ద్దులు దాటాల‌ని అనుకోదు. ద‌ర్శ‌క‌నిర్మాత‌ల ఒత్తిడి, అవ‌కాశాల కోసం పోటీతో పాటు ఇత‌ర కార‌ణాల వ‌ల్లే కొన్ని సార్లు ఇష్టం లేక‌పోయినా గ్లామ‌ర్ రోల్స్ చేయ‌డానికి అంగీక‌రిస్తుంటారు. హీరోయిన్ల‌ను విమ‌ర్శించే క్ర‌మంలోనే చాలా మంది లిమిట్స్ క్రాస్ చేస్తుంటారు. వారి వ్య‌క్తిత్వాన్ని అవ‌హేళ‌న చేసేలా కామెంట్లు చేస్తుంటారు. అలాంటివి చూసిన‌ప్పుడు బాధ క‌లుగుతుంది" అని మాళ‌వికా మోహ‌న‌న్ అన్న‌ది.

న‌ట‌న‌లో భాగ‌మే...

"గ్లామ‌ర‌స్‌గా క‌నిపించ‌డం కూడా ఓ న‌ట‌న‌లో భాగ‌మే. అందులో ఎలాంటి త‌ప్పులేదు. అస‌లు స‌మ‌స్య మొత్తం త‌ప్పుడు ఆలోచ‌న‌ల‌తో హీరోయిన్ల‌ను చూసే వారిలోనే ఉంది. వాళ్ల దృక్ప‌థం మారితే అన్ని స‌వ్యంగానే క‌నిపిస్తాయి" అంటూ  మాళవికా మోహనన్ పేర్కొన్నది. ఈ వివాదంలో జాన్వీతో పాటు పెద్ది మూవీ టీమ్‌ను స‌పోర్ట్ చేస్తూ మాళ‌వికా మోహ‌న‌న్ చేసిన కామెంట్లు వైర‌ల్ అవుతోన్నాయి.

రాజాసాబ్‌లో...

రాజాసాబ్‌లో విష‌యంలో కూడా మాళ‌వికా మోహ‌న‌న్ రోల్‌పై కూడా నెగెటివ్ కామెంట్లు వ‌చ్చాయి. త‌న పాత్ర‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త లేక‌పోయినా డ‌బ్బుల కోస‌మే ఆమె ఈ సినిమా చేసిందంటూ విమ‌ర్శించారు. ఆ నెగెటివ్ కామెంట్ల‌కు కూడా మాళ‌వికా మోహ‌న‌న్ ఇప్పుడు బ‌దులిచ్చింద‌ని అంటున్నారు.

పాకెట్ నావెల్‌...

రాజాసాబ్ త‌ర్వాత త‌మిళంలో కార్తీతో స‌ర్దార్ 2 సినిమా చేస్తోంది మాళ‌వికా మోహ‌న‌న్‌. ఈ సినిమాలో యాక్ష‌న్ రోల్ చేస్తోంది. విజ‌య్ సేతుప‌తికి జోడీగా పాకెట్ నావెల్‌లో న‌టిస్తోంది. స‌

Advertisement
Advertisement