త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hurricane Lala | హ‌వాయి వైపుగా దూసుకొస్తున్న ‘లాలా’.. 155 ఏళ్ల త‌ర్వాత బిగ్ఐలాండ్‌ను నేరుగా తాకే ఛాన్స్‌..!

Hurricane Lala | అమెరికాలోని హవాయి దీవులకు హరికేన్‌ ‘లాలా’ ముప్పు పొంచి ఉన్న‌ది. తుపాను బిగ్‌ ఐలాండ్‌కు చేరువగా కదులుతోంది. దక్షిణ భాగానికి సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అదే జరిగితే 155 ఏళ్ల తర్వాత బిగ్‌ ఐలాండ్‌ను నేరుగా తాకిన తొలి హరికేన్‌గా లాలా నిలవనుంది. ప్రస్తుతం గంటకు 120 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌చండ గాలులు వీస్తున్నాయి.

P

International | Published On Aug 16, 2026, 7.40 am IST

Hurricane Lala | హ‌వాయి వైపుగా దూసుకొస్తున్న ‘లాలా’.. 155 ఏళ్ల త‌ర్వాత బిగ్ఐలాండ్‌ను నేరుగా తాకే ఛాన్స్‌..!
Advertisement
  • 120 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌పండ గాలులు
  • భారీ వర్షాలు, వరదలు

Hurricane Lala | అమెరికాలోని హవాయి దీవులకు హరికేన్‌ ‘లాలా’ ముప్పు పొంచి ఉన్న‌ది. తుపాను బిగ్‌ ఐలాండ్‌కు చేరువగా కదులుతోంది. దక్షిణ భాగానికి సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అదే జరిగితే 155 ఏళ్ల తర్వాత బిగ్‌ ఐలాండ్‌ను నేరుగా తాకిన తొలి హరికేన్‌గా లాలా నిలవనుంది. ప్రస్తుతం గంటకు 120 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌చండ గాలులు వీస్తున్నాయి.

ఐలాండ్‌ను ఖాళీ చేయాల‌ని ఆదేశాలు..

లాలా కేటగిరీ-1 హరికేన్‌గా మారింది. బిగ్‌ ఐలాండ్‌ దక్షిణ ప్రాంతంలో బలమైన గాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎత్తయిన ప్రాంతాల్లో 63.5 సెంటీమీట‌ర్ల వ‌ర‌కు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో కొండచరియలు విరిగిపడడం, ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బిగ్‌ ఐలాండ్‌కు హరికేన్‌ హెచ్చరిక జారీ చేయగా.. మౌయి, మొలోకై, లనై, కహూలావే, ఒహావు, కవాయ్, నిహావు దీవులకు ఉష్ణమండల తుపాను హెచ్చరికలు జారీ చేశారు. పలు ప్రాంతాల్లో సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రజలు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. బలమైన గాలులకు కూలిపోయే అవకాశం ఉన్న భవనాల్లో పశువులను ఉంచొద్ద‌ని అధికారులు చెప్పారు. తుపాను ప్రభావంతో బిగ్‌ ఐలాండ్‌లో సుమారు 10 శాతం విద్యుత్‌ వినియోగదారులకు సరఫరా నిలిచిపోయింది.

అగ్నిప్రమాదాలపైనా ఆందోళన

లాలా ప్రభావంతో బలమైన, పొడి గాలులు వీచే ప్రాంతాల్లో అగ్నిప్రమాదాల ముప్పు కూడా పెరగవచ్చని నిపుణులు ఆఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. 2023లో మౌయిలోని లహైనాలో సంభవించిన భారీ అగ్నిప్రమాదం సమయంలోనూ తుపాను ప్రభావంతో బలమైన గాలులు వీచాయి. దీంతో ఈసారి అధికారులు మరింత అప్రమత్తంగా ఉన్నారు. హవాయిని గతంలోనూ తీవ్ర హరికేన్లు వణికించాయి. 1992లో కేటగిరీ-4 హరికేన్‌ ఇనికి కవాయ్‌ దీవిని తాకి ఆరుగురిని బలిగొంది. వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. సుమారు 3 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లింది. ప్రస్తుతం లాలా కదలికలను అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

Advertisement
Advertisement