TG Cabinet | జులై 2న తెలంగాణ కేబినెట్ అత్యవసర సమావేశం
TG Cabinet | తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి అత్యవసరంగా సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జులై 2న మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరుగనుంది. సచివాలయంలోని ఆరో అంతస్తులో ఉన్న కేబినెట్ హాల్‌లో జరగనున్న ఈ సమావేశం రాష్ట్ర మంత్రిమండలి 34వ సమావేశంగా నిలవనుంది.
TG Cabinet | తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి అత్యవసరంగా సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జులై 2న మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరుగనుంది. సచివాలయంలోని ఆరో అంతస్తులో ఉన్న కేబినెట్ హాల్‌లో జరగనున్న ఈ సమావేశం రాష్ట్ర మంత్రిమండలి 34వ సమావేశంగా నిలవనుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేశారు. కేబినెట్ సమావేశం ఖరారవడంతో సచివాలయంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వివిధ శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు తమ శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలు, విధానపరమైన అంశాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రతి శాఖ తమ అజెండా అంశాలను తెలుగు అనువాదంతో సహా బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటలోపు సాధారణ పరిపాలన (కేబినెట్) శాఖకు అందజేయాలని సీఎస్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఏదైనా శాఖ నుంచి కేబినెట్ పరిశీలనకు ప్రతిపాదనలు లేకపోయినా, నిల్ (NIL) నివేదికను కూడా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. అజెండా తయారీలో ఆలస్యం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు, కేబినెట్ సమావేశం సజావుగా జరిగేలా ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. సమావేశం పూర్తయ్యే వరకు అన్ని శాఖల ఉన్నతాధికారులు, కార్యదర్శులు తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని సీఎస్ ఆదేశించారు. అవసరమైన పరిపాలనా, సాంకేతిక సహకారం అందించేందుకు సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. అలాగే, ప్రొటోకాల్, హార్టికల్చర్, ట్రాన్స్‌లేషన్స్ విభాగాలతో పాటు టీజీటీఎస్ యూనిట్ అధికారులకు కూడా సమావేశానికి అవసరమైన ఏర్పాట్లను సమయానికి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జులై 2న జరిగే కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్న చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●KTR on Revanth Reddy | రూ.30 వేల కోట్లు ఎగ్గొట్టి.. ఆశీర్వాద సభల పేరిట నాటకాలా? సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
- ●Niharika NM | బాలీవుడ్ విలన్‌తో ప్రేమలో పడ్డ తెలుగు హీరోయిన్ ... ఫొటోలు వైరల్
- ●Harish Rao | రైతుల పేరుతో రేవంత్‌రెడ్డి కొత్త డ్రామాలు : హరీశ్‌రావు
- ●PoK Protests | పాకిస్థాన్ మాకొద్దు.. అవసరమైతే ఇండియా సాయం అడుగుతాం: పీవోకే ప్రజల సీరియస్ వార్నింగ్!
- ●CM Revanth Reddy | తవ్విన కొద్ది.. గుట్టల కొద్ది అప్పులు : సీఎం రేవంత్ రెడ్డి
- ●Mahesh Babu | మహేష్ బాబు ఏఎమ్‌బీ మల్టీప్లెక్స్‌కు 35 లక్షల ఫైన్ - రూమర్లపై క్లారిటీ ఇదిగో!

KTR on Revanth Reddy | రూ.30 వేల కోట్లు ఎగ్గొట్టి.. ఆశీర్వాద సభల పేరిట నాటకాలా? సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

Niharika NM | బాలీవుడ్ విలన్‌తో ప్రేమలో పడ్డ తెలుగు హీరోయిన్ ... ఫొటోలు వైరల్

Harish Rao | రైతుల పేరుతో రేవంత్‌రెడ్డి కొత్త డ్రామాలు : హరీశ్‌రావు

PoK Protests | పాకిస్థాన్ మాకొద్దు.. అవసరమైతే ఇండియా సాయం అడుగుతాం: పీవోకే ప్రజల సీరియస్ వార్నింగ్!




