త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Babu | అప్పుడు ఎన్టీఆర్‌…ఇప్పుడు మ‌హేష్ – ఛ‌లో జార్జియా

ఎన్టీఆర్ డ్రాగ‌న్ త‌ర్వాత మ‌రో తెలుగు మూవీ షూటింగ్ జార్జియాలో జ‌రుగ‌బోతుంది. మ‌హేష్‌బాబు, రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న వార‌ణాసి నెక్స్ట్ షెడ్యూల్ జార్జియాలో మొద‌లుకాబోతుంది.

N

Entertainment | Published On Feb 24, 2026, 5.29 pm IST

Mahesh Babu | అప్పుడు ఎన్టీఆర్‌…ఇప్పుడు మ‌హేష్ – ఛ‌లో జార్జియా
Advertisement

Mahesh Babu |  యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న డ్రాగ‌న్ లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవ‌లే జార్జియాలో ముగిసింది. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌పై భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌తో పాటు కొంత టాకీ పార్ట్‌ను షూట్ చేశారు ప్ర‌శాంత్ నీల్‌. మార్చి ఫ‌స్ట్ వీక్ వ‌ర‌కు జార్జియా షెడ్యూల్ సాగాల్సింది. కానీ అనుకున్న‌దానికంటే ప‌ది రోజులు ముందే షూటింగ్‌కు ప్యాక‌ప్ చెప్పి ఎన్టీఆర్ ఇండియా వ‌చ్చేశారు.

వార‌ణాసి కోసం...

తాజాగా డ్రాగ‌న్ త‌ర్వాత మ‌రో తెలుగు భారీ బ‌డ్జెట్ మూవీ వార‌ణాసి షూటింగ్ జార్జియాలో జ‌రుగ‌నుంది. ఈ సినిమా షూటింగ్ కోసం మంగ‌ళ‌వారం మ‌హేష్‌బాబు జార్జియా బ‌య‌లుదేరారు. ఎయిర్‌పోర్ట్‌లో మ‌హేష్ క‌నిపించిన వీడియోలు, ఫొటోలు వైర‌ల్ అవుతోన్నాయి. ఐస్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చే కొన్ని యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌ను జార్జియాలో షూట్ చేసేందుకు రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ సీన్లు సినిమాకు హైలైట్‌గా ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ప్రియాంక చోప్రా కూడా...

మార్చి ఫ‌స్ట్ వీక్‌లో మొద‌ల‌య్యే ఈ షెడ్యూల్ మూడు వారాల పాటు సాగ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. జార్జియా షెడ్యూల్‌లో మ‌హేష్‌బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌సుకుమార‌న్ కూడా పాల్గొన్న‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

శ్రీరాముడిగా...

మైథ‌లాజిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో టైమ్ ట్రావెల్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి వార‌ణాసిని తెర‌కెక్కిస్తోన్నారు. దాదాపు 1500 కోట్ల బ‌డ్జెట్‌తో పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా కోసం హాలీవుడ్ ఫ్యాన్స్ సైతం ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్నారు. ఇందులో మ‌హేష్‌బాబు డిఫ‌రెంట్ లుక్‌ల‌లో క‌నిపించ‌బోతున్నాడు. శ్రీరాముడు, రుద్ర‌తో పాటు మ‌రో రెండు డిఫ‌రెంట్ గెట‌ప్‌ల‌లో మ‌హేష్ క‌నిపించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.
వార‌ణాసి మూవీని 2027 ఏప్రిల్ 7న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. శ్రీరామ న‌వ‌మి సంద‌ర్భంగా మ‌హేష్‌బాబు శ్రీరాముడి లుక్‌ను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌హేష్‌బాబు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 9న వార‌ణాసి టీజ‌ర్‌ను విడుద‌ల చేసే అవ‌కాశం ఉంద‌ని టాక్ వినిపిస్తోంది.

Advertisement
Advertisement