Sreeleela | యూట్యూబ్‌లో చరిత్రను సృష్టించిన మహేష్‌బాబు ,శ్రీలీల తెలుగు సాంగ్ – 800 మిలియన్ల వ్యూస్‌తో రికార్డ్
మహేష్‌బాబు, శ్రీలీల ఓ అరుదైన రికార్డును నెలకొల్పారు. వీరిద్దరు జంటగా నటించిన గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ యూట్యూబ్‌లో ఎనిమిది వందల మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. తెలుగు సినిమా వీడియో సాంగ్స్‌లో హయ్యెస్ట్ వ్యూస్ దక్కించుకున్నసెకండ్ పాటగా నిలిచింది.
Entertainment | Published On Jun 29, 2026, 11.40 am IST
Sreeleela | గతంలో ఓ సినిమాలోని సాంగ్స్ ఎంత హిట్టయ్యాయి అన్నది ఆడియో, సీడీల సేల్స్‌ను బట్టి డిసైడ్ అయ్యేది. కానీ డిజిటల్ యుగంలో పాటల విజయానికి వ్యూస్ కోలమానంగా మారాయి. యూట్యూబ్‌తో పాటు ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో ఓ సాంగ్‌కు ఎన్ని వ్యూస్ వచ్చాయన్నదానిని బట్టే జయాపజయాలు నిర్ణయమవుతున్నాయి. యూట్యూబ్ ఓ తెలుగు సాంగ్ వంద మిలియన్ల వ్యూస్ రాబట్టడం అరుదు. కానీ మహేష్‌బాబు, శ్రీలీల నటించిన గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి వీడియో సాంగ్ ఏకంగా ఎనిమిది వందల మిలియన్ల వ్యూస్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు సినిమా సాంగ్స్‌లో హయ్యెస్ట్ వ్యూస్ దక్కించుకున్న పాటల లిస్ట్‌లో కుర్చీ మడతపెట్టి సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. మహేష్‌బాబు తో పాటు శ్రీలీల కెరీర్‌లో హయ్యెస్ట్ వ్యూస్ దక్కించుకున్న సాంగ్ కూడా ఇదే కావడం గమనార్హం. మాస్ లిరిక్స్‌తో పాటు మహేష్‌బాబు, శ్రీలీల స్టెప్పులు, తమన్ బీట్స్ మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకున్నాయి.
అల్లు అర్జున్ మూడు సాంగ్స్...
యూట్యూబ్‌లో హయ్యెస్ట్ వ్యూస్ దక్కించుకున్న తెలుగు వీడియో సాంగ్స్ లిస్ట్‌లో అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలోని సామజవరగమనా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఈ సాంగ్‌కు ఇప్పటివరకు 944 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత సెకండ్ ప్లేస్‌లో కుర్చీ మడతపెట్టి నిలవగా....మూడో స్థానంలో రాములో రాములా సాంగ్ ఉంది. ఈ పాటకు 786 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. పుష్ప సినిమాలోని ఊ అంటావా మావ పాట 323 మిలియన్ల వ్యూస్‌తో నాలుగో ప్లేస్‌లో కొనసాగుతోంది. టాప్ ఫోర్ లిస్ట్‌లో మూడు అల్లు అర్జున్ సాంగ్స్ ఉండటం విశేషం.
త్రివిక్రమ్ డైరెక్టర్...
కాగా గుంటూరు కారం సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మాత్రం సరైన విజయాన్ని దక్కించుకోలేకపోయింది. మహేష్‌బాబు యాక్టింగ్ బాగున్నా...కాన్సెప్ట్‌లో కొత్తదనం లేకపోవడం, త్రివిక్రమ్ సినిమాల్లో ఉండే ఎమోషన్స్, కామెడీ మిస్సవ్వడంతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. గుంటూరు కారం సినిమాలో రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ కీలక పాత్రలు పోషించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rashmika Deverakonda | రష్మిక దేవరకొండ – భర్త ఇంటి పేరుతో నేషనల్ క్రష్ పోస్ట్ వైరల్ – విజయ్ క్యూట్ రిప్లై
ఆగస్టు 20, 2026

Madhuri Rathod | మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయి ‘రాయే లచ్చిమి’ సాంగ్ ట్రెండింగ్ – వీరిద్దరు కలిసి చేసిన ఫోక్ సాంగ్స్ ఇవే
ఆగస్టు 20, 2026

Mamitha Baiju | సూర్య, మమితా బైజు కాంబోలో అచలుడు మూవీ – సగం షూటింగ్ తర్వాత ఎందుకు ఆగిపోయిందంటే?
ఆగస్టు 20, 2026
తాజావార్తలు
- ●KTR | అగమ్యగోచరంగా పాలిటెక్నిక్ విద్యార్థుల భవితవ్యం : కేటీఆర్
- ●Red Chilli Powder | కారం పొడిలో 30 శాతం రంపపు పొడి.. 3,350 కిలోలు సీజ్
- ●స్పందనలో వేగం… నిరంతర ఉద్యమాల్లో పరిమితులు: బీఆర్ఎస్ పోరాటానికి 40-45% మార్కులేనా?
- ●Kalyana Lakshmi | పెళ్లై పిల్లలు కూడా పుట్టారు.. ఇంకా కళ్యాణలక్ష్మీ చెక్ రాలేదు
- ●RSP | రేవంతూ.. మీరు పాలిటెక్నిక్ చేసి బీఏ చేయగలిగినప్పుడు.. ఈ పిల్లలు ఈసెట్‌కు పోతే తప్పేముంది..?
- ●Rashmika Deverakonda | రష్మిక దేవరకొండ - భర్త ఇంటి పేరుతో నేషనల్ క్రష్ పోస్ట్ వైరల్ - విజయ్ క్యూట్ రిప్లై

KTR | అగమ్యగోచరంగా పాలిటెక్నిక్ విద్యార్థుల భవితవ్యం : కేటీఆర్

Red Chilli Powder | కారం పొడిలో 30 శాతం రంపపు పొడి.. 3,350 కిలోలు సీజ్

స్పందనలో వేగం… నిరంతర ఉద్యమాల్లో పరిమితులు: బీఆర్ఎస్ పోరాటానికి 40-45% మార్కులేనా?

Kalyana Lakshmi | పెళ్లై పిల్లలు కూడా పుట్టారు.. ఇంకా కళ్యాణలక్ష్మీ చెక్ రాలేదు



