త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Babu Sister | బాల‌కృష్ణ హీరో – మ‌హేష్‌బాబు అక్క హీరోయిన్ – ఫ్యాన్స్ గొడ‌వ‌ల‌తో ఆగిపోయిన మూవీ ఏదో తెలుసా?

మ‌హేష్‌బాబు అక్క మంజుల హీరోయిన్ కావాల‌ని అనుకుంద‌ట‌. బాల‌కృష్ణ, మంజుల కాంబినేష‌న్‌లో ఓ సినిమా కూడా అనౌన్స్అయ్యింది. కానీ మంజుల హీరోయిన్ కావ‌డానికి కృష్ణ ఫ్యాన్స్ ఒప్పుకోలేదు. అభిమానుల ఆగ్ర‌హంలో మంజుల యాక్టింగ్ ఆలోచ‌న‌ను ప‌క్క‌న‌పెట్టింది.

N

Entertainment | Published On Jun 21, 2026, 6.09 pm IST

Mahesh Babu Sister | బాల‌కృష్ణ హీరో – మ‌హేష్‌బాబు అక్క హీరోయిన్ – ఫ్యాన్స్ గొడ‌వ‌ల‌తో ఆగిపోయిన మూవీ ఏదో తెలుసా?
Advertisement

Mahesh Babu Sister |  టాలీవుడ్‌లో (Tollywood) వార‌సుల‌తో పోలిస్తే వార‌సురాళ్లు చాలా త‌క్కువ మందే ఉన్నారు. వార‌సురాళ్ల‌ను హీరోయిన్లుగా ప‌రిచ‌యం చేసే ట్రెండ్ ఇప్పుడిప్పుడే తెలుగు ఇండ‌స్ట్రీలో పెరుగుతోంది. కానీ ఇది వ‌ర‌కు మాత్రం స్టార్ హీరోల కూతుళ్లు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్ట‌డానికి అభిమానులు అంగీక‌రించేవారు కాదు. సూప‌ర్ స్టార్ కృష్ణ కూతురు, మ‌హేష్ బాబు సోద‌రి మంజుల కూడా హీరోయిన్ కావాల‌ని క‌ల‌లుక‌న్న‌ది. తండ్రి కృష్ణ కూడా అందుకు ఒప్పుకున్నారు. బాల‌కృష్ణ కు (Balakrishna) జోడీగా మంజుల‌తో ఓ సినిమాను కూడా అనౌన్స్‌చేశారు. కానీ అభిమానుల నుంచి విమ‌ర్శ‌లు, వ్య‌తిరేక‌త రావ‌డంతో చివ‌ర‌కు మంజుల వెన‌క‌డుగు వేసింది. దాంతో కృష్ణ కూతురి ప్లేస్‌లో మేక‌ర్స్ మ‌రో హీరోయిన్‌ను తీసుకున్నారు.

ఫ్యాన్స్ ఆగ్ర‌హం...

తండ్రి, సోద‌రుల బాట‌లోనే తాను కూడా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టాల‌ని కృష్ణ కూతురు మంజుల అనుకుంది. హీరోయిన్ కావాల‌ని నిర్ణ‌యించుకుంది. కూతురి ఇష్టాన్ని కాద‌న‌లేక‌పోయారు కృష్ణ‌. బాల‌కృష్ణ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న టాప్ హీరో సినిమాలో మంజుల‌ను హీరోయిన్‌గా అనౌన్స్‌చేశారు. ఇందుకు సంబంధించిన ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. మంజుల హీరోయిన్‌గా న‌టించ‌డానికి వీలు లేద‌ని ఫ్యాన్స్ ప‌ట్టుప‌ట్టారు. హైద‌రాబాద్‌లోని ప‌ద్మాల‌య స్టూడియో ముందు ధ‌ర్నాలు చేసే వ‌ర‌కు గొడ‌వ వెళ్లింది. ఫ్యాన్స్ ఆగ్ర‌హాన్ని చూసి హీరోయిన్ కావాల‌నే ఆలోచ‌న‌ను మంజుల ప‌క్క‌న‌పెట్టింది. అలా హీరోయిన్‌గా సినిమా చేసే ఛాన్స్ మిస్స‌య్యింది. మంజుల స్థానంలో సౌంద‌ర్య‌ను హీరోయిన్‌గా ఎంచుకున్నారు ఎస్వీ కృష్ణారెడ్డి.

యాక్ట‌ర్‌గా...ప్రొడ్యూస‌ర్‌గా...

ఆ త‌ర్వాత చాలా ఏళ్ల‌కు షో మూవీ కెమెరా ముందుకొచ్చింది మంజుల‌. ఆ త‌ర్వాత కావ్య‌స్ డైరీ, సేవ‌కుడు, ఆరెంజ్‌, మ‌ళ్లీ మొద‌లైందితో పాటు మ‌రికొన్ని సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా క‌నిపించింది. ప్రొడ్యూస‌ర్‌గా మ‌హేష్‌బాబుతో పోకిరి, నానితో పాటు నాగ‌చైత‌న్య‌, స‌మంతల‌తో ఏ మాయ చేశావే సినిమాల‌ను నిర్మించింది మంజుల‌.

 

Advertisement
Advertisement