త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Babu | మ‌రోసారి థియేట‌ర్ల‌లోకి మ‌హేష్‌బాబు క్లాసిక్ మూవీ – అత‌డు రీ రిలీజ్ డేట్ ఇదే

మ‌హేష్‌బాబు అత‌డు మూవీ మ‌రోసారి థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 28న రీ రిలీజ్ కానుంది.

N

Entertainment | Published On Feb 6, 2026, 6.24 pm IST

Mahesh Babu |  మ‌రోసారి థియేట‌ర్ల‌లోకి మ‌హేష్‌బాబు క్లాసిక్ మూవీ – అత‌డు రీ రిలీజ్ డేట్ ఇదే
Advertisement

Mahesh Babu |  ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ పాపుల‌ర్ అయ్యింది. బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిలిచిన స్టార్ హీరోల సినిమాల‌ను మ‌ళ్లీ థియేట‌ర్ల‌లోకి తీసుకొస్తున్నారు. స్ట్రెయిట్ సినిమాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా రీ రిలీజ్ మూవీస్ భారీగా క‌లెక్ష‌న్స్ రాబ‌డుతోన్నాయి. ముఖ్యంగా ఇప్ప‌టివ‌ర‌కు రీ రిలీజ్ అయిన మ‌హేష్‌బాబు సినిమాలు నిర్మాత‌లు కాసుల వ‌ర్షం కురిపించాయి. రీ రిలీజ్‌ల‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన తెలుగు సినిమాగా మ‌హేష్‌బాబు మురారి ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉంది. మురారితో పాటు బిజినెస్‌మెన్‌, ఒక్క‌డుతో పాటు మ‌రికొన్ని సినిమాలు రికార్డ్ స్థాయిలో క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టాయి.

అత‌డు రీ రిలీజ్‌...

తాజాగా మ‌హేష్‌బాబు మ‌రో మూవీ థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతుంది. మ‌హేష్‌బాబు, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో క్లాసిక్ మూవీ అత‌డు ఫిబ్ర‌వ‌రి 28న థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ కాబోతుంది. విడుద‌ల తేదీని అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్ ఓ కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు.

త్రిష హీరోయిన్‌...

మ‌హేష్‌బాబు, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఫ‌స్ట్ టైమ్ రూపొందిన ఈ మూవీ 2005లో థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఫ‌స్ట్ వీక్ ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వ‌చ్చింది. మౌత్ టాక్ బాగుండ‌టంతో మెళ్ల‌మెళ్ల‌గా వ‌సూళ్లు పెరిగాయి.
12 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన అత‌డు మూవీ 22 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఆ టైమ్‌లో మ‌హేష్‌బాబు కెరీర్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా అత‌డు రికార్డ్ క్రియేట్ చేసింది. అత‌డు మూవీలో త్రిష హీరోయిన్‌గా న‌టించింది. సోనూ సూద్ విల‌న్‌గా క‌నిపించాడు. మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ అందించాడు.

ఉద‌య్ కిర‌ణ్‌....

అత‌డు మూవీకి తొలుత పార్ధు అనే టైటిల్‌ను అనుకున్నారు. హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌ను దృష్టిలో పెట్టుకొని అత‌డుగా టైటిల్ మార్చారు. ఈ సినిమాలో హీరోగా ఫ‌స్ట్ ఛాయిస్ మ‌హేష్‌బాబు కాదు. ఉద‌య్ కిర‌ణ్‌తో ఈ సినిమా చేయాల‌ని త్రివిక్ర‌మ్ అనుకున్నారు. ఉద‌య్ కిర‌ణ్ త‌ప్పుకోవ‌డంతో మ‌హేష్‌బాబుతో త్రివిక్ర‌మ్ ఈ సినిమా చేశారు. 38 సెంట‌ర్స్‌లో ఈ మూవీ వంద రోజులు ఆడింది. అంతే కాకుండా టీవీలో ఇప్ప‌టివ‌ర‌కు ఈ మూవీ 1500ల‌కుపైగా మా టీవీలో టెలికాస్ట్ అయ్యి రికార్డ్ క్రియేట్ చేసింది.

Advertisement
Advertisement